హోమ్ /వార్తలు /బిజినెస్ /

పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు... 80 రోజుల తర్వాత ఇదే ఫస్ట్...

పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు... 80 రోజుల తర్వాత ఇదే ఫస్ట్...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చివరిసారి మార్చి 16న దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను సవరించారు.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. సుమారు 80 రోజుల తర్వాత తొలిసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. చివరిసారి మార్చి 16న దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను సవరించారు. ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. ఇప్పుడు లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ఆయిల్‌కు డిమాండ్ పెరిగింది. అలాగే, క్రూడాయిల్ కూడా బ్యారెల్ ధర 40 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ క్రమంలో ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ మీద లీటర్‌కు 60 పైసల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే, కరోనా లాక్ డౌన్ కారణంగా పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోయిన కొన్ని రాష్ట్రాలు గతంలో పెట్రోల్, డీజిల్ మీద కరోనా ట్యాక్స్ విధించాయి. గత నెలలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మీద లీటర్‌కు రూ.10, డీజిల్ మీద రూ.13 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ విధించాయి. అయితే, క్రూడాయిల్ ధరలు పతనం కావడంతో అక్కడిక్కడ సర్దుబాటు అయ్యాయి. ప్రజల మీద నేరుగా ధరల భారం పడలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర శుక్రవారం 42 డాలర్లు పలికింది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం 46 శాతం పడిపోయింది.

వివిధ నగరాల్లో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు

నగరంపెట్రోల్ (రూపాయల్లో)డీజిల్ (రూపాయల్లో)
హైదరాబాద్74.6168.42
ఢిల్లీ71.8669.99
బెంగళూరు74.1866.54
చెన్నై76.0768.74
ముంబై78.9168.79

First published:

Tags: Diesel price, Petrol prices

ఉత్తమ కథలు