హోమ్ /వార్తలు /బిజినెస్ /

Petrol price hike: వరుసగా నాలుగో రోజు పెరిగిన ఇంధన ధరలు.. ఏ రాష్ట్రంలో ఎంత ధర ఉందంటే..?

Petrol price hike: వరుసగా నాలుగో రోజు పెరిగిన ఇంధన ధరలు.. ఏ రాష్ట్రంలో ఎంత ధర ఉందంటే..?

హెచ్ పీసీఎల్ డిపోలో ఖర్చులు తగ్గించుకునేందుకు అధికారులు షిఫ్టుల్లో మార్పులు చేయడంతో సరఫరాపై ప్రభావం పడుతోందని డీలర్లు చెబుతున్నారు. పెట్రోల్ కన్నా డీజిల్ ను ఎంత కావాలంటే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ అధికారులు డీలర్లకు మెసేజ్ లు పంపుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

హెచ్ పీసీఎల్ డిపోలో ఖర్చులు తగ్గించుకునేందుకు అధికారులు షిఫ్టుల్లో మార్పులు చేయడంతో సరఫరాపై ప్రభావం పడుతోందని డీలర్లు చెబుతున్నారు. పెట్రోల్ కన్నా డీజిల్ ను ఎంత కావాలంటే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ అధికారులు డీలర్లకు మెసేజ్ లు పంపుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఆదివారం లీటరు పెట్రోల్ ధర 35 పైసలు పెరిగింది. ఇలా వరుసగా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్పై 35 పైసలు పెరగడంతో ఆల్ టైం రికార్డు స్థాయికి చేరాయి.

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఆదివారం లీటరు పెట్రోల్​ ధర 35 పైసలు పెరిగింది. ఇలా వరుసగా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్​పై 35 పైసలు పెరగడంతో ఆల్​ టైం రికార్డు స్థాయికి చేరాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ల నోటిఫికేషన్ ప్రకారం, ఢిల్లీలో లీటర్​ పెట్రోల్ ధర రూ. 105.84 ఉండగా.. ముంబైలో రూ. 111.77 గరిష్ట ధరకి చేరింది. ఇక, ముంబైలో లీటర్​ డీజిల్ ధర రూ. 102.52 వద్ద ఉండగా.. ఢిల్లీలో రూ. 94.57 వద్దకి చేరింది. ఈ ధరల పెరుగుదలతో, ఇప్పుడు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు రూ. 100 మార్కును దాటాయి. రాజస్థాన్‌లోని సరిహద్దు పట్టణమైన గంగానగర్‌లో ఇంధన ధర దేశంలోనే అత్యధికంగా ఉంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ .117.86, డీజిల్ ధర రూ. 105.95 గా ఉంది.

అయితే, ద్విచక్ర వాహనాలు, కార్లలో ఉపయోగించే పెట్రోల్ ఇప్పుడు విమానయాన సంస్థలకు విక్రయించే ఏవియేషన్​ టర్బైన్ ఫుయల్​ (ATF) ధర కంటే 33 శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం. ఢిల్లీలో లీటర్ ఏటీఎఫ్​ రూ. 79 వద్ద అందుబాటులో ఉంది. కాగా, సెప్టెంబర్ చివరి వారం నుంచి పెట్రోల్ ధర 16వ సారి, డీజిల్ ధర19వ సారి పెరగడం గమనార్హం. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర రూ .100 కంటే ఎక్కువ ఉండగా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, బీహార్, కేరళ, కర్ణాటక, లడఖ్​తో సహా అనేక రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో డీజిల్ ధరలు రూ. 100 రికార్డును దాటిపోయాయి. స్థానిక పన్నుల పరిధిని బట్టి రాష్ట్రం నుండి రాష్ట్రానికి ఇంధన ధరలు భిన్నంగా ఉంటాయి.

Maa Elections 2021: మా ఎన్నికల ఎఫెక్ట్.. ఆ నినాదం ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఉంటుందా ?

YS Jagan: జగన్‌ను టెన్షన్ పెడుతున్న వైఎస్ఆర్ సన్నిహితుడు.. వైసీపీలో టెన్షన్

అంతర్జాతీయ మార్కెట్​లో పెరిగిన బ్రెంట్​ క్రూడ్​ ఆయిల్​ ధర..

అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్​ ధర ఏడు సంవత్సరాల్లో మొదటిసారిగా బ్యారెల్‌ చమురు ధర 84.8 డాలర్లను తాకింది. గత నెలలో బ్రెంట్ క్రూడ్​ ఆయిల్​ ధర USD 73.51 వద్ద ట్రేడయ్యింది. భారతదేశం ఇతర దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నందున అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుకుంటూ పోతుంది. గత నెలలో డీజిల్ ధరలు లీటరుకు రూ .5.95 పెరగగా, పెట్రోల్ ధర రూ .4.65 కు పెరిగింది. ఇక, మే 4 నుంచి జూలై 17 మధ్య పెట్రోల్ ధర రూ .11.44, డీజిల్ ధర రూ. 9.14 వరకు పెరిగింది.

First published:

Tags: Diesel, Petrol

ఉత్తమ కథలు