హోమ్ /వార్తలు /బిజినెస్ /

Petrol and diesel Prices: స్థిరంగానే పెట్రోల్​, డీజిల్​ ధరలు.. ప్రధాన నగరాల్లో పెట్రోల్​ ధరలు ఎలా ఉన్నాయంటే..

Petrol and diesel Prices: స్థిరంగానే పెట్రోల్​, డీజిల్​ ధరలు.. ప్రధాన నగరాల్లో పెట్రోల్​ ధరలు ఎలా ఉన్నాయంటే..

ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.120.51, డీజిల్ రూ.104.77, చెన్నైలో పెట్రోల్ రూ.110.85, డీజిల్ రూ.100.94, కోల్‌కతాలో పెట్రోల్ రూ.115.12, డీజిల్ రూ.99.83, బెంగళూరులో పెట్రోల్ రూ.111.09, డీజిల్ రూ.94.79గా ఉంది.

ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.120.51, డీజిల్ రూ.104.77, చెన్నైలో పెట్రోల్ రూ.110.85, డీజిల్ రూ.100.94, కోల్‌కతాలో పెట్రోల్ రూ.115.12, డీజిల్ రూ.99.83, బెంగళూరులో పెట్రోల్ రూ.111.09, డీజిల్ రూ.94.79గా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు చాలా రోజులుగా యథాతథంగా ఉన్నాయి. దీంతో వాహనదారులు ఆనందంగానే ఉన్నారు. చమురు ధరలు మంగళవారం (డిసెంబర్ 14) నాడు స్థిరంగా ఉన్నాయి.

  పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol and diesel Prices) చాలా రోజులుగా యథాతథంగా ఉన్నాయి. దీంతో వాహనదారులు ఆనందంగానే ఉన్నారు. చమురు ధరలు మంగళవారం (డిసెంబర్ 14) నాడు స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు (rates) తగ్గాయి. దీపావళికి ముందు బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు (Rates) తగ్గించాయి.

  తెలుగు రాష్ట్రాల్లో..

  తెలుగు రాష్ట్రాల్లో (telugu States) రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపు పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 మాత్రమే వర్తిస్తోంది. ఢిల్లీలోను అక్కడి ప్రభుత్వం వ్యాట్‌‍ను తగ్గించింది. వ్యాట్‌ను ముప్పై శాతం నుండి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర రూ.8 తగ్గింది. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol and diesel rates) ఇలా ఉన్నాయి.

  ముంబైలో 110కి చేరువగా..

  దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41, చెన్నైలో రూ.101.40, కోల్‌కతాలో రూ.104.67, ముంబైలో రూ.109.98, హైదరాబాద్‌ (Hyderabad)లో రూ.108.20, విశాఖపట్నంలో రూ.109.05గా ఉంది.

  ఢిల్లీలో లీటర్ డీజిల్ రూ.86.67, చెన్నైలో రూ.91.43, కోల్‌కతాలో రూ.89.79, ముంబై (Mumbai)లో లీటర్​ డీజిల్​ ధర రూ.94.14, హైదరాబాద్‌లో డీజిల్​ లీటర్​కు రూ.94.62, విశాఖపట్నం లో లీటర్​ డీజిల్​ .95.18గా ఉంది.

  ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (The new variant of the corona is Omicron) ప్రభావం తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చమురు వినియోగం తిరిగి పుంజుకుంటుందని భావిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో (In the international market) క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. ఆగస్ట్ నెల నుండి ఓ వారంలో గరిష్ట పెరుగుదల గతవారం నమోదు చేసింది. గతవారం బ్రెంట్ క్రూడ్ ఏకంగా 7 శాతం లాభపడింది. ఆ తర్వాత కాస్త ప్రాఫిట్ బుకింగ్ నమోదయింది. బ్రెంట్ క్రూడ్ చివరి వారంలో 75.15 డాలర్ల వద్ద ముగిసింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 71.67 డాలర్ల వద్ద ముగిసింది.

  (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Diesel price, Petrol Price

  ఉత్తమ కథలు