PERSONAL LOAN VS PERSONAL LINE OF CREDIT KNOW THE DIFFERENCES AND HOW TO CHOOSE BETWEEN THEM GH VB
Different Types of Loans: పర్సనల్ లోన్ , పర్సనల్ లైన్ ఆఫ్ క్రెడిట్.. వీటిలో ఏది బెస్ట్ లోన్ ఆప్షన్..?
ప్రతీకాత్మక చిత్రం
మార్కెట్లో సాధారణంగా అనేక రకాల రుణాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో వ్యక్తిగత రుణాలు, వ్యక్తిగత లైన్ క్రెడిట్ రుణాలు ప్రధానమైనవి. ఈ రెండు రకాల రుణాల వివరాలు, వాటి మధ్య తేడాలు, ప్రయోజనాలు తెలుసుకుందాం.
తమ అవసరాల కోసం ఎవరైనా రుణాలు తీసుకోవడం సహజం. అయితే తీసుకున్న రుణాలను వేటిమీద ఖర్చుచేయాలి, ఎలాంటివి కొనుగోలు చేయాలన్న విషయాలపై పెద్దగా అవగాహన ఉండదు. దీంతోపాటు ఎలాంటి అవసరాలకు ఎలాంటి లోన్(Loan) తీసుకోవాలో కూడా కొందరికి తెలియదు. సాధారణ ఖర్చుల కోసం లేదా విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయాలన్న కోరికను తీర్చుకోవడానికైతే సాధ్యమైనంత వరకు లోన్స్ జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. అయితే, క్యాపిటల్(Capital) గూడ్స్ కొనుగోలు, ఆదాయ మార్గాలను పెంచుకోవడం కోసమైతే రుణాలను తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు. మార్కెట్లో(Market) సాధారణంగా అనేక రకాల రుణాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో వ్యక్తిగత రుణాలు, వ్యక్తిగత లైన్ క్రెడిట్ రుణాలు(Credit Loans) ప్రధానమైనవి. ఈ రెండు రకాల రుణాల వివరాలు, వాటి మధ్య తేడాలు, ప్రయోజనాలు తెలుసుకుందాం.
పర్సనల్ లోన్:
ఇది ఒక రకమైన క్రిడిట్. ఇక్కడ రుణగ్రహీత నిర్ణీత మొత్తం మొత్తాన్ని తీసుకుంటారు. అనంతరం నిర్ణీత వ్యవధిలో నిర్ణీత చెల్లింపు మొత్తంలో దాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా ఇది అంత సురక్షితమైంది కాదు.
పర్సనల్ లైన్ ఆఫ్ క్రెడిట్ (PLOC):
ఇందులో గరిష్ట పరిమితి వరకు రుణాన్ని తీసుకునే వెసులుబాటు ఉంటుంది. తిరిగి నగదు చెల్లించవచ్చు. అవసరముంటే మళ్లీ నగదును డ్రా చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. రుణాలు తీసుకునేటప్పుడు రుణగ్రహీతల సౌలభ్యం కోసం లైన్లు అందుబాటులో ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇవి క్రెడిట్ కార్డులగా పనిచేస్తాయి.
పర్సనల్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. అదే పర్సనల్ లైన్ ఆఫ్ క్రెడిట్లో మాత్రం వడ్డీ రేటు సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎక్కువ క్రెడిట్ స్కోర్ చేస్తే... వడ్డీరేటు తక్కువ పడే అవకాశం ఉంది.
మీరు నిర్దిష్టమైన వడ్డీ చెల్లింపునకు ప్రాధాన్యతనిచ్చి, ఒకేసారి కొంత మొత్తంలో నగదు తీసుకోవాలంటే వ్యక్తిగత రుణాలు తీసుకోవడం ఉత్తమం. నిర్దిష్టంగా లేని వడ్డీ చెల్లింపులు మీకు సౌకర్యవంతంగా ఉండి.. అవసరమైనప్పుడు నగదును డ్రా చేసుకునే సౌకర్యం ఉండాలంటే మీరు PLOC రుణాలు మీకు ఉత్తమ మార్గం.
నగదును అప్పుగా తీసుకోవలసిన అవసరాన్ని బట్టి కొన్ని సమయాల్లో క్రెడిట్ లైన్ రుణానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇతర సందర్భాల్లో వ్యక్తిగత రుణాలు ఉత్తమం. ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకుంటూ దేన్ని ఎంపిక చేసుకుంటే దీర్ఘకాలంలో లబ్ధిచేకూరుతుందో వాటికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.
పర్సనల్ లైన్ ఆఫ్ క్రెడిట్ గురించి Vivifi ఇండియా ఫైనాన్స్ సంస్థ CEO, వ్యవస్థాపకుడు అనిల్ పినపాల ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.... ‘‘EMI రుణం మాదిరి కాకుండా తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడానికి సమయాల్లో ఫ్లెక్సిబులిటీ ఉండటం వ్యక్తిగత క్రెడిట్ లైన్ రుణాల ప్రత్యేకత. అదే EMI అయితే నిర్ణీత మొత్తాన్ని నిర్ణీత కాల వ్యవధిలోనే ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. FlexPay అందించే క్రెడిట్ లైన్ కూడా మీ అవసరాలకు ఎప్పటికప్పుడు ఫైనాన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రతిసారీ రుణం కోసం దరఖాస్తు చేయనవసరం లేకుండా ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు రుణాలు తీసుకోవచ్చు’’ అని వివరించారు.
అలాగే చిన్న మొత్తంలో నగదు అవసరం అనుకుంటే క్రెడిట్ లైన్ లోన్స్ తీసుకోవడం మేలన్నారు. మీకు నగదు దొరక్క కష్టపడుతున్నప్పుడు EMI లోన్లాగా ఇది భారం కాదన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మీ రీపేమెంట్ బాధ్యతలకు నిర్వర్తించడం ముఖ్యం. ఎందుకంటే భవిష్యత్లో ఏర్పడే అవసరాలపై క్రెడిట్ లభ్యతను ప్రభావితం చేస్తుందని అనిల్ పేర్కొన్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.