Home /News /business /

PETROL AND DIESEL PRICES RISE AGAIN TODAY IF YOU WANT TO KNOW EXACT PRICES THEN CLICK HERE PRV

Petrol and diesel rates Today: వాహనదారులకు మళ్లీ షాక్.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలెలా ఉన్నాయంటే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol and diesel rates) ఆకాశన్నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటి రూ.110కి చేరువగా వెళుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్ , డీజిల్ కరోనా కాలంలో అమాంతం పెరిగాయి.

ఇంకా చదవండి ...
    దేశంలో పెట్రోల్​, డీజిల్ ధరలు (Petrol and diesel rates) ఆకాశన్నంటుతున్నాయి. లీటర్​ పెట్రోల్​ ధర వంద రూపాయలు దాటి రూ.110కి చేరువగా వెళుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్ , డీజిల్​ కరోనా కాలంలో అమాంతం పెరిగాయి (rise). హైదరాబాద్‌ (Hyderabad)లో నేడు పెట్రోల్ ధర (petrol price) లీటరుకు రూ.0.31 పైసలు పెరిగి రూ.108.83 అయింది. రూ.100.51 గా ఉన్న డీజిల్ ధర.. ప్రస్తుతం రూ.101.27కి చేరింది. వరంగల్ రూరల్ (Warangal rural) జిల్లాలో 107.85 గా ఉంది. డీజిల్ ధర  రూ.100.81 గా ఉంది.  ఇక వరంగల్‌లో  పెట్రోల్ ధర రూ.0.49 పైసలు పెరిగి రూ.108.02గా ఉంది. డీజిల్ ధర  రూ.100.98 గా ఉంది.

    తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు చూస్తే..

    కరీంనగర్‌ (Karimnagar)లో పెట్రోల్ ధర రూ.108.21గా ఉంది. డీజిల్ ధర రూ.0.11 పైసలు పెరిగి రూ.101.15 కు చేరింది. నిజామాబాద్‌ (Nizamabad)లోనూ ఇంధన ధరలు కాస్త తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.34 పైసలు పెరిగి రూ.110.05 గా ఉంది. డీజిల్ ధర రూ.0.41 పైసలు పెరిగి రూ.102.87 గా ఉంది.

    ఆంధ్రప్రదేశ్​లో..

    ఇక విజయవాడ (Vijayawada)లో పెట్రోల్ ధర రూ.110.39 గా ఉంది.  డీజిల్ ధర రూ.0.13 పైసలు పెరిగి రూ.102.74కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి. విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర (petrol rate) ప్రస్తుతం రూ.110.24గా ఉంది. గత ధరతో పోలిస్తే రూ.0.54 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.102.57గా ఉంది.

    తిరుపతిలో ఇంధన ధరల్లో తగ్గుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.36 పైసలు పెరిగి.. రూ.110.60 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇక డీజిల్ ధర రూ.102.91గా ఉంది. డీజిల్ ధర (diesel rate) లీటరుకు ఏకంగా రూ.0.39 పైసలు పెరిగింది.

    ఇక ప్రధాన నగరాల్లో పెట్రోల్​ ధరలు..

    న్యూఢిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ. 104.14, కోల్‌కతా రూ. 104.80 , ముంబై రూ. 110.12, చెన్నై రూ. 101.51, గుర్గావ్ రూ. 101.44, నోయిడా రూ. 101.40, బెంగళూరు రూ. 107.77, జైపూర్ రూ. 112.06, లక్నో రూ. 101.18  భువనేశ్వర్ రూ. 103.27, పాట్నా రూ107.29 గా ఉంది. త్రివేండ్రం రూ. 105.96 గా ఉంది.

    గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా అక్టోబరు 4 నాటి ధరల ప్రకారం 75.05 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Diesel price, Diesel rate, Petrol price, Petrol rate

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు