Pay Rent: క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె చెల్లించొచ్చు... ఈ యాప్‌తో సాధ్యం

మీ క్రెడిట్ కార్డును ఉపయోగించి, గడువు లోగా బిల్లులు చెల్లించడం ద్వారా క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది.

news18-telugu
Updated: May 1, 2020, 6:08 PM IST
Pay Rent: క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె చెల్లించొచ్చు... ఈ యాప్‌తో సాధ్యం
Pay Rent: క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె చెల్లించొచ్చు... ఈ యాప్‌తో సాధ్యం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు మీ ఇంటి అద్దె చెల్లించాలా? కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? Housing.com వెబ్‌సైట్ కొత్తగా Pay Rent పేరుతో ఓ సర్వీస్ ప్రారభించింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా మీరు మీ క్రెడిట్ కార్డుతో మీ ఇంటి అద్దె చెల్లించొచ్చు. నేరుగా మీ ఇంటి యజమాని అకౌంట్‌లోకి డబ్బులు పంపొచ్చు. మీరు చెల్లించిన అద్దెకు డిజిటల్ రిసిప్ట్స్ కూడా వస్తాయి. దీంతో పాటు 4 శాతం రివార్డ్ పాయింట్స్ వస్తాయి. మీ క్రెడిట్ లిమిట్‌ను అద్దె చెల్లించడానికి ట్రాన్స్‌ఫర్ చేసినందుకు క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా యాప్ డౌన్‌లోడ్ చేసి మీ ఇంటి యజమాని పేరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఎంటర్ చేసి మీ క్రెడిట్ కార్డుతో ట్రాన్సాక్షన్ చేయడమే. మీ క్రెడిట్ కార్డును ఉపయోగించి, గడువు లోగా బిల్లులు చెల్లించడం ద్వారా క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది.

అందరికీ ఇంటి అద్దె ప్రతీ నెలా ఉండే అతిపెద్ద ఖర్చు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక ఇబ్బందులు తప్పట్లేదు. భవిష్యత్తులో కూడా ఈ సమస్య ఉండొచ్చు. Housing.com పే రెంట్ ప్లాట్‌ఫామ్ ద్వారా యూజర్లు మరి కొన్ని నెలలు డబ్బులకు ఇబ్బంది పడకుండా చేస్తుంది. క్రెడిట్ కార్డుల ద్వారా ఇంటి అద్దెలు చెల్లించి, ఆ తర్వాత రీపేమెంట్ చేసుకోవచ్చు.

ధృవ్ అగర్వాల్, గ్రూప్ సీఈఓ, Housing.com, Makaan.com & PropTiger.com

చేతిలో డబ్బులు లేకపోయినా ఇంటి అద్దె చెల్లించడం మాత్రమే కాదు క్రెడిట్ కార్డుతో చేసిన పేమెంట్స్‌కి మారటోరియం కూడా ఎంచుకోవచ్చు. క్రెడిట్ కార్డు ఉపయోగించని వారికి యూపీఐ, డెబిట్ కార్డ్ పేమెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం 'పే రెంట్' ఆప్షన్ మొబైల్ అప్లికేషన్‌లో మాత్రమే ఉంది. త్వరలో Housing.com వెబ్‌సైట్‌లో కూడా ప్రారంభం అవుతుంది.

ఇవి కూడా చదవండి:

New Rules: మే 1న అమలులోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే

Prepaid Plans: రూ.200 లోపు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్ ఇవేHome Loan: మీ హోమ్ లోన్ ఈఎంఐ తగ్గించుకునే టెక్నిక్ ఇదే
Published by: Santhosh Kumar S
First published: May 1, 2020, 6:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading