Home /News /business /

PETROL DIESEL PRICE TODAY 6TH JUNE PETROL AND DIESEL PRICES IN METROPOLITAN CITIES PAH

Petrol and Diesel Prices: నేటి పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లివే.. చమురు కంపెనీలు ఏమంటున్నాయంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Today Petrol and Diesel Rates: రోజు మాదిరిగానే ప్రభుత్వ చమురు సంస్థలు సోమవారం ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను విడుదల చేశాయి. జూన్ 06, 2022న కూడా జాతీయ మార్కెట్‌లో వాహన ఇంధనం (పెట్రోల్, డీజిల్) ధరలో ఎలాంటి చేంజ్ లేదు. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
దేశంలో సోమవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Price) కాన్ స్టాంట్ గానే కొనసాగుతున్నాయి. ఇంధన రేట్లలో చమురు కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. మే 21న కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వ (Central Government) నిర్ణయం తర్వాత కొన్ని రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ని తగ్గించాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి సోమవారం (జూన్ 6, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. దేశీయంగా సోమవారం కూడా ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి.

పెట్రోల్‌, డీజిల్ ధరల వివరాలు..

- దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 96.72 కాగా, డీజిల్‌ రూ. 89.62 వద్ద కొనసాగుతోంది.

- దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 111.35 కాగా, డీజిల్‌ రూ. 97.28గా ఉంది.

- చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 102.63 కాగా, డీజిల్ రూ. 94.24గా నమోదైంది.

- బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 101.94 కాగా, డీజిల్‌ రూ. 87.89 వద్ద కొనసాగుతోంది.

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 106.03 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 92.76గా ఉంది.

ఇదిలా ఉండగా, ప్రముఖ కార్ల కంపెనీ హోండా (Honda cars) మరోసారి రెట్లను పెంచింది.
Gas Cylinder: గుడ్ న్యూస్... ఫుడ్ డెలివరీ లాగానే 2 గంటల్లో గ్యాస్ సిలిండర్ డెలివరీ

ప్రస్తుతం.. హోండా సిటీ, హోండా అమేజ్, హోండా డబ్ల్యూఆర్ వీల ధరలను పెంచామని హోండా కార్స్ ఇండియా తాజాగా ప్రకటించింది. తాజా పెంపుతో మోడల్ ను బట్టి ధరలు అందు బాటులో ఉంటాయి. రూపాయలు 11,900 నుంచి రూపాయలు 20000 వేల మధ్య ఉంటుంది. హోండా డీజిల్ వేరియంట్ ఇక నుంచి 12,500 చెల్లించాలి.

అదే విధంగా, డబ్ల్యూఆర్ వీల ఎస్ యూవీ వేరియంట్ రూపాయలు 9 లకలు చెల్లించాలి. ఇక టాప్ వేరియంట్ ధర రూపాయలు 8.88 లక్షల నుంచి రూపాయలు 9 లక్షల వరకు అయ్యింది. అదే విధంగా, హోండా సిటీ సెడాన్ ధర స్టార్టింగ్ లో 11.46 లక్షలు కాగా, ఇప్పుడు రూపాయలు 15.47 లకలకు పెరిగింది.గతేడాది లాంచ్ అయిన హోండా అమేజ్ ఫేస్ లిఫ్ట్ సెడాన్, పెట్రోల్, డీజీల్ వేరియంట్ ధర రూపాయలు 12.500కి పెరిగింది. అదే విధంగా హోండా అమేజ్ ధర 6.43 లకలకు బదులు,6.56 లక్షలకు పెరిగింది.ఇక హోండా జాక్ ధరలు.. రూపాయలు 12,500 లక్షల వరకు పెరిగాయి.


Published by:Paresh Inamdar
First published:

Tags: BUSINESS NEWS, Crude Oil, Diesel price, Petrol prices

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు