హోమ్ /వార్తలు /బిజినెస్ /

Instant Loan: బంపరాఫర్.. నిమిషాల్లో రూ.5 లక్షల రుణం, చార్జీలు మాఫీ!

Instant Loan: బంపరాఫర్.. నిమిషాల్లో రూ.5 లక్షల రుణం, చార్జీలు మాఫీ!

 Instant Loan: లోన్ తీసుకునే వారికి బంపరాఫర్.. నిమిషాల్లో రూ.5 లక్షల రుణం, చార్జీలు మాఫీ!

Instant Loan: లోన్ తీసుకునే వారికి బంపరాఫర్.. నిమిషాల్లో రూ.5 లక్షల రుణం, చార్జీలు మాఫీ!

Money | చేతిలో డబ్బులు లేవా? అత్యవసరంగా పని పడిందా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. అర్హత ఉన్న వారు సులభంగానే లోన్ పొందొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Loan | డబ్బుతో అవసరం పడిందా? వెంటనే లోన్ పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. మనీ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ఎఫ్ఐ మనీ తాజాగా తీపికబురు అందించింది. రుణ సదుపాయం కల్పిస్తోంది. కస్టమర్లకు రుణాలు అందిస్తోంది. దీని కోసం ప్రైవేట్ రంగ ప్రముఖ బ్యాంక్ (Bank) ఫెడరల్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో ఎఫ్ఐ మనీ ఇప్పుడు ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ (Instant Loan) సర్వీసులు కూడా అందిస్తోంది.

పేపర్‌లెస్ విధానంలో ప్రిఅప్రూవ్డ్ రుణాలు పొందొచ్చు. అర్హత కలిగిన కస్టమర్లు వెంటనే లోన్ పొందొచ్చు. ధశల వారీగా ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ ఫెసిలిటీని విస్తరించుకుంటూ వస్తామని కంపెనీ తెలిపింది. రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ పొందొచ్చని పేర్కొంటోంది. అయితే ఈ సేవలు ఇప్పుడు కొంత మందికే అందుబాటులో ఉండొచ్చు. రానున్న వారాల్లో అందరికీ ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ఎఫ్ఐ మనీ పేర్కొంటోంది.

ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.25,000 డిస్కౌంట్.. కొత్త ఏడాది కళ్లుచెదిరే ఆఫర్!

దేశంలో క్రెడిట్ డిమాండ్ పెరిగిందని, డిపాజిట్ల పెరుగుదల మాత్రం తగ్గిందని ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు బ్యాంకులను కూడా హెచ్చరించింది. అంటే రుణాలకు వ్యవస్థలో ఫుల్ డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎఫ్ఐ మనీ కూడా ఇన్‌స్టంట్ లోన్ సర్వీసులు తీసుకువచ్చింది. బెంగళూరు కేంద్రంగా సేవలు అందిస్తున్న ఈ సంస్థకు ఆర్‌బీఐ ఆమోదం ఉంది.

రూ.2 వేలు, రూ.500, రూ.200, రూ.100 నోట్లపై రాస్తే చెల్లవా? కేంద్రం ఏమంటోందంటే..

కాగా ఎఫ్ఐ మనీ నుంచి పొందే రుణాలను సులభంగానే తిరిగి చెల్లించొచ్చు. ఎలాంటి ప్రి-క్లోజ్ చార్జీలు ఉండవు. మీ వద్ద డబ్బులు ఉంటే.. ముందుగానే లోన్ మొత్తం చెల్లించొచ్చు. చాలా మందికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. మీరు కూడా ఎఫ్ఐ మనీ నుంచి లోన్ పొందాలని భావిస్తే.. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ముందుగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత యాప్ నుంచే లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. రుణ అర్హత ఉంటే మాత్రం త్వరితగతిన లోన్ వచ్చేస్తుంది. లేదంటే లేదు.

అధిక క్రెడిట్ స్కోర్ కలిగిన వారికి సులభంగా రుణాలు వస్తాయని చెప్పుకోవచ్చు. అందువల్ల మీరు కూడా మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో చెక్ చేసుకోవడం ఉత్తమం. క్రెడిట్ స్కోర్ బాగులేకపోతే దాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అయితే దీనికి ఈఎంఐలు కరెక్ట్ టైమ్‌కు కడుతూ రావాలి. అలాగే బకాయిలను దించుకోవాలి. అప్పుడు క్రెడిట్ స్కోర్ మెరుగు పడుతుంది. ఇకపోతే డిజిటల్ లోన్ యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఆర్‌బీఐ అప్రూవ్డ్ లెండింగ్ యాప్స్ నుంచే లోన్ పొందడం ఉత్తమం.

First published:

Tags: Banks, Loan apps, Money, Personal Finance, Personal Loan

ఉత్తమ కథలు