హోమ్ /వార్తలు /బిజినెస్ /

Petrol Price: వాహనదారులకు బిగ్ షాక్... ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Price: వాహనదారులకు బిగ్ షాక్... ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

ఇక ముంబైలో అయితే పెట్రోల్ లీటర్ రూ.92.04కి పెరిగింది. డీజిల్ ధర రూ.82.40

ఇక ముంబైలో అయితే పెట్రోల్ లీటర్ రూ.92.04కి పెరిగింది. డీజిల్ ధర రూ.82.40

Petrol Diesel Prices | మీరు టూవీలర్ వాడుతున్నారా? కారు ఉపయోగిస్తున్నారా? ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్, డీజిల్‌కు కాస్త ఎక్కువగా చెల్లించాలి. ఎందుకో తెలుసుకోండి.

వాహనదారులకు ఏప్రిల్ 1 నుంచి పెద్ద షాక్ తప్పదు. అదే రోజున పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి బీఎస్-6 ఫ్యూయెల్ సప్లై చేస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. ప్రస్తుతం బీఎస్-4 ప్రమాణాల ఇంధనం దేశమంతా సరఫరా అవుతోంది. దీని వల్ల కాలుష్యం ఎక్కువ వెలువడుతుంది. అందుకే 2020 ఏప్రిల్ నుంచి బీఎస్-6 ఇంధనం వాడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీఎస్-4 తర్వాత బీఎస్-5 ఉన్నా... కేంద్రం నేరుగా బీఎస్-6 ఇంధనానికి మారాలని నిర్ణయించింది. బీఎస్-4 ఇంధనంతో పోలిస్తే బీఎస్-6 ఫ్యూయెల్‌తో కాలుష్యం తగ్గుతుంది. ప్రస్తుతం బీఎస్-4 ఫ్యూయెల్ వల్ల ప్రమాదకరమైన సల్ఫర్ ఉద్గారాలు 50 పార్ట్స్ పర్ మిలియన్-ppm ఉన్నట్టు కాలుష్యం లెక్కలు చెబుతున్నాయి. అదే బీఎస్-6 ఇంధనాన్ని ఉపయోగిస్తే సల్ఫర్ ఉద్గారాలు 10 పీపీఎంకు తగ్గుతాయి.

ముందే ప్రకటించిన గడువు ప్రకారం ఏప్రిల్ 1 నుంచి దేశమంతా బీఎస్-6 ఫ్యూయెల్ మాత్రమే లభిస్తుంది. బీఎస్-6 ఫ్యూయెల్ సప్లై చేయడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. అయితే ఇంధన ధరలు ఎంత పెరుగుతాయో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించలేదు. బీఎస్-6 ఫ్యూయెల్ కోసం రిఫైనరీలను అప్‌గ్రేడ్ చేసేందుకు ఆయిల్ కంపెనీలన్నీ రూ.35,000 కోట్లు ఖర్చు పెడితే తాము రూ.17,000 కోట్లు ఖర్చు చేసినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఛైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల స్వల్పంగానే ఉంటుందని, భారీగా ధరల్ని పెంచబోమని అన్నారు. ఇక మార్చి 1 నుంచే బీఎస్-6 ఇంధనాన్ని సప్లై చేస్తామని ఇప్పటికే హెచ్‌పీసీఎల్ ప్రకటించింది.

బీఎస్-6 ఇంధనం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరుగుతాయన్న స్పష్టత లేదు. కానీ... లీటర్‌పై 70 పైసల నుంచి రూ.1.20 వరకు పెరగొచ్చని అంచనా. బీఎస్-6 ఫ్యూయెల్‌కు మారుతున్నట్టు కేంద్రం గతంలోనే ప్రకటించడంతో వాహన కంపెనీలు కూడా బీఎస్-6 వాహనాలనే సిద్ధం చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

IRCTC: రైలులో ఫుడ్ ఫ్రీ... కానీ ఓ కండీషన్

Luxury Trains: ఈ లగ్జరీ రైళ్లల్లో ప్రయాణం అద్భుతం... టికెట్ ధర తెలిస్తే షాకే

Save Money: మీకు రూ.1 కోటి కావాలంటే నెలనెలా జమ చేయండి ఇలా

First published:

Tags: Business, BUSINESS NEWS, Diesel, Diesel price, HPCL, Indian Oil Corporation, Oil prices, Petrol, Petrol price, Petrol prices, Petrol pump

ఉత్తమ కథలు