హోమ్ /వార్తలు /బిజినెస్ /

Savings: ఎక్కువ వడ్డీ ఇస్తున్న టాప్ 10 బ్యాంక్స్ ఇవే

Savings: ఎక్కువ వడ్డీ ఇస్తున్న టాప్ 10 బ్యాంక్స్ ఇవే

Savings: ఎక్కువ వడ్డీ ఇస్తున్న టాప్ 10 బ్యాంక్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Savings: ఎక్కువ వడ్డీ ఇస్తున్న టాప్ 10 బ్యాంక్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Fixed Deposit interest rates | ఫిక్స్‌డ్ డిపాజిట్... డబ్బు పొదుపు చేయడమే కాదు, వడ్డీ పొందడానికి మంచి పెట్టుబడి మార్గం. అయితే ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ బాగుంటాయి.

  మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్స్ చేయాలనుకుంటున్నారా? ఫిక్స్‌డ్ డిపాజిట్స్ చేసేముందు వేర్వేరు బ్యాంకులు ఇస్తున్న వడ్డీ రేట్లను ఓసారి పరిశీలించడం మంచిది. ఇటీవల వడ్డీ రేట్లు బాగా తగ్గాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI వడ్డీ రేట్లను తగ్గించడంతో ఆ ప్రభావం ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లపై పడింది. దీంతో ఎఫ్‌డీ వడ్డీ రేట్లు బాగా దిగొచ్చాయి. ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రైవేట్ బ్యాంకులైన ఐసీఐసీఐ బ్యాంక్ 5.15 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 5.25 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 4.75 శాతం వడ్డీ ఇస్తున్నాయి. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా 5.15 శాతం వడ్డీ ఇస్తున్నాయి. అయితే ఈ బ్యాంకులకు పోటీగా పోటీగా ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇప్పటికీ 7 శాతం పైనే వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఉన్నాయి. ఆ బ్యాంకులు ఏవో, ఎంత వడ్డీ ఇస్తున్నాయో తెలుసుకోండి.

  SBI Rules: ఎస్‌బీఐలో డబ్బులు డ్రా చేయడానికి రూల్స్ ఇవే

  WhatsApp Banking: మీ బ్యాంకింగ్ సేవలు వాట్సప్‌లో పొందొచ్చు ఇలా

  1. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్- 7.25%

  2. ఆర్‌బీఎల్ బ్యాంక్- 7.20%

  3. ఇండస్‌ఇండ్ బ్యాంక్- 7.00%

  4. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 6.95%

  5. డీసీబీ బ్యాంక్- 6.75%

  6. యెస్ బ్యాంక్- 6.75%

  7. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- 6.50%

  8. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్- 6.30%

  9. బంధన్ బ్యాంక్- 6.25%

  10. ఐడీబీఐ బ్యాంక్- 5.70%

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Bank, Banking, Personal Finance, Save Money

  ఉత్తమ కథలు