New Rules: సెప్టెంబర్ 1 నుంచి మారే 8 రూల్స్ ఇవే...

New Rules | సెప్టెంబర్ 1 నుంచి మారే నిబంధనలేంటీ? అమల్లోకి వచ్చే కొత్త రూల్స్ మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? తెలుసుకోండి.

news18-telugu
Updated: August 28, 2019, 3:01 PM IST
New Rules: సెప్టెంబర్ 1 నుంచి మారే 8 రూల్స్ ఇవే...
New Rules: సెప్టెంబర్ 1 నుంచి మారే 8 రూల్స్ ఇవే... (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు తరచూ బ్యాంకు లావాదేవీలు జరుపుతుంటారా? అయితే మీ కోసమే ఈ న్యూస్. సెప్టెంబర్ 1 నుంచి కొన్ని రూల్స్ మారనున్నాయి. అవి అందరి జీవితాలపై ప్రభావం చూపించేవే. బ్యాంకు వేళలు మారనున్నాయి. కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయి. హోమ్ లోన్ మరింత చీప్ కానుంది. మరి సెప్టెంబర్ 1 నుంచి మారే నిబంధనలేంటీ? అమల్లోకి వచ్చే కొత్త రూల్స్ మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? తెలుసుకోండి.

1. ఆటో, హోమ్ లోన్స్ 59 నిమిషాల్లోనే: పండుగ సీజన్‌లో ప్రజలకు అద్భుతమైన సేవలు ప్రారంభం కాబోతున్నాయి. హోమ్ లోన్స్, ఆటో లోన్స్, పర్సనల్ లోన్స్ ఏవైనా 59 నిమిషాల్లో పొందొచ్చు. సెప్టెంబర్ 1 నుంచే ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాయి. www.psbloansin59minutes.com వెబ్‌సైట్ ద్వారా ఈ రుణాలు పొందొచ్చు.

2. రెపో రేట్ లింక్డ్ హోమ్‌ లోన్: హోమ్ లోన్ తీసుకోవాలనుకునేవారికి శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు రెపో రేట్ లింక్డ్ హోమ్ లోన్ ఆఫర్ చేస్తోంది. వడ్డీ రేటు 0.20 శాతం తగ్గనుంది. సెప్టెంబర్ 1 నుంచి ఎస్‌బీఐలో 8.05 వడ్డీకే హోమ్ లోన్ తీసుకోవచ్చు.

3. కిసాన్ క్రెడిట్ కార్డ్: కిసాన్ క్రెడిట్ కార్డును 15 రోజుల్లో పొందొచ్చు. సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తు చేసుకున్నవారికి గరిష్టంగా 15 రోజుల్లో బ్యాంకు కిసాన్ క్రెడిట్ కార్డ్ జారీ చేయాలి. ఇది రైతులకు మేలు చేసే అంశం.



4. రీటైల్ లోన్: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సెప్టెంబర్ 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలు చేస్తోంది. రెపో రేట్ లింక్డ్‌ రీటైల్ లోన్స్ ఇవ్వనుంది. రెపో రేట్ లింక్ చేసి లోన్లు ఇవ్వడంతో వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. బ్యాంకులు రెపో రేట్ మార్చినప్పుడల్లా ఈ వడ్డీ రేట్లు మారతాయి.

5. మొబైల్ వ్యాలెట్: మీరు పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే లాంటి మొబైల్ వ్యాలెట్స్ వాడుతున్నారా? ఆగస్ట్ 31 లోగా కేవైసీ చేయకపోతే సెప్టెంబర్ 1 నుంచి మొబైల్ వ్యాలెట్స్ పనిచేయవు. మొబైల్ వ్యాలెట్ కంపెనీలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఆగస్ట్ 31 వరకే డెడ్‌లైన్ ఇచ్చింది.

6. ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్స్: ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను తగ్గించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెప్టెంబర్ 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వస్తాయి. సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. సేవింగ్స్ అకౌంట్‌లో రూ.1 లక్ష వరకు డిపాజిట్లు ఉన్నవాళ్లు 3.5% వడ్డీ పొందొచ్చు.7. బ్యాంక్ టైమింగ్స్: చాలావరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల వేళలు మారే అవకాశముంది. బ్యాంకు పనివేళలు ఉదయం 10 గంటలకు కాకుండా ఉదయం 9 గంటలకే ప్రారంభమయ్యే అవకాశముంది.

8. ఐఆర్‌సీటీసీ సర్వీస్ ఛార్జీ: ఐఆర్‌సీటీసీ సర్వీస్ ఛార్జీని మళ్లీ ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. గతంలో ఐఆర్‌సీటీసీలో బుక్ చేసే టికెట్లపై సర్వీస్ ఛార్జీ ఉండేది. 2016లో నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుకింగ్‌పై సర్వీస్ ఛార్జీని రద్దు చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఐఆర్‌సీటీసీ మళ్లీ సర్వీస్ ఛార్జీని అమలు చేయొచ్చు.

Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

LIC Jeevan Amar: రూ.10,800 ప్రీమియంతో రూ.1 కోటి బీమా... ఎల్ఐసీ కొత్త పాలసీ వివరాలివే

IRCTC: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

SBI Wealth: 'ఎస్‌బీఐ వెల్త్' అకౌంట్‌తో లాభాలు ఇవే...

 
First published: August 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు