మీ నగరాన్ని ఎంచుకోండి

    హోమ్ /వార్తలు /బిజినెస్ /

    Finance Lessons : 2020లో కరోనా మహమ్మారి మనకు నేర్పిన ఆర్థిక పాఠాలు.. వీటిపై ఓలుక్కేయండి

    Finance Lessons : 2020లో కరోనా మహమ్మారి మనకు నేర్పిన ఆర్థిక పాఠాలు.. వీటిపై ఓలుక్కేయండి

    ఫ్రతీకాత్మకచిత్రం

    ఫ్రతీకాత్మకచిత్రం

    2020 సంవత్సరం మొత్తం ఆరోగ్య సంక్షోభం(health crisis)తో జీవించాం. కోవిడ్–19తో ఆరోగ్యంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ కూడా ప్రతి ఒక్కరిలోనూ అలవడింది. లాక్ డౌన్, కరోనా సంక్రమణ ప్రమాదంతో ప్రజలు ఇంట్లోనే గడపాల్సి వచ్చింది.

    2020 సంవత్సరం మొత్తం ఆరోగ్య సంక్షోభం(health crisis)తో జీవించాం. కోవిడ్–19తో ఆరోగ్యంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ కూడా ప్రతి ఒక్కరిలోనూ అలవడింది. లాక్ డౌన్, కరోనా సంక్రమణ ప్రమాదంతో ప్రజలు ఇంట్లోనే గడపాల్సి వచ్చింది. దీంతో ప్రజలు తమకు ఇష్టమైన రెస్టారెంట్‌లో భోజనం చేయడం, సినిమాలకు వెళ్లడం, పార్టీలు చేసుకోవడం వంటి వాటికి దూరమయ్యారు. అంతేకాక, కరోనా సంక్షోభంతో ఉద్యోగాలు కోల్పోవడం, జీతాల్లో కోతలకు గురవ్వడం వంటివి ప్రతి ఒక్కరికీ ఆర్థిక క్రమశిక్షణను నేర్పించాయి. తద్వారా, ఎన్విరాన్మెంట్(environment), సెల్ఫ్ కేర్(self-care), ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్( financial independence)పై ప్రజలు మరింత శ్రద్ధ వహించాల్సి వచ్చింది. ఈ ఏడాది కరోనా మరకు నేర్పిన 5 వ్యక్తిగత ఆర్థిక పాఠాలపై ఓ లుక్కేద్దాం.

    1. ఆరోగ్య బీమా అవసరం

    ఈ ఏడాది కరోనా మహమ్మారి విజృంభన, తుఫానులు(cyclones), వరద(floods)ల కారణంగా భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎన్నడూ ఊహించని సంఘటనలను ఎదుర్కొన్నారు. ఈ ఏడాది మనకు ఎన్నో పాఠాలను నేర్పింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా(health insurance) ఎంత అవసరమో ఈ ప్రకృతి విపత్తులు తేల్చి చెప్పాయి. అంతేకాక, కరోనా సంక్షోభంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలు కోల్పోతుండటంతో, ఆయా కంపెనీలు సమకూర్చే ఆరోగ్య బీమా పథకాలపై ఆధారపడకుండా సొంతగా వ్యక్తిగత బీమా తీసుకోవాలని చాలా మంది నిర్ణయించుకున్నారు.

    2. అత్యవసర నిధి ఏర్పాటు

    మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తుండటంతో కరోనా భారీన పడితే ప్రైవేట్ ఆసుపత్రిలో లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో తమను, తమ కుటుంబ సభ్యులను కాపాడుకోవడం కోసం అత్యవసర నిధి(Emergency fund) ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమని ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. ఎప్పుడు ఎలాంటి ఆర్థిక సంక్షోభం వచ్చినా సిద్ధంగా ఉండటానికి ఈ అత్యవసర నిధి ఉపయోగపడుతుంది.

    3. భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయడం

    ముందులా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టకుండా పొదుపు(Save money) చేయాలనే ఆలోచన చాలా మందిలో అలవడింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అనవసర ఖర్చులకు పోకుండా డబ్బు ఆదాపై దృష్టి సారిస్తే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోగలమనే ఆత్మస్తైర్యం వస్తుంది. అందువల్ల, బడ్జెట్‌లో జీవించడానికి అలవాటును పెంపొందించుకోవడం చాలా ముఖ్యం.

    4. అప్పు తీసుకోవడం తగ్గించడం

    క్రెడిట్ కార్డ్ల ద్వారా విపరీతంగా అప్పు తీసుకోవడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. అప్పు తీసుకునేటప్పుడు బాగానే ఉన్నా, చెల్లించే సమయంలో అసలు సమస్య వచ్చి పడుతుంది. అందువల్ల, క్రెడిట్ కార్డులు(credit card), వ్యక్తిగత రుణాలు(personal loans) తీసుకునే ముందు వాటిని చెల్లించడానికి మీ వద్ద సరైన ప్రణాళిక ఉందని నిర్థారించుకోవడం చాలా అవసరం.

    5. వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టడం

    మన పెట్టుబడులన్నింటినీ ఒకే దక్కర పెట్టకుండా, వివిధ పెట్టుబడి మార్గాలను ఎన్నుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎప్పుడూ ఒకే దాంట్లో పెట్టుబడి పెట్టడం లాభాన్ని చేకూర్చదు. ఉదాహరణకు మహమ్మారికి ముందు బంగారం(gold) పెట్టుబడి పెట్టిన వారి పంట పండింది. 2019 నవంబర్లో 10 గ్రాముల బంగారం ధర రూ.38,000లు ఉండగా, 2020 ఆగస్టులో దాని ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయి(all-time high) రూ.56,191కి పెరిగింది. మహమ్మారి సమయంలో ఫార్మా, ఎఫ్‌ఎంసిజి రంగాల షేర్లు లాభపడగా, ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టపోయాయి. అందువల్ల, ఒకేరకమైన పెట్టుబడి లాభించదు అని గుర్తించుకోండి.

    First published:

    Tags: Money making, Personal Finance, Year Ender 2020

    ఉత్తమ కథలు