Personal Loan Rates | వ్యక్తిగత రుణం తీసుకోవాలని చూస్తున్నారా? అయితే మీరు ముందుగా చేయాల్సిన పని ఒకటుంది. అదే పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేట్లను చెక్ చేసుకోవాలి. రుణాలపై వడ్డీ రేట్లు అనేవి బ్యాంక్ (Bank) ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. అందుకే లోన్ (Loan) తీసుకోవడానికి ముందే వడ్డీ రేట్లను ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందులో అయితే తక్కువ వడ్డీ ఉందో అక్కడే లోన్ తీసుకోవడం ఉత్తమం. ఇంకా ప్రాసెసింగ్ ఫీజు, ప్రిక్లోజింగ్ చార్జీలు వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం 25 బ్యాంకుల్లో వడ్డీ రేట్లను ఒకసారి తెలుసుకుందాం.
బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర – 8.9 శాతం
బ్యాంక్ ఆఫ్ ఇండియా – 9.75 శాతం
పంజాబ్ నేషనల్ బ్యాంక్ – 9.8 శాతం
బ్యాంక్ ఆఫ్ బరోడా – 10.25 శాతం
కోటక్ మహీంద్రా బ్యాంక్ – 10.25 శాతం
ఇండియన్ బ్యాంక్ – 10.3 శాతం
ఫెడరల్ బ్యాంక్ – 10.49 శాతం
ఐడీఎఫ్సీ బ్యాంక్ – 10.49 శాతం
ఇండస్ఇండ్ బ్యాంక్ – 10.49 శాతం
ఐసీఐసీఐ బ్యాంక్ – 10.5 శాతం
ఈ ప్రభుత్వ స్కీమ్‌లో చేరితే రూ. 41 లక్షలు మీవే.. ఎలానో తెలుసుకోండి!
పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ – 10.55 శాతం
ఎస్బీఐ – 10.65 శాతం
యస్ బ్యాంక్ – 10.99 శాతం
ఐడీబీఐ బ్యాంక్ – 11 శాతం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ – 11 శాతం
యూనియన్ బ్యాంక్ – 11.2 శాతం
సెంట్రల్ బ్యాంక్ – 11.75 శాతం
ఐఓబీ – 11.9 శాతం
కరూర్ వైశ్యా బ్యాంక్ – 11.95 శాతం
యూకో బ్యాంక్ – 11.95 శాతం
యాక్సిస్ బ్యాంక్ – 12 శాతం
ధనలక్ష్మీ బ్యాంక్ – 12.4 శాతం
సౌత్ ఇండియన్ బ్యాంక్ – 12.5 శాతం
కెనరా బ్యాంక్ – 13.15 శాతం
కర్నాటక బ్యాంక్ – 13.48 శాతం
బంగారం కొనాలనుకునే వారికి ఊరట.. నేటి ధరలు ఇలా!
నవంబర్ 29 నాటికి అందుబాటులో ఉన్న వడ్డీ రేట్లు ఇవి. బ్యాంకులు ఎప్పటికప్పుడ వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటాయి. ఆర్బీఐ రెపో ప్రాతిపదికన రుణ రేట్లు కూడా మారతాయి. అందువల్ల లోన్ తీసుకోవాలని భావించే వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. రూ.5 లక్షల వరకు పర్సనల్ లోన్ తీసుకోవాలని భావిస్తే.. నెలకు రూ. 10,356 నుంచి (8.9 శాతం వడ్డీ ప్రకారం) ఈఎంఐ ప్రారంభం అవుతుంది. ఇక్కడ లోన్ టెన్యూర్ 5 ఏళ్లు. అదే గరిష్ట వడ్డీ రేటు 13.48 శాతం పరంగా చూస్తే.. రూ. 5 లక్షల రుణ మొత్తానికి ఈఎంఐ రూ. 11,500గా ఉంటుంది. ఇలా వడ్డీ రేటు మారే కొద్ది ఈఎంఐ కూడా మారుతూ ఉంటుంది. అలాగే లోన్ తీసుకున్న వారు లోన్ టెన్యూర్ పూర్తయ్యే వరకు లోన్‌ను క్లోజ్ చేసుకోకపోవడం ఉత్తమం. ముందే చేసుకుంటే నష్టపోావాల్సి వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, HDFC bank, Icici bank, Personal Finance, Personal Loan, Sbi