హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Loan: గోల్డ్ లోన్ కట్టలేకపోతున్నారా? ఈ ఆప్షన్స్ మీకోసమే

Gold Loan: గోల్డ్ లోన్ కట్టలేకపోతున్నారా? ఈ ఆప్షన్స్ మీకోసమే

Gold Loan: గోల్డ్ లోన్ కట్టలేకపోతున్నారా? ఈ ఆప్షన్స్ మీకోసమే
(ప్రతీకాత్మక చిత్రం)

Gold Loan: గోల్డ్ లోన్ కట్టలేకపోతున్నారా? ఈ ఆప్షన్స్ మీకోసమే (ప్రతీకాత్మక చిత్రం)

Gold Loan | గోల్డ్ లోన్ తీసుకున్నవారికి బ్యాంకులు, పైనాన్స్ సంస్థలు రీపేమెంట్ చేయడానికి అనేక ఆప్షన్స్ ఇస్తుంటాయి. వాటిలో ఏ ఆప్షన్ ఎంచుకుంటే ఉపయోగమో తెలుసుకోండి.

ఈ మధ్య గోల్డ్ లోన్ తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి రుణాలు మంజూరు చేయడం సులభం కాబట్టి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఎక్కువ మందికి గోల్డ్ లోన్లు ఇస్తుంటాయి. లోన్ రీ పేమెంట్ కూడా సులభంగా చేసే అవకాశాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. తీసుకున్న గోల్డ్ లోన్లు రీ పేమెంట్ చేయడానికి ఉన్న మార్గాలు తెలుసుకుందాం.

1. నెలవారీ వడ్డీ మాత్రమే చెల్లించడం: ఈ ఆప్షన్‌లో గోల్డ్ లోన్‌పై వడ్డీని EMIల మాదిరిగా తిరిగి చెల్లించవచ్చు. అసలు మొత్తాన్ని మెచ్యూరిటీపై పూర్తిగా చెల్లించాలి. గోల్డ్ లోన్‌పై చెల్లించాల్సిన వడ్డీ, అసలు చేతిలో లేనప్పుడు వినియోగదారులు ఈ పద్ధతిని ఎంచుకోవచ్చు. లోన్ తీసుకున్నవారు గడువు ముగిసే వరకు వడ్డీని మాత్రమే చెల్లించొచ్చు. ఒకవేళ తక్కువ వడ్డీని ప్రతినెలా చెల్లిస్తే. గడువు తీరేనాటికి ఖాతాదారుడు చేయాల్సిన లోన్ రీపేమెంట్ ఎక్కువ అవుతుంది. అందువల్ల నెలవారీ వడ్డీ చెల్లింపు ఆప్షన్ను ఎంచుకోవాలనుకునేవారు రీ పేమెంట్ గురించి బ్యాంకులో ఆరా తీయాలి. మెచ్యూరిటీ నాటికి చెల్లించాల్సిన అసలు, వడ్డీ ఎంత అవుతుందో తెలుసుకున్న తరువాతే ఈ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. వడ్డీతో పాటు అసలును కొంచెంకొంచెంగా చెల్లిస్తూ ఉంటే మెచూరిటీ నాటికి చెల్లించాల్సిన మొత్తం తగ్గుతుంది. దీంతో ఒకేసారి ఎక్కువ మొత్తంలో రీపేమెంట్ చేయాల్సిన అవసరం లేకుండా చూసుకోవచ్చు. ఉదాహరణకు.. ఓ వ్యక్తి రూ.5 లక్షలు గోల్డ్ లోన్ తీసుకున్నారనుకుందాం. దాని రీపేమెంట్ గడువు మూడేళ్లు. వడ్డీ రేటు సంవత్సరానికి 7.50 శాతం. ఈ పద్ధతిలో గడువు వరకు మీరు ప్రతి నెలా రూ.3,125 చెల్లించవచ్చు. ఇలా మూడేళ్ళలో మీరు మొత్తం రూ.1,12,500 వడ్డీగా చెల్లిస్తారు. అంటే మెచ్యూరిటీ నాటికి మీరు రూ.5 లక్షలు అసలు మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది.

SBI ATM: అలర్ట్... ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? కొత్త రూల్ తెలుసుకోండి

Smartphone: రూ.20,000 లోపు బడ్జెట్‌లో 8 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...

2. నెలవారీ EMIలు: ప్రతి నెలా ఎంతో కొంత ఆదాయం కచ్చితంగా వస్తుందనే భరోసా ఉన్నవారు ఈ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఈ పద్ధతిలో లోన్ తీసుకున్న తరువాత నుంచి ప్రతి నెలా వడ్డీ, అసలు మొత్తాన్నికొంచెంకొంచెం రీ పేమెంట్ చేయొచ్చు. ఉద్యోగం, వ్యాపార మార్గాల ద్వారా నెలవారీ జీతాలు అందుకునేవారికి ఇది సరైన ఎంపిక. మొదటి నుంచే ప్రిన్సిపల్ అమౌంట్‌ను చెల్లించడం ద్వారా తక్కువ వడ్డీ రేటు వర్తిస్తుంది. ఉదాహరణకు.. రూ.5 లక్షల గోల్డ్ లోన్‌ను ప్రామాణికంగా తీసుకుంటే... లోన్ తీసుకున్నప్పటి నుంచి గడువు ముగిసే నాటికి మీరు మొత్తం రూ.59,910 వడ్డీ మాత్రమే చెల్లిస్తారు.

3. బుల్లెట్ రీ పేమెంట్: ఈ ఆప్షన్‌లో బ్యాంక్ నెలవారీగా వడ్డీ విధిస్తుంది. కానీ ఈ వడ్డీని అసలుతో కలిపి గడువు తీరేనాటికి చెల్లించాలి. ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు ఉండే స్వల్పకాలిక గోల్డ్ లోన్లకు ఈ ఆప్షన్ మంచిది. ఈ పద్ధతిలో బ్యాంకులు తక్కువ లోన్ టూ వ్యాల్యూ (LTV) ఇస్తూ, దానిపై అధిక వడ్డీ విధించొచ్చు. బుల్లెట్ రీ పేమెంట్ పద్ధతిలో గడువు ముగిసేనాటికి చెల్లించాల్సిన వడ్డీ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒక సంవత్సరానికి రూ.5 లక్షల గోల్డ్ లోన్‌ను ప్రామాణికంగా తీసుకుంటే... బుల్లెట్ రీ పేమెంట్ పద్ధతిలో సంవత్సరానికి తొమ్మిది శాతం చొప్పున రూ.45,000 వడ్డీ చెల్లించాలి. లోన్ టెన్యూర్ ముగిసే సమయానికి మొత్తం రూ.5.45 లక్షలు రీ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది.

SBI Home Loan: గుడ్ న్యూస్... హోమ్ లోన్ EMI తగ్గించుకోవడానికి ఛాన్స్ ఇచ్చిన ఎస్‌బీఐ

PM Kisan Scheme: పీఎం కిసాన్ నగదు ఏడాదికి రూ.12,000 చేస్తారా? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

4. పాక్షిక చెల్లింపులు: ఈ పద్ధతిలో గోల్డ్ లోన్ తీసుకున్న వ్యక్తి దగ్గర ఎప్పుడు డబ్బు ఉంటే అప్పుడు రీ పేమెంట్ చేయొచ్చు. నిర్ణీత మొత్తం అని కాకుండా ఎక్కువ డబ్బు చేతిలో ఉంటే, ఎక్కువ మొత్తం రీ పేమెంట్ చేయొచ్చు. ఇది ఈఎమ్ఐ వంటిది కాదు. వడ్డీ, అసలు.. రెండింటినీ పాక్షికంగా లేదా ఎక్కువ మొత్తంలో చెల్లించేందుకుకు బ్యాంకులు అనుమతిస్తాయి. సాధారణంగా ఈ ఆప్షన్ ఎంచుకునేవారికి వడ్డీ రేటును సంవత్సరానికి కాకుండా ఒక్కో రోజుకి లెక్కిస్తారు. అంటే గడువు ముగిసేనాటికి వడ్డీతో పాటు అసలు మొత్తం కూడా రీ పేమెంట్ చేస్తే.. ఆ మేరకు వడ్డీ రేటు తగ్గుతుంది.

5. ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలపై నెలవారీ వడ్డీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డీసీబీ వంటి బ్యాంకులు... తమ వద్ద తనఖా పెట్టిన బంగారంపై ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తున్నాయి. ఇలా ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా తీసుకున్న మొత్తం నుంచి వడ్డీ చెల్లించవచ్చు.

6. ముందస్తు చెల్లింపులు: గోల్డ్ లోన్ మొత్తాన్ని గడువుకు ముందుగానే చెల్లించి ఖాతాను మూసివేయవచ్చు. కొన్ని బ్యాంకులు గోల్డ్ లోన్ తీసుకున్న మూడు నెలల్లోపే రీ పేమెంట్ చేస్తే.. దానిపై వడ్డీని కూడా వసూలు చేయవు. గోల్డ్ లోన్ తీసుకున్న తేదీ నుంచి 3-11 నెలల్లోపు రీ పేమెంట్ చేస్తే AXIS బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులు 0.5 నుండి 2 శాతం మధ్య వడ్డీ విధిస్తున్నాయి.

First published:

Tags: Bank loans, BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold loans, Gold ornmanets, Gold prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Personal Finance, Silver rates

ఉత్తమ కథలు