మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందా? మీరు ఏదైనా లోన్‌కు ఈఎంఐ చెల్లిస్తున్నారా? అయితే మీరు చెల్లించే ప్రతీ ఈఎంఐ మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. క్రెడిట్ స్కోర్‌నే సిబిల్ స్కోర్ అంటారు. క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. సిబిల్ స్కోర్ 750 కన్నా ఎక్కువ ఉంటే క్రెడిట్ స్కోర్ బాగా ఉన్నట్టు గుర్తిస్తాయి బ్యాంకులు. ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు క్రెడిట్ కార్డులు, రుణాలు ఇచ్చేందుకు మొగ్గు చూపిస్తుంటాయి. అయితే క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే సరిపోదు, ఆ స్కోర్‌ను మెయింటైన్ చేయడం కూడా అవసరం. చిన్న తప్పు చేసినా క్రెడిట్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందులో ప్రధానమైన 5 తప్పుల గురించి తెలుసుకొని, మీరు ఆ తప్పులు చేయకుండా మీ క్రెడిట్ స్కోర్ కాపాడుకోండి.
1. మీరు రుణాలు తీసుకున్నారా? అయితే నెలనెలా ఈఎంఐ గడువు లోగా చెల్లించండి. లాస్ట్ డేట్ పట్టించుకోకుండా ఒక్క రోజు ఆలస్యంగా ఈఎంఐ చెల్లించినా మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. బ్యాంకులు పెనాల్టీ కూడా వసూలు చేస్తాయి. అందుకే మర్చిపోకుండా ఈఎంఐలు గడువులోగానే చెల్లించండి. మీ ఈఎంఐలకు ఎలక్ట్రానిక్ క్లియర్స్ సిస్టమ్ మ్యాండేట్ సెట్ చేయడం ద్వారా నెలనెలా మీ ఈఎంఐ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. లోన్లు మాత్రమే కాదు క్రెడిట్ కార్డులకూ ఇదే వర్తిస్తుంది.
Pension Scheme: ఈ స్కీమ్‌లో నెలకు రూ.5,000 పెన్షన్ గ్యారెంటీ... వివరాలివే
SBI: షాపులో కార్డు స్వైప్ చేస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు
2. మీకు లోన్లు ఎక్కువ తీసుకునే అలవాటు ఉందా? అయితే మీ క్రెడిట్ స్కోర్‌కు ముప్పు తప్పదు. ఎక్కువగా పర్సనల్ లోన్స్ తీసుకోకుండి. క్రెడిట్ కార్డుపైనా రుణాలు తీసుకోవద్దు. మీ టేక్ హోమ్ సాలరీలో 50 శాతం కన్నా ఎక్కువ ఈఎంఐలు ఉండకూడదు. ఉదాహరణకు మీ టేక్ హోమ్ సాలరీ రూ.30,000 అయితే మీ ఈఎంఐలు రూ.15,000 మించకూడదు.
3. క్రెడిట్ కార్డు ఎక్కువగా ఉపయోగించొద్దు. లిమిట్ ఉంది కదా అని మొత్తం వాడెయ్యకూడదు. క్రెడిట్ యుటీలైజేషన్ రేషియోను బ్యాంకులు, రేటింగ్ ఏజెన్సీలు పరిగణలోకి తీసుకుంటాయి. మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో 30 శాతం కన్నా తక్కువే ఉండాలి. అంటే మీ క్రెడిట్ లిమిట్లో 30 శాతం కన్నా తక్కువే ఉపయోగించాలి. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు క్రెడిట్ లిమిట్ రూ.1,00,000 అయితే మీరు రూ.30,000 వరకు మాత్రమే ఉపయోగించాలి.
EMI Moratorium: వాయిదా వేసిన ఈఎంఐ కట్టడానికి 4 ఆప్షన్స్
Jio IPL Plans: స్మార్ట్‌ఫోన్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు చూడాలా? జియో క్రికెట్ ప్లాన్స్ ఇవే
4. మీరు క్రెడిట్ కార్డ్ బిల్లులను సెటిల్మెంట్ వరకు తీసుకురావొద్దు. అంటే బిల్లు కట్టకపోతే బ్యాంకులు సెటిల్మెంట్ ఆప్షన్ ఇస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ ఒక్కసారి సెటిల్మెంట్ ద్వారా చెల్లింపులు చేశారంటే క్రెడిట్ స్కోర్ దారుణంగా పడిపోతుంది.
5. ఎక్కువగా లోన్లకు అప్లై చేయొద్దు. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు లోన్ అప్లికేషన్స్‌ని రిజెక్ట్ చేస్తుంటాయి. ఇలాంటి సందర్భంలో వేర్వేరు బ్యాంకుల్లో లోన్లకు అప్లై చేస్తుంటారు. ఇలా ఎక్కువసార్లు లోన్లకు అప్లై చేయడం, అప్లికేషన్లు తిరస్కరణకు గురి కావడం వల్ల కూడా క్రెడిట్ స్కోర్ పడిపోతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loans, Car loans, Credit cards, Gold loans, Home loan, Housing Loans, Personal Finance, Personal Loan