Home /News /business /

Money Transfer: ఐఎంపీఎస్‌ పరిమితి పెంపు.. డబ్బు ట్రాన్స్‌ఫర్‌‌కు IMPS, NEFT, RTGSలో ఏది బెటర్?

Money Transfer: ఐఎంపీఎస్‌ పరిమితి పెంపు.. డబ్బు ట్రాన్స్‌ఫర్‌‌కు IMPS, NEFT, RTGSలో ఏది బెటర్?

6. సెంట్రల్ సివిల్ సర్వీసెస్(పెన్షన్) రూల్స్-1972 ప్రకారం గ్రాట్యుటీని లెక్కించడం కోసం పదవీ విరమణ లేదా మరణ తేదీ నాటి డీఏను వేతనంగా పరిగణిస్తారు. సీసీఎస్(లీవ్) రూల్స్ 1972లో ఉన్న ప్రస్తుత నిబంధనల ప్రకారం.. సెలవులకు బదులుగా క్యాష్ పేమెంట్ ఇవ్వడానికి పదవీ విరమణ తేదీ నాటి జీతాన్ని డీఏతో కలిపి లెక్కిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)

6. సెంట్రల్ సివిల్ సర్వీసెస్(పెన్షన్) రూల్స్-1972 ప్రకారం గ్రాట్యుటీని లెక్కించడం కోసం పదవీ విరమణ లేదా మరణ తేదీ నాటి డీఏను వేతనంగా పరిగణిస్తారు. సీసీఎస్(లీవ్) రూల్స్ 1972లో ఉన్న ప్రస్తుత నిబంధనల ప్రకారం.. సెలవులకు బదులుగా క్యాష్ పేమెంట్ ఇవ్వడానికి పదవీ విరమణ తేదీ నాటి జీతాన్ని డీఏతో కలిపి లెక్కిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)

Money Transfer: డబ్బు బదిలీ చేసేందుకు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS), ఐఎంపీఎస్‌ (IMPS) సదుపాయాలను బ్యాంకులు అందిస్తున్నాయి. వీటిలో ప్రతి విధానానికి భిన్నమైన ఫీచర్స్‌ ఉన్నాయి.

డిజిటల్‌ విధానం (Digital Payments)లో నగదు బదిలీ చేయడం చాలా సులభంగా మారిపోయింది. కానీ వాటిల్లో ఉండే నిర్ణీత పరిమితి (limit)) కారణంగా చాలా మంది ఈ విషయంలో ఇబ్బందిపడక తప్పడం లేదు. భారీ మొత్తాల్లో ట్రాన్సాక్షన్లు చేసేవారు, నిత్యం నగదు బదిలీ లావాదేవీలు నిర్వహించేవారికి ఈ పరిమితులు చికాకులు కలిగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఐఎంపీఎస్‌ (Immediate payment service) లావాదేవీలపై ఉండే పరిమితులను ఆర్‌బీఐ తాజాగా సడలించింది. తాజాగా మానిటరీ పాలసీ వివరాలు వెల్లడించిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గవర్నర్‌ శక్తికాంత దాస్‌.. ఈ విషయాన్ని ప్రకటించారు. ఇకపై ఐఎంపీఎస్‌ (IMPS) ద్వారా జరిపే లావాదేవీల గరిష్ట పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. ఇప్పటి వరకు ఇది రూ.2 లక్షలుగా ఉంది.

డబ్బు బదిలీ చేసేందుకు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS), ఐఎంపీఎస్‌ (IMPS) సదుపాయాలను బ్యాంకులు అందిస్తున్నాయి. వీటిలో ప్రతి విధానానికి భిన్నమైన ఫీచర్స్‌ ఉన్నాయి. లావాదేవీ విలువ, బదిలీ వేగాన్ని బట్టి అవసరమైనదాన్ని ఎంచుకోవచ్చు.

పోస్టాఫీస్ లో అద్భుత పథకం.. రూ.2 లక్షలు పెట్టుబడితో.. రూ.4 లక్షలు

దేశీయంగా నిధుల బదిలీకి ప్రతి రోజు 24 గంటల పాటు అందుబాటులో ఉండే విధానం ఐఎంపీఎస్‌. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్స్, బ్యాంకు శాఖలు, ఏటీఎంలు, ఎస్‌ఎంఎస్‌లు, ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌ (ఐవీఆర్‌ఎస్‌) ద్వారా ఐఎంపీఎస్‌ సేవలు పొందవచ్చు.

పెద్ద మొత్తంలో జరిపే లావాదేవీల కోసం ఉద్దేశించినది రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్‌ (ఆర్‌టీజీఎస్‌). అక్టోబర్‌ 2020 నుంచి ఈ సదుపాయం కూడా ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉంటోంది. అంతే కాదు 2019 నుంచి నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్సఫర్‌ (ఎన్‌ఈఎఫ్‌టీ) సదుపాయాన్నీ కూడా 24x7 కల్పిస్తోంది ఆర్‌బీఐ.

వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, తెలుగు రాష్ట్రాల్లో ధరలు చూస్తే..

ఎన్‌ఈఎఫ్‌టీ, ఐఎంపీఎస్‌ ద్వారా అతి తక్కువ మొత్తంలో.. అంటే రూ.1 ఒకటి సైతం బదిలీ చేయవచ్చు. అదే ఆర్‌టీజీఎస్‌ అయితే కనీస లావాదేవీ మొత్తం రూ.2 లక్షలు ఉండాలి. ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్‌ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ఐఎంపీఎస్‌ సేవలు కేవలం ఆన్‌లైన్‌ ద్వారానే పొందవచ్చు. ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్‌ ద్వారా జరిపే లావాదేవీల్లో గరిష్ఠ మొత్తం బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. ఐఎంపీఎస్‌లో ఇది ఇప్పుడు రూ.5 లక్షలు మాత్రమే. ఆర్‌టీజీఎస్‌, ఐఎంపీఎస్‌లో డబ్బు బదిలీ చేస్తే.. సెటిల్‌మెంట్‌ తక్షణమే జరుగుతుంది. ఎన్‌ఈఎఫ్‌టీలో అరగంటకు ఒకసారి బదిలీ అవుతుంది. ఈ మూడు సేవలు 24 గంటలు అందుబాటులో ఉన్నాయి.

ఎన్‌ఈఎఫ్‌టీ లావాదేవీలు బ్యాంక్‌ మొబైల్‌ యాప్‌ లేదా నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చేస్తే.. ఎటువంటి ఛార్జీలు వర్తించవు. అదే బ్యాంకు శాఖ ద్వారా అయితే ఎన్‌ఈఎఫ్‌టీ లావాదేవీలపై ఛార్జీలు ఉంటాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంకు లావాదేవీ విలువను బట్టి రూ.2.25 నుంచి రూ.24.75 వసూలు చేస్తుంది. దీనిపై జీఎస్‌టీ అదనం.

బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు గుడ్​న్యూస్​.. అతి తక్కువ వడ్డీకే హోమ్​లోన్

ఆర్‌టీజీఎస్‌ను సాధారణంగా కార్పొరేట్‌ కంపెనీలు, సంస్థలు ఎక్కువగా ఉపయోగిస్తుంటాయి. ఆర్‌టీజీఎస్‌ లావాదేవీలపై మొత్తంపై ఆర్‌బీఐ ఎటువంటి పరిమితులు విధించలేదు. కానీ కొన్ని బ్యాంకులు పరిమితులు విధించుకున్నాయి. ఐడీఎఫ్‌సీ బ్యాంకు రోజు రూ.20 లక్షల వరకు బదిలీకి అనుమతిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు పరిమితి రూ.10 లక్షలు. ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించే ఆర్‌టీజీఎస్‌ లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు లేవు. బ్యాంకు శాఖల ద్వారా చేస్తే కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంకు లావాదేవీ మొత్తాన్ని బట్టి రూ.20 నుంచి రూ.45 వసూలు చేస్తుంది. దీనికి జీఎస్‌టీ అదనం.

ఇప్పటి వరకు ఐఎంపీఎస్‌ విధానం ద్వారా కనిష్ఠంగా రూ.1 నుంచి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు డబ్బు బదిలీ చేయవచ్చు. త్వరలో గరిష్ఠ మొత్తం రూ.5 లక్షలు కానుంది. రిటెయిల్‌ ఖాతాదారులు ఎక్కువ మంది ఈ సదుపాయాన్ని ఉపయోగిస్తుంటారు. ఐఎంపీఎస్‌ లావాదేవీలపై ట్రాన్సక్షన్‌ ఛార్జీలు బ్యాంకును బట్టి మారుతూ ఉంటాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌ ఎటువంటి ఛార్జీ వసూలు చేయడం లేదు. లావాదేవీ మొత్తాన్ని బట్టి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.3.50 నుంచి రూ.15 ప్లస్‌ జీఎస్‌టీని వసూలు చేస్తోంది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Bank, Bank account, IMPS, Money Transfer

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు