గుడ్ న్యూస్...మరింత తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

గత నెల రోజుల వ్యవధిలో పెట్రోల్ లీటరుపై దాదాపు రూ.7.50లు తగ్గింది. డీజిల్ రూ.4లు తగ్గింది. అక్టోబర్ 18 నుంచి ఇంధన ధరలు తగ్గుతూ వస్తున్నాయి.

news18-telugu
Updated: November 19, 2018, 12:43 PM IST
గుడ్ న్యూస్...మరింత తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు దేశీయ మార్కెట్లో మరింత తగ్గాయి. వరుసగా ఐదో రోజు సోమవారం కూడా ఇంధన ధరలు దిగివచ్చాయి. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలకు తోడు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ కాస్త బలపడడం కూడా దీనికి కారణం అవుతోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుపై 17-20 పైసలు మేర తగ్గింది.

దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్ లీటరుపై 19 పైసలు తగ్గి రూ.76.52గా ఉండగా...డీజిల్ కూడా లీటరుపై 17 పైసలు తగ్గి రూ.71.39గా ఉంది. అటు ముంబైలో ఆదివారం రూ.82.23గా ఉన్న లీటరు పెట్రోల్...సోమవారం రూ.82.04కు తగ్గింది. డీజిల్ ఆదివారం రూ.74.97గా ఉండగా...ఈ రోజు రూ.74.79కి తగ్గింది.

హైదరాబాద్ చిల్లర మార్కెట్లో ఆదివారం రూ.81.33గా ఉన్న లీటరు పెట్రోల్...సోమవారం 20 పైసలు తగ్గి రూ.81.13గా ఉంది. అటు ఆదివారం రూ.77.86గా ఉన్న లీటరు పెట్రోల్‌...సోమవారం 19 పైసలు తగ్గి రూ.77.67గా ఉంది.

గత నెల రోజుల వ్యవధిలో పెట్రోల్ లీటరుపై దాదాపు రూ.7.50లు తగ్గింది. డీజిల్ రూ.4లు తగ్గింది. అక్టోబర్ 18 నుంచి ఇంధన ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నవంబరు మాసంలోనే ఇప్పటి వరకు లీటరు పెట్రోల్ ధర రూ.2.80లు తగ్గగా...డీజిల్ రూ.1.80లు తగ్గింది.
ప్రతీకాత్మక చిత్రం


అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు క్రితం ముగింపుతో పోల్చితే సోమవారం 1 శాతం మేర ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. అయినప్పటికీ అక్టోబర్ మాసంలో గరిష్ఠ స్థాయికి చేరిన క్రూడాయిల్ ధరలు...ప్రస్తుతం 25 శాతం మేర తక్కువగా ఉన్నాయి. బ్రెట్ క్రూడాయిల్ ఫ్యూచర్స్‌లో ఒక బ్యాలర్ 67.30 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. డిమాండ్ తగ్గి ఆ మేరకు ధరలు కూడా తగ్గడంతో ఉత్పత్తిని తగ్గించాలని ఆయిల్ ఉత్పత్తి దేశాల సమాఖ్య(ఒపెక్) నిర్ణయించింది. ఇది వరకు రోజుకు 2.4 మిల్లియన్ బ్యారళ్ల క్రూడాయిల్ ఉత్పత్తి చేస్తున్న సౌదీ అరేబియా నేతృత్వంలోని ఒపెక్ దేశాలు...రోజువారీ ఉత్పత్తిని 1.4 మిల్లియన్ బ్యారళ్లకు తగ్గించాలని నిర్ణయించాయి.
First published: November 19, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు