Investments for retirement: రిటైర్మెంట్ తరువాత వచ్చిన డబ్బు ఎక్కడపెట్టాలో అర్థం కావడం లేదా..అయితే ఇది మీ కోసం...

రిటైర్‌మెంట్‌ను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు చేసేవారు ఉద్యోగాలు చేస్తున్నప్పటి నుంచే కొత్త మొత్తాన్ని పెట్టుబడులకు కేటాయించాలి. ఇందుకు బ్యాంక్ ఎఫ్‌డీల కంటే మెరుగైన రాబడిని అందించే ఇతర పెట్టుబడి మార్గాలను ఎంచుకోవడం మంచిది.

news18-telugu
Updated: December 1, 2020, 3:35 PM IST
Investments for retirement: రిటైర్మెంట్ తరువాత వచ్చిన డబ్బు ఎక్కడపెట్టాలో అర్థం కావడం లేదా..అయితే ఇది మీ కోసం...
ఫ్రతీకాత్మకచిత్రం
  • Share this:
రిటైర్‌మెంట్‌ను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు చేసేవారు ఉద్యోగాలు చేస్తున్నప్పటి నుంచే కొత్త మొత్తాన్ని పెట్టుబడులకు కేటాయించాలి. ఇందుకు బ్యాంక్ ఎఫ్‌డీల కంటే మెరుగైన రాబడిని అందించే ఇతర పెట్టుబడి మార్గాలను ఎంచుకోవడం మంచిది. కోవిడ్ వల్ల దెబ్బతిన్న మన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రిజర్వు బ్యాంక్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఈ మధ్య ఆర్బీఐ 115 బేసిస్ పాయింట్ల రెపో రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లు మరింత తక్కువకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

రిటైర్‌మెంట్‌ను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు చేసేవారు ఉద్యోగాలు చేస్తున్నప్పటి నుంచే కొత్త మొత్తాన్ని పెట్టుబడులకు కేటాయించాలి. ఇందుకు చాలామంది ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంచుకుంటారు. కానీ ప్రస్తుతం వీటిపై వడ్డీరేట్లు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు మెచూరిటీ ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 2.9 శాతం నుంచి 5.4 శాతం వడ్డీని మాత్రమే అందిస్తుంది. అందువల్ల రిటైర్మెంట్‌ను దృష్టిలో పెట్టుకొని బ్యాంక్ ఎఫ్‌డీల కంటే మెరుగైన రాబడిని అందించే ఇతర పెట్టుబడి మార్గాలను ఎంచుకోవడం మంచింది.

రిటైర్మెంట్ తరువాత ఎక్కువ వడ్డీని అందించే పెట్టుబడి మార్గాలు

Senior Citizens’ Savings Scheme (SCSS)
ఈ పథకంలో అత్యధికంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీని త్రైమాసిక ప్రాతిపదికన లెక్కించి, చెల్లిస్తారు. ఇది సీనియర్ సిటిజన్ల సాధారణ అవసరాలను తీర్చగలదు. దీంట్లో అకౌంట్ మెచూరిటీ ఐదేళ్లుగా ఉంది. ఆ తర్వాత మెచూరిటీని మరో మూడు సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. ప్రస్తుత అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో ఈ పథకం 7.4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ వడ్డీ రేటు సీనియర్ సిటిజన్లకు అందుబాటులో ఉన్న ఇతర పెట్టుబడి మార్గాల్లో లభించేదానికన్నా చాలా ఎక్కువ. ఈ స్కీమ్ ద్వారా వచ్చే రాబడిపై సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ డిడక్షన్ వర్తిస్తుంది. ‘ఇతర మార్గాలతో పోలిస్తే ఈ పథకాన్నే ఎంచుకోమని మా క్లైంట్‌లకు సూచిస్తాం. రెగ్యులర్ ఇన్‌కమ్ కోసం ఇది మంచి ఎంపిక’ అని వెల్త్ ఫస్ట్ పోర్ట్‌ఫోలియో మేనేజర్స్ సంస్థ కో-ఫౌండర్ ఆశిశ్‌ షా చెబుతున్నారు.

ప్రధాన మంత్రి వయో వందన యోజన (PMVVY)
ఈ పథకాన్ని లైఫ్‌ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అందిస్తుంది. ఈ పెన్షన్ పథకానికి 10 సంవత్సరాల పాలసీ వ్యవధి ఉంటుంది. నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక ప్రాతిపదికన పెన్షన్ చెల్లించే మార్గాన్ని ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఎస్‌బీఐ అందించే వడ్డీ రేట్లకంటే PMVVY అందిస్తున్న వడ్డీ రేట్లు ఎక్కువ. ఈ పథకంలో నెలవారీ వడ్డీ చెల్లింపు విధానంలో ఖాతాదారులు 7.40 శాతం వడ్డీ రేట్లను పొందవచ్చు. ఈ పెన్షన్ పథకంలో పెట్టే పెట్టుబడులపై 7.40 శాతం రాబడి పదేళ్ల కాలానికి లాక్ ఇన్ అవుతుంది. 60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఎవరైనా PMVVYలో పథకం ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పథకంలో అత్యధికంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

లైఫ్‌ ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే యాన్యుటీలు
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) అందించే కొన్ని యూన్యుటీ పాలసీలతో రిటైర్మెంట్ తరువాత మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఈ విభాగంలో జీవన్ అక్షయ్, న్యూ జీవన్ శాంతి వంటివి ఎంచుకోవచ్చు. ఇమీడియెట్ యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేసే (ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టుబడులు చేయడం) వినియోగదారులు రెగ్యులర్ పేఅవుట్స్‌ పొందవచ్చు. "ఒక పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టే వినియోగదారులు రెగ్యులర్ పేఅవుట్స్ పొందవచ్చు. నెలవారీ, త్రైమాసిక లేదా సంవత్సర ప్రాతిపదికన ఈ చెల్లింపులను ఎంచుకోవచ్చు. 20-30 సంవత్సరాలలో 5.75-5.9 శాతానికి వడ్డీ రేటు చేరుకుంటుంది” అని సినర్జీ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ దలాల్ వివరించారు. PMVVY, SCSS మాదిరిగా కాకుండా, యాన్యుటీలు కస్టమర్ల మొత్తం పదవీ విరమణ దశను కవర్ చేస్తూ 30-40 సంవత్సరాల సుదీర్ఘ కాలానికి హామీ రాబడిని అందిస్తాయి. కానీ మొత్తం యాన్యుటీ ఆదాయం ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది. యాన్యుటీలకంటే మెరుగైన రాబడిని అందించే గవర్నమెంట్ సెక్యూరిటీలు వంటి దీర్ఘకాలిక మార్గాలు ఉన్నాయి. అందువల్ల వినియోగదారులు తమ అవసరాలను బట్టి ఇతర మార్గాలను కూడా ఎంచుకోవచ్చు.

గవర్నమెంట్ సెక్యూరిటీలు
సాధారణంగా ఫైనాన్షియల్ ప్లానర్లు యాన్యుటీలకు బదులుగా ప్రభుత్వ సెక్యూరిటీలను ఎంచుకోమని వినియోగదారులకు సలహా ఇస్తారు. "ఇవి సురక్షితమైన పెట్టుబడి మార్గాలు. వీటిపై రాబడి 6.6 నుంచి 6.75 శాతం వరకు ఉంటుంది. దీంట్లో 40 సంవత్సరాల సుదీర్ఘ కాలానికి పెట్టుబడి పెట్టవచ్చు. 2060 వరకు మెచ్యూరిటీ ఉండే బాండ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి యాన్యుటీల కంటే మెరుగైనవి. కస్టమర్లకు ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ బాండ్లపై సెమీ యాన్యువల్ విధానంలో వడ్డీ చెల్లిస్తారు” అని విక్రమ్ దలాల్ తెలిపారు. దీర్ఘకాలంలో ఫిక్స్‌డ్ రిటర్న్స్ కోసం పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ప్రభుత్వ బాండ్లను ఎంచుకోవచ్చని ఆయన చెప్పారు. NSE goBID ప్లాట్‌ఫామ్ ద్వారా కస్టమర్లు వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇవి ట్రెజరీ బిల్లులు. భారత ప్రభుత్వం అందిస్తున్న ఈ డేటెడ్ బాండ్లను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. “కస్టమర్లు స్టాక్ బ్రోకర్ల ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టవచ్చు. కానీ రిటైల్ పెట్టుబడిదారులలో దీనిపై అవగాహన తక్కువగా ఉంటుంది. అంతేకాక మీడియేటర్లకు వచ్చే రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల స్టాక్ బ్రోకర్లు ఈ పెట్టుబడి మార్గాలను ప్రోత్సహించరు ” అని షా చెప్పారు.
Published by: Krishna Adithya
First published: December 1, 2020, 3:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading