• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • PETROL AND DIESEL PRICE HIKES ELEVENTH DAY IN A ROW KNOW LATEST RATES IN HYDERABAD SS

Petrol prices: వరుసగా 11వ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు... ఎంతంటే

Petrol prices: వరుసగా 11వ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు... ఎంతంటే

Petrol prices: వరుసగా 11వ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు... ఎంతంటే (ప్రతీకాత్మక చిత్రం)

Petrol Diesel Prices | బండి బయటకు తీస్తున్నారా? ఓసారి ఆలోచించండి. కారులో వెళ్తున్నారా? మీ పర్సులో డబ్బులు ఎక్కువగా పెట్టుకోండి. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి.

  • Share this:
    పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా 11వ రోజు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో బుధవారం లీటర్ పెట్రోల్‌పై 57 పైసలు, లీటర్ డీజిల్‌పై 58 పైసలు పెరిగింది. అంటే ఈ 11 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధర రూ.6 పైనే పెరిగింది. 11 రోజుల్లో పెట్రోల్ ధర రూ.6.02 పెరగగా, డీజిల్ ధర రూ.6.40 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.80.22 కాగా లీటర్ డీజిల్ ధర రూ.74.07. ఇక న్యూ ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.77.28 కాగా, డీజిల్ ధర రూ.75.79. ముంబైలో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.84.15 కాగా, డీజిల్ ధర రూ.74.32. చెన్నైలో పెట్రోల్ ధర రూ.80.86 కాగా, డీజిల్ ధర రూ.73.69. కేంద్ర ప్రభుత్వం వ్యాట్, సెస్ పెంచడంతో ఆయిల్ కంపెనీలు కూడా పెట్రోల్, డీజిల్ ధరల్ని భారీగా పెంచేస్తున్నాయి.

    లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించిన తర్వాత ఆయిల్ కంపెనీలు వాహనదారులకు వరుసగా షాకులిస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా 82 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరలు ఒకేలా ఉన్నాయి. ధరల పెంచకుండా విరామం ప్రకటించాయి ఆయిల్ కంపెనీలు. కానీ లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించిన తర్వాత ఆయిల్ కంపెనీలు ప్రతీ రోజూ పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచుతున్నాయి. జూన్ 7 నుంచి వరుసగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా భారతదేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.

    ఇవి కూడా చదవండి:

    Electric Scooter: 15 రూపాయలకే 100 కిలోమీటర్ల ప్రయాణం... ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతం

    Pension Scheme: ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.10,000 వరకు పెన్షన్

    PAN Card: ఆన్‌లైన్‌లో డూప్లికేట్ పాన్ కార్డు... తీసుకోండి ఇలా
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు