పండుగ సీజన్ సందర్భంగా ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక శాఖ లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA) రాయితీలను ప్రకటించింది. ఇప్పుడు వీటిని ప్రైవేటు ఉద్యోగులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. COVID-19 మహమ్మారి కారణంగా ప్రయాణాలు చేయలేక, LTAపై పన్ను మినహాయింపు పొందలేకపోయిన వారికి ప్రభుత్వ LTC వోచర్ పథకం ఉపయోగపడుతుంది. ఈ పథకం ప్రకారం.. 12 శాతానికి పైగా జీఎస్టీ ఉండే వస్తువులు, సేవలను కొనడానికి LTAకు మూడు రెట్లు ఖర్చు చేస్తే, దానిపై మినహాయింపు లభిస్తుంది. ఈ కొనుగోళ్లు మార్చి 31, 2021 లోపు చేయాలి. అది కూడా డిజిటల్ విధానంలో చెల్లింపులు చేయాలి. క్లెయిమ్ చేసుకోవడానికి బిల్లులను సమర్పించాలి.
ఉద్యోగులు నాలుగు క్యాలెండర్ ఈయర్స్ బ్లాక్ లో రెండుసార్లు LTA ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. ప్రస్తుత బ్లాక్ 2018-2021 వరకు ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో యాత్రల కోసం ప్రయాణాలు చేయడానికి అవకాశం లేదు. అందువల్ల పండుగ సీజన్లో డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లను పొందడానికి ఈ వన్ టైమ్ టాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. కొనుగోళ్ల కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేయాలని చూస్తున్న వారు ట్యాక్స్ ఆదా చేసుకోవడానికి ఇది మంచి మార్గమని డెలాయిట్ ఇండియా పార్ట్ నర్ ఆర్తి రౌటే చెబుతున్నారు. కానీ కేవలం పన్ను రాయితీని పొందటానికి మాత్రమే కొనుగోళ్లు చేయాలనుకోవడం సరికాదని ఆర్తి తెలిపారు. LTA ప్రైవేట్ ఉద్యోగుల సీటీసీలో భాగంగా ఉంటుంది. ప్రయాణ టికెట్ రశీదులపై వారికి ఎడిషనల్ రీయింబర్స్మెంట్ లభించదు. ఒకవేళ ప్రయాణాలు చేయకపోతే, నిర్ణీత స్లాబ్ రేటు ప్రకారం దానిపై ట్యాక్స్ విధించి, ఆ తరువాత మిగిలిన మొత్తాన్ని మార్చి జీతానికి LTAగా క్రెడిట్ చేస్తారు. ఈ పథకాన్ని సమర్థంగా ఎలా ఉపయోగించాలనే అంశంపై ఉద్యోగులు అవగాహన పెంచుకోవాలి.
tax relief ఎంత ఉంటుంది?
ఈ పథకం ప్రకారం ఒక కుటుంబ సభ్యుడికి అత్యధికంగా రూ.36,000 చొప్పున ప్రయోజనాలు పొందడానికి అర్హత ఉంటుంది. దీని అర్హతను ఉద్యోగుల గ్రేడ్‌ను బట్టి నిర్ణయిస్తారు. “LTA పరిమితిపై ట్యాక్స్ రిలీఫ్ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ LTA సంవత్సరానికి రూ.40,000 ఉంటే, పన్ను మినహాయింపులు పొందడానికి కనీసం రూ.1.2 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. LTA ఉద్యోగుల జీతంలో భాగంగా ఉండకపోతే, ఈ పథకం కింద ప్రయోజనాన్ని పొందలేరు ” అని టాక్స్ స్పానర్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సుధీర్ కౌశిక్ చెబుతున్నారు.
మొత్తం LTAను ఉపయోగించుకోలేకపోతే?
ఒకవేళ ఉద్యోగులు LTAను పూర్తిగా ఉపయోగించుకోలేకపోతే, నిర్దేశించిన నిష్పత్తి ప్రకారం ఖర్చు చేసిన మొత్తానికి ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. "ఎల్‌టీఏ పొందేందుకు అర్హత ఉన్నంత వరకు ఖర్చు చేయకపోతే, ఖర్చు చేసిన మొత్తంలో మూడింట ఒక వంతుకు పన్నుమినహాయింపును పరిమితం చేస్తారు. ఇది ఉద్యోగులకు వర్తించే స్లాబ్ రేటు ప్రకారం పన్నుకు లోబడి ఉంటుంది" అని కౌశిక్ చెప్పారు. ఉదాహరణకు, ఉద్యోగుల LTAకు రూ.80,000 (ఎల్టీసీ ఛార్జీలు) అర్హతగా ఉంటే, పూర్తి మినహాయింపు పొందడానికి రూ.2.4 లక్షలు (రూ.80,000*3) ఖర్చు చేయాలి. కేవలం 1.8 లక్షల రూపాయల విలువైన కొనుగోళ్లు మాత్రమే చేయగలిగితే, ట్యాక్స్ మినహాయింపు రూ.60,000కు పరిమితమవుతుంది.
ట్యాక్స్ మినహాయింపు కోసం అంత మొత్తం ఖర్చు చేయాలా ?ఉద్యోగుల లక్ష్యాలు, అవసరాలు, ఉద్యోగ భద్రతను అంచానా వేసి LTAట్యాక్స్ మినహాయింపు కోసం చేసే ఖర్చుపై ఒక అంచనాకు రావాలి. COVID-19, లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు జీతాల్లో కోతలు విధించలేదు. "రానున్న నెలల్లో ఉద్యోగుల ఆదాయం(క్యాష్ ఫ్లో) ఎంత వరకు ఉంటుందో అంచనా వేసుకోవాలి. క్యాష్ ఫ్లోకు ఎలాంటి అంతరాయం ఉండదనుకుంటేనే LTAపై ట్యాక్స్ మినహాయింపు కోసం ఖర్చు చేయవచ్చు” అని కౌశిక్ సలహా ఇస్తున్నారు.
కొత్త ట్యాక్స్ విధానాన్ని ఎంచుకుంటే ?
concessional tax regime ఆప్షన్‌ను ఎంచుకున్నవారు ఈ పథకానికి అర్హులు కాదు. కానీ వినియోగాన్ని పెంచడమే ఈ పథకం లక్ష్యం కాబట్టి, ఈ ఆప్షన్‌ను ఎంచుకున్న వారికి కూడా ట్యాక్స్ మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు తమ రిటర్నులను దాఖలు చేసే వరకు ఈ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. కాబట్టి 2020-21 మధ్యకాలంలో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని అంచనా వేసిన తరువాత ఇప్పటికే ఉన్న tax regimeతో మెరుగ్గా ఉన్నారని భావించే ఉద్యోగులు, దాంట్లో కొనసాగుతూనే ఈ పథకం కింద LTA ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. ఇలాంటి ఆప్షన్‌ను ఎంచుకునే ఉద్యోగులు పథకం ప్రకారం లబ్ధి పొందలేరని సర్క్యులర్‌లో ఎక్కడా లేదు. కానీ దీనిపై స్పష్టమైన సమాచారం లేదు.