HOME » NEWS » business » PERSONAL FINANCE PUNJAB SIND BANK BANK OF INDIA AND STATE BANK OF INDIA OFFER THE LOWEST RATES ON GOLD LOANS MK GH

Gold Loan తీసుకోవాలనుకుంటున్నారా..అతి తక్కువ వడ్డీరేటుకే రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

తక్కువ వడ్డీకే బంగారు రుణాలను అందించడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు పంజాబ్ & సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు ముందు వరుసలో ఉన్నాయి.

news18-telugu
Updated: November 23, 2020, 10:01 PM IST
Gold Loan తీసుకోవాలనుకుంటున్నారా..అతి తక్కువ వడ్డీరేటుకే రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
దేశంలోని సామాన్యుల నుంచి ధనవంతుల వరకు చాలామంది బ్యాంకులలో బంగారంపై రుణాలను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారనే విషయం తెలిసిందే. గత ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న కోవిడ్–19 విజృంభనతో అత్యవసర నిధుల సేకరణలో భాగంగా ప్రజలు బంగారు రుణాలు తీసుకోవడానికి మరింత మక్కువ చూపిస్తున్నారు. దీంతో బంగారు రుణాలకు డిమాండ్ పెరిగింది. దీనికి అనుగుణంగానే కొన్ని బ్యాంకులు బంగారు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో రుణగ్రహీతలు తమ బంగారు హోల్డింగ్లను తనఖా పెట్టడం సులభతరంగా మారింది. తక్కువ వడ్డీకే బంగారు రుణాలను అందించడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు పంజాబ్ & సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు ముందు వరుసలో ఉన్నాయి. వీటిలో పంజాబ్ & సింధ్ బ్యాంక్ కేవలం 7 శాతం వడ్డీ రేటుతో అతి తక్కువ వడ్డీకే బంగారు రుణాలు అందించే బ్యాంకుగా నిలిచింది. బ్యాంక్‌బజార్.కామ్ నుండి సేకరించిన డేటా ప్రకారం పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మూడేళ్ల కాలానికి తీసుకునే రూ .5 లక్షల రుణంపై సంవత్సరానికి 7 శాతం మాత్రమే వడ్డీ వసూలు చేస్తుంది. చౌకైన బంగారు రుణాలను అందించే జాబితాలో తదుపరి స్థానంలో ఉన్న మరో ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI). ఇది బంగారు రుణాలపై 7.35 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. కాగా, దేశంలోని అతిపెద్ద బ్యాంక్గా పరిగణించే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బంగారు రుణాలపై సంవత్సరానికి 7.5 శాతం వడ్డీని వసూలు చేస్తుంది.

ఎన్బీఎఫ్సీల్లో వడ్డీరేటు ఎక్కువ..

అన్ని లిస్టెడ్ (బిఎస్ఈ) ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు బంగారు రుణాలపై వడ్డీ రేటును తమ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తాయి. 2020 నవంబర్ 19 నాటికి సంబంధిత బ్యాంకుల వెబ్‌సైట్ల నుండి సేకరించిన డేటా ప్రకారం బంగారు రుణాలపై తక్కువ వడ్డీ రేటును అందించే బ్యాంకు/ఎన్‌బిఎఫ్‌సిలను పరిశీలించవచ్చు. కాగా, మూడేళ్ల కాలానికి గాను రూ .5 లక్షల రుణంపై వర్తించే వడ్డీ రేట్ల ఆధారంగా నెలవారీ ఈఎంఐ లెక్కించబడుతుంది. అయితే, రుణాల మంజూరులో దూకుడుగా ఉండే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సి) మాత్రం చాలా ఎక్కువ వడ్డీరేటుకే బంగారు రుణాలను అందిస్తున్నాయి. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ 9.24 శాతం, బజాజ్ ఫిన్సర్వ్ (11 శాతం), ముత్తూట్ ఫైనాన్స్ (11.9 శాతం), మనప్పురం ఫైనాన్స్ (12 శాతం)తో బంగారు రుణాలను అందిస్తున్నాయి.
Published by: Krishna Adithya
First published: November 23, 2020, 10:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading