భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ ధరలు...హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ఎంతంటే..?

Petrol Price (ప్రతీకాత్మక చిత్రం)

హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 15 పైసలు పెరిగింది. దీంతో రూ.79.81 రూపాయలకు చేరుకుంది. ఇక డీజిలు ధర లీటరుకు ఏకంగా 22 పైసలు పెరిగింది. రూ.72.07 రూపాయల వద్దకు ఎగబాకింది.

  • Share this:
    పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఏడాది కన్నా ఎక్కువ కాలంలో మొట్టమొదటి సారి చమురు సంస్థలు ఈ ధరలు పెంచాయి. పెట్రోలు లీటరుకు అయిదు పైసలు వంతున, డీజిల్‌కు పది పైసలు వంతున సోమవారం ధరలు పెరిగాయి. ఈమేరకు దేశ రాజధానిలో లీటరు పెట్రోలుకు రూ. 75, డీజిల్‌కు రూ.66.04 వంతున ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో నిన్నటి ధరలతో పోలిస్తే లీటరు పెట్రోల్ ధర 15 పైసలు పెరిగింది. దీంతో రూ.79.81 రూపాయలకు చేరుకుంది. ఇక డీజిలు ధర లీటరుకు ఏకంగా 22 పైసలు పెరిగింది. రూ.72.07 రూపాయల వద్దకు ఎగబాకింది. విజయవాడలో పెట్రోల్ ధర 15 పైసలు పెరిగి రూ.79.00 రూపాయలు గానూ, డీజిలు ధర 21పైసలు పెరిగి రూ.71.02 రూపాయలైంది.
    Published by:Krishna Adithya
    First published: