హోమ్ /వార్తలు /బిజినెస్ /

petrol and diesel rates today: వాహనదారులకు గుడ్​న్యూస్​.. స్థిరంగానే పెట్రోల్​, డీజిల్ ధరలు.. ఆయా నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

petrol and diesel rates today: వాహనదారులకు గుడ్​న్యూస్​.. స్థిరంగానే పెట్రోల్​, డీజిల్ ధరలు.. ఆయా నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ తయారు చేసిన ప్రతిపాదనల్లో నాలుగు పనిదినాలు, మూడు సెలవులు ఉండాలనేది ఒకటి. దీనితో సగటు ఇంధనం ఆదా నెలకు 12.2 కోట్లుగా అంచనా వేయబడింది. ఇది సంవత్సరానికి $1.5 బిలియన్లకు చేరుకోవచ్చు. 90 శాతం ఇంధనం పనిదినాల్లోనూ, మిగిలిన 10 శాతం సెలవు దినాల్లోనూ నెలలో వినియోగిస్తుండటం గమనార్హం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ తయారు చేసిన ప్రతిపాదనల్లో నాలుగు పనిదినాలు, మూడు సెలవులు ఉండాలనేది ఒకటి. దీనితో సగటు ఇంధనం ఆదా నెలకు 12.2 కోట్లుగా అంచనా వేయబడింది. ఇది సంవత్సరానికి $1.5 బిలియన్లకు చేరుకోవచ్చు. 90 శాతం ఇంధనం పనిదినాల్లోనూ, మిగిలిన 10 శాతం సెలవు దినాల్లోనూ నెలలో వినియోగిస్తుండటం గమనార్హం.

పెట్రోల్, డీజిల్ ధరలు నెలకు పైగా స్థిరంగా ఉన్నాయి. చమురు ధరలు వరుసగా దాదాపు నెల రోజుల నుంచి బుధవారం (డిసెంబర్ 08) ఉదయం  వరకు స్థిరంగా ఉన్నాయి.

పెట్రోల్, డీజిల్ ధరలు (petrol and diesel rates) నెలకు పైగా స్థిరంగా (Stable) ఉన్నాయి. చమురు ధరలు వరుసగా దాదాపు నెల రోజుల నుంచి బుధవారం (డిసెంబర్ 08) ఉదయం  వరకు స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. కొద్ది రోజుల క్రితం మోడీ ప్రభుత్వం పెట్రోల్ (Petrol) పైన రూ.5, డీజిల్ (diesel) పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి దీపావళికి శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపు పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 మాత్రమే వర్తిస్తోంది. ఇటీవల ఢిల్లీలోను అక్కడి ప్రభుత్వం వ్యాట్‌‍ (VAT)ను తగ్గించింది. వ్యాట్‌ను ముప్పై శాతం నుండి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర (Petrol price) రూ.8 తగ్గింది. దీంతో వివిధ పెద్ద నగరాలతో పోలిస్తే ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు (petrol and diesel price) తక్కువగా ఉన్నాయి.

అయితే దేశంలో అత్యంత తక్కువగా పోర్ట్‌బ్లెయిర్‌లో ఉన్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.82.96, లీటర్ డీజిల్ (Diesel price) రూ.77.13గా ఉంది. అంటే పోర్ట్‌బ్లెయిర్ కంటే ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 12 ఎక్కువగా ఉంది. ఢిల్లీ (Delhi)లో పెట్రోల్ రూ.95.41, చెన్నైలో రూ.101.40, ముంబైలో రూ.109.98, హైదరాబాద్‌లో రూ.108.20, ఢిల్లీలో డీజిల్ లీటర్​ రూ.86.67, ముంబైలో రూ.94.14, హైదరాబాద్‌లో రూ.94.62గా ఉంది.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో..

అంతర్జాతీయంగా చమురు ధరలు ఇటీవల భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా ధరలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.108.20, లీటర్ డీజిల్ రూ.94.62గా ఉంది. ఆదిలాబాద్లో లీటర్​ పెట్రోల్​ ధర 110.58 గా ఉంది. భద్రాద్రి కొత్తగూడెంలో లీటర్​ పెట్రోల్​ ధర రూ. 1096.35 ఉంది.  జగిత్యాలలో రూ. 109.98 గా ఉంది. జోగులాంబ గద్వల్​లో రూ. 110.11 కామారెడ్డిలో రూ. 109.36  కరీంనగర్​లో రూ. 108.07 వరంగల్​లో రూ.  107.69 గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.51, లీటర్ డీజిల్ రూ.96.59గా ఉంది. 

యూరోపియన్ ప్రాంతంలో కరోనా కేసులు పెరగడం, జపాన్, భారత్ వంటి దేశాల్లో చమురు నిల్వలు ఉండటం, ఈ దేశాల్లో ఓవర్-సప్లై, బలహీనమైన డిమాండ్ ఉండటం వంటి అంశాలు ప్రభావం చూపనున్నాయి. బ్రెంట్ క్రూడ్, యూఎస్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ ధరలు తగ్గాయి. యూరోపియన్ దేశాల్లో కరోనా కేసుల ఆందోళన నేపథ్యంలో చమురు డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నారు. దీంతో అంతర్జాతీయంగా ధరలు భారీగా క్షీణించాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గించడం వల్ల ఇప్పుడు భారత్‌లోను ఈ ధరలు మరింత తగ్గిస్తారా అంటే, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు మరికొద్ది రోజులు క్షీణిస్తేనే అది వర్తిస్తుందని అంటున్నారు. దేశీయ రిటైల్ ధరలు 15 రోజుల రోలింగ్ యావరేజ్ విధంగా నిర్ణయించబడుతాయి. కాబట్టి గ్లోబల్ మార్కెట్లో మరిన్ని రోజులు తగ్గితేనే ఇక్కడా తగ్గుతాయి. 

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

Published by:Prabhakar Vaddi
First published:

Tags: Diesel price, Petrol Price

ఉత్తమ కథలు