లీటర్‌కు రూ.5 పెరగనున్న పెట్రోల్... సౌదీ సంక్షోభమే కారణం

Petrol Price Hike : ఇది మనందరికీ షాకింగ్ విషయమే. ఇప్పటికే మనం పెట్రోల్‌కి చాలా డబ్బు తగలేస్తున్నాం. ట్రాఫిక్ జామ్‌ల వల్ల మనం పోయించుకునే పెట్రోల్, డీజిల్... త్వరగానే అయిపోతోంది. ఇప్పుడు మరింత పెరిగితే మనం ఏం చెయ్యాలి?

Krishna Kumar N | news18-telugu
Updated: September 17, 2019, 8:39 AM IST
లీటర్‌కు రూ.5 పెరగనున్న పెట్రోల్... సౌదీ సంక్షోభమే కారణం
లీటర్‌కు రూ.5 పెరగనున్న పెట్రోల్... సౌదీ సంక్షోభమే కారణం
  • Share this:
గల్ఫ్ దేశాల్లో ఏదైనా సమస్య వచ్చిందంటే చాలు... పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటాయి. ఇప్పుడు అలాంటి సమస్య ఒకటి తలెత్తింది. ఏంటంటే... యెమెన్‌కు చెందిన సౌదీ తిరుగుబాటుదారులు... శనివారం సౌదీ అరేబియాలో డ్రోన్ దాడి చేశారు. ఓ చమురు సంస్థను తగలబెట్టారు. ఆ ఘటన వల్ల రోజుకు 57 లక్షల బ్యారెళ్ల చమురు సప్లై ఆగిపోయింది. అంటే సగం ఉత్పత్తి ఆగిపోయినట్లే. అందువల్ల అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తి 5 శాతం పడిపోయింది. డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయంగా చమురు ధరలు 20 శాతం పెరిగాయి. ఫలితంగా మన దేశంలో ఈ వారాంతానికి పెట్రోల్, డీజిల్ రేట్లు లీటర్‌కు రూ.5 దాకా పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే... భారత్‌కి రెండో అతి పెద్ద చమురు సరఫరాదారు సౌదీ అరేబియాయే.

ఈ చిచ్చును అమెరికా మరింత రాజేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే... దాడికి పాల్పడినవాళ్లపై ప్రతి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రకటించింది. సౌదీ అరేబియా ఓకే అంటే... దాడి చేస్తామంటోంది. ఇక్కడో మెలిక ఉంది... చమురు సంస్థపై దాడి వెనక ఇరాన్ హస్తం ఉందన్నది అమెరికా ఆరోపణ. అంటే... అటు తిరిగి... ఇటు తిరిగీ... చివరకు అమెరికా దాడి చెయ్యాలనుకుంటున్నది ఇరాన్‌పై అన్నమాట. అందులో కొంత నిజం కూడా ఉంది. సౌదీ తిరుగుబాటుదారులకు ఇరాన్ సహకరిస్తోంది.

ప్రస్తుతం క్రూడ్‌ ఆయిల్ ధరలు 12 డాలర్లు పెరిగి 67 డాలర్లకు చేరాయి. 1998 గల్ఫ్‌ యుద్ధం తర్వాత ఈ రేంజ్‌లో చమురు ధరలు పెరగడం ఇదే మొదటిసారి. ఇరాన్‌పై అమెరికా దాడులకు దిగితే... ఆ దేశంలో చమురు ఉత్పత్తి పడిపోతుంది. అందువల్ల కూడా ప్రపంచవ్యాప్తంగా మళ్లీ చమురు కొరత ఏర్పడుతుంది. ఈ విషయంలో అమెరికాకు సమస్యలేవీ ఉండవు. ఎందుకంటే ఆ దేశం చక్కగా షేల్ గ్యాస్ ఉత్పత్తిని పెంచుకుంటుంది. భారత్ లాంటి దేశాలు మాత్రం బుక్కైపోతాయి.

అమెరికా ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు, కరెన్సీ విలువలు పడిపోయాయి. రూపాయి మారకపు విలువ కూడా పడిపోయింది. ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ పడిపోతోంది. చమురు సమస్య మరింత చిక్కుల్లో పడేసేలా ఉంది. మన దగ్గర ఓ 65 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయి. వాటిని వాడుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ... ధరలు పెంచేందుకే చమురు సంస్థలు సిద్ధపడతాయన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి... మనం మన పెట్రోల్, డీజిల్ కోసం మరింత ఎక్కువ మనీ పక్కన పెట్టక తప్పదు.

First published: September 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు