Petrol Price : పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు... ఎన్నికలు అయిపోగానే...

Petrol Price : కీలెరిగి వాతపెట్టడం అంటే ఇదేనేమో... ఎన్నికలు అయ్యే వరకూ పెట్రోల్, డీజిల్ ధరల జోలికి వెళ్లని కేంద్ర ప్రభుత్వం... ఆరు రోజులుగా వడ్డించేస్తోంది,

Krishna Kumar N | news18-telugu
Updated: May 28, 2019, 2:14 PM IST
Petrol Price : పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు... ఎన్నికలు అయిపోగానే...
వివిధ రకాల ఆయిల్ ఉత్పత్తులను ప్రస్తుతం ఉన్న ధరల మీద 57 శాతం వరకు తగ్గించే అవకాశం ఉన్నట్టు
  • Share this:
ప్రతిసారీ ఇంతే. ఎన్నికలు అయిపోగానే... చమురు కంపెనీలు... పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేస్తున్నాయి. మనం గమనించేలోపే రేట్లు దూసుకుపోతున్నాయి. తాజాగా పెట్రోల్ రేటు మరో 10 పైసలు పెరిగి... రూ.75.96కి చేరింది. అలాగే డీజిల్ 5 పైసలు పెరిగి రూ.71.87కి చేరింది. ఇది పెద్ద పెంపు కాదే అని మనం అనుకోవచ్చు. కానీ ఆరు రోజులుగా రోజూ ఇలా ఎంతో కొంత పెంచేస్తూ ఉంటే... వారానికి పెంపు రూపాయి దాకా చేరుతుంది. అంటే నెలకు నాలుగు రూపాయలు వడ్డిస్తున్నట్లే. సపోజ్ ఓ వ్యక్తి... నెలకు 15 లీటర్ల పెట్రోల్ వాడుతుంటే... అతనికి మొదటి నెలకు అయ్యే అదనపు భారం రూ.60. రెండోనెలకు ఇంకా పెరిగి... అదనపు భారం రూ.120 దాటుతుంది. ఇలా నెల నెలా పెట్రోల్‌కి పెట్టే బిల్లు పెరిగిపోతుంది. ఇక కార్లు వాడేవారికి బిల్లు తడిసిపోతుంది.

ఈ పెంపు తమ తప్పు కాదనీ, అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నాయని చెప్పుకుంటున్నాయి చమురు కంపెనీలు. తాజాగా అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.94 శాతం పెరిగి 68.77 డాలర్లకు చేరింది. 2 శాతం పెరిగింది. ఐతే, అంతర్జాతీయంగా రేట్లు తగ్గితే మాత్రం దేశీయ చమురు కంపెనీలు ఆ మేరకు తగ్గించట్లేదు.

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.71.86
ఢిల్లీలో లీటర్ డీజిల్ రూ.66.69
ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.77.47
ముంబైలో లీటర్ డీజిల్ రూ.69.88
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.76కి పైనేహైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ.72కి పైనే
అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.75.96
అమరావతిలో లీటర్ డీజిల్ రూ.71.87
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.75.60
విజయవాడలో లీటర్ డీజిల్ రూ.71.55

ఇలా రేట్లు పెరిగిన ప్రతిసారీ, జేబులు తడుముకోవడం వినియోగదారుల వంతవుతోంది. సుంకాలు తగ్గిస్తే, పెట్రోల్ ధరలు సగానికి తగ్గే అవకాశాలున్నా, కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించట్లేదు.

 

ఇవి కూడా చదవండి :

Video : తల్లి కోసం తల్లడిల్లుతున్న పసి హృదయం...

మండుతున్న ఎండలకు పుచ్చకాయే కరెక్ట్... రోజూ తినాలంటున్న డాక్టర్లు...

ఒక్క తులసి మొక్కను పెంచినా చాలు... ఆరోగ్యమే ఆరోగ్యం

ఎండు ఖర్జూరాలను తేనెలో నానబెట్టి తింటే.... ప్రయోజనాలు ఇవీ...
First published: May 28, 2019, 2:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading