హోమ్ /వార్తలు /బిజినెస్ /

Petrol and diesel rates Today: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే

Petrol and diesel rates Today: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol and diesel rates) ఆకాశన్నంటుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటి రూ.110కి చేరువగా వెళుతోంది. అయితే శనివారం తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ కరోనా కాలంలో అమాంతం పెరిగాయి.

పెట్రోల్​, డీజిల్ ధరలు (Petrol and diesel Prices) ఆకాశన్నంటుతున్నాయి. లీటర్​ పెట్రోల్​ ధర వంద రూపాయలు దాటి రూ.110కి చేరువగా వెళుతోంది. అయితే శనివారం తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్​ కరోనా కాలంలో అమాంతం పెరిగాయి. ఇక శనివారం హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​పై రూ. 30 పైసల వరకు పెరిగి రూ. 107.71కి చేరింది. డీజిల్ (diesel) ధర రూ.0.22 పైసలు పెరిగి రూ.101.33 గా ఉంది.

తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు చూస్తే..

కరీంనగర్‌లో పెట్రోల్ ధర నిన్న  రూ.0.16 పైసలు తగ్గినా ఈ రోజు ( శనివారం) మళ్లీ రూ.0.50 పెరిగి రూ.107.88గా ఉంది. డీజిల్ ధర రూ.0.60 పైసలు పెరిగి రూ.100.66కు చేరింది. నిజామాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.0.80 పైసలు పెరిగి రూ.109.79 గా ఉంది. డీజిల్ ధర రూ.0.90 పైసలు పెరిగి రూ.102.45 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో..

విజయవాడ (Vijayawada) మార్కెట్‌లో పెట్రోల్ ధరలు స్వల్పంగా పెరిగి రూ.109.70 గా ఉంది.  డీజిల్ ధర రూ.101.74కు చేరింది. విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.108.29గా ఉంది. గత ధరతో పోలిస్తే రూ.0.30 పైసలు పెరిగింది.  విశాఖపట్నం (Visakhapatnam) ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ఈ రోజు రూ.108.93గా ఉంది. నిన్నటికి రూ.0.30 పెరిగిన ధర ఈ రోజు మరో రూ.0.70 పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.101.18గా ఉంది.

ఇక ప్రధాన నగరాల్లో పెట్రోల్​ ధరలు..

న్యూఢిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ. 103.54, ముంబై రూ. 109.54, చెన్నై రూ. 100.01, ,గుర్గావ్ రూ. 101.24, నోయిడా రూ. 100.61, బెంగళూరు రూ. 107.14, పాట్నా రూ. 106.70 గా ఉంది. జైపూర్ రూ. 110.49 , లక్నో రూ. 100.60 త్రివేండ్రం రూ. 105.51 గా ఉంది.

గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా అక్టోబరు 4 నాటి ధరల ప్రకారం 75.05 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

Published by:Prabhakar Vaddi
First published:

Tags: Diesel price, Diesel rate, Petrol prices, Petrol rate

ఉత్తమ కథలు