Petrol Rate: భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు...కరోనా దెబ్బకు దిగివస్తున్న ముడిచమురు ధర

Petrol Rate| పెట్రోల్, డీజిల్ ధర గత నెల వ్యవధిలో ఏకంగా రూ .4 తగ్గింది...

news18-telugu
Updated: February 10, 2020, 7:54 AM IST
Petrol Rate: భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు...కరోనా దెబ్బకు దిగివస్తున్న ముడిచమురు ధర
Coronavirus Effect : తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు...
  • Share this:
పెట్రోలు, డీజిల్‌ ధరలు దేశవ్యాప్తంగా భారీగా తగ్గిపోయాయి. వరుసగా మూడవరోజులుగా దేశంలో పెట్రోలు, డీజీల్ ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో పెట్రోలుపై 24 పైసలు, డీజిల్‌పై 27 పైసలు ధర తగ్గింది. ఇప్పటికే ఈ నెలలో పెట్రోల్ లీటరుకు 82 పైసలు, డీజిల్ లీటరుకు 85 పైసలు తగ్గింది. చైనాలో కరోనా వైరస్‌ దెబ్బతో అంతర్జాతీయ చమురు వాణిజ్యం తీవ్రంగా ప్రభావితం అవుతోంది. ఫలితంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పతనం అవుతున్నాయి. కాగా ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ. 72.45, డీజిల్‌ ధర రూ.65.43 గా పలుకుతోంది. అలాగే హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ రూ. 77.08, డీజిల్‌ ధర రూ.71.35 పతనం అయ్యింది. విజయవాడలో లీటరు పెట్రోల్ రూ. 76.63, డీజిల్‌ ధర రూ.70.91, ముంబైలో లీటరు పెట్రోల్ రూ. 78.11, డీజిల్‌ ధరూ.68.57గా పలుకుతోంది.

First published: February 10, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు