Loan: మీ లోన్ రిజెక్ట్ అయిందా? కారణాలివే కావొచ్చు

Personal Finance Tips | మీరు ఏదైనా బ్యాంకులో లోన్‌కు అప్లై చేశారా? మీ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అయిందా? ఎందుకో తెలుసుకోండి.

news18-telugu
Updated: June 23, 2020, 4:38 PM IST
Loan: మీ లోన్ రిజెక్ట్ అయిందా? కారణాలివే కావొచ్చు
Loan: మీ లోన్ రిజెక్ట్ అయిందా? కారణాలివే కావొచ్చు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా వైరస్ సంక్షోభంతో లోన్స్ ఇవ్వాలంటేనే బ్యాంకులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాయి. గతంలో ఇచ్చినంత సులువుగా రుణాలు ఇవ్వట్లేదు. అంతేకాదు... లాక్‌డౌన్‌కు ముందు వచ్చిన లోన్ అప్లికేషన్లను తిరిగి పరిశీలిస్తున్నాయి. రుణాలు జారీ చేసే విషయంలో నిబంధనల్ని కాస్త కఠినతరం చేయడంతో లోన్ అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతున్నాయి. దరఖాస్తుదారుల క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండటం, ఉద్యోగ భద్రత లేకపోవడం, రీపేమెంట్ కెపాసిటీపై అనుమానాలు ఉండటం లాంటి కారణాలతో లోన్ అప్లికేషన్లను పక్కన పెడుతున్నాయి బ్యాంకులు. లోన్ మంజూరు చేసే విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు, అది కూడా క్రెడిట్ స్కోర్ బాగా ఉన్నవారికి మాత్రమే రుణాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాయి.

ఒకవేళ మీ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో డ్యూస్ ఎవైనా ఉంటే వెంటనే చెల్లించాలి. ప్రస్తుతం ఉన్న ఈఎంఐల భారాన్ని తగ్గించుకోవాలి. పర్సనల్ లోన్ ఈఎంఐలు తక్కువగా ఉంటే ముందే చెల్లించాలి. ఈఎంఐలతో ఏవైనా వస్తువులు కొన్నా మొత్తం పేమెంట్ చేయాలి. ఒకసారి మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలి. మీ క్రెడిట్ స్కోర్ 700 కన్నా ఎక్కువ ఉంటేనే లోన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ప్రైవేట్ బ్యాంకులో అయితే ఈ స్కోర్ ఇంకా ఎక్కువగా ఉండాలి. క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. తక్కువ ఉన్నట్టైతే క్రెడిట్ స్కోర్ పెంచుకోవడం మంచిది.

క్రెడిట్ కార్డులు వాడుతున్నట్టైతే బిల్లులు అన్నీ చెల్లించాలి. మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అంటే మీ క్రెడిట్ కార్డ్ లిమిట్‌లో మీరు ఎంత వరకు వాడుతున్నారన్నది కూడా ముఖ్యమే. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ రూ.1,00,000 అయితే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో 30% లోపు అంటే రూ.30,000 లోపు మాత్రమే ఉండాలి. అప్పుడే బ్యాంకు నుంచి లోన్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మీకు ఇప్పటికే లోన్ ఉన్నట్టైతే కొత్త లోన్‌కు కాకుండా జాయింట్ లోన్‌కు అప్లై చేయండి. అంటే మీ జీవిత భాగస్వామి, తండ్రి, తల్లి, కొడుకు, కూతురు లాంటి మీ కుటుంబ సభ్యులను కో-అప్లికెంట్‌గా చేర్చి లోన్ తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

ATM Charges: ఏటీఎం యూజర్లకు త్వరలో షాక్ తప్పదా?

PAN-Aadhaar Link: జూన్ 30 లోగా పాన్, ఆధార్ లింక్ చేయకపోతే ఈ చిక్కులు తప్పవు

Education Loan: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఐసీఐసీఐ నుంచి రూ.1 కోటి వరకు లోన్
First published: June 23, 2020, 4:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading