CIBIL score: మీ క్రెడిట్ స్కోర్ తక్కువుందా? అయినా లోన్ తీసుకోవచ్చు ఇలా

Personal Finance Tips | మీరు ఏదైనా బ్యాంకులో క్రెడిట్ కార్డు లేదా లోన్‌కు అప్లై చేశారా? మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందా? క్రెడిట్ స్కోర్ తక్కువ ఉండటం కూడా కారణం కావచ్చు.

news18-telugu
Updated: July 16, 2020, 5:44 PM IST
CIBIL score: మీ క్రెడిట్ స్కోర్ తక్కువుందా? అయినా లోన్ తీసుకోవచ్చు ఇలా
CIBIL score: మీ క్రెడిట్ స్కోర్ తక్కువుందా? అయినా లోన్ తీసుకోవచ్చు ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్... ఏదైనా లోన్ రావడానికి ముఖ్యమైన ప్యారామీటర్ ఇది. అలాగని సిబిల్ స్కోర్ బాగుంటే లోన్ తప్పకుండా వచ్చేస్తుందని కాదు. బ్యాంకులు క్రెడిట్ కార్డు లేదా లోన్స్ ఇవ్వడానికి మీ క్రెడిట్ హిస్టరీని చెక్ చేస్తాయి. మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో చూస్తాయి. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే లోన్ ప్రాసెస్ ఈజీగా అవుతుంది. అంతేకాదు... తక్కువ వడ్డీకి లోన్లు తీసుకోవచ్చు. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే లోన్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. మరి సిబిల్ స్కోర్ తక్కువ ఉందన్న కారణంతో మీకు లోన్ రాలేదా? మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉండటం మీ లోన్ అప్లికేషన్లపై ప్రభావం చూపిస్తోందా? సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా లోన్లు తీసుకోవచ్చు. ఇందుకోసం మీ ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి.

SBI Balance Check: మీ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత? సింపుల్‌గా చెక్ చేయండి ఇలా

Bank Charges: బ్యాంకులు మీ నుంచి వసూలు చేసే ఈ ఛార్జీల గురించి తెలుసా?

Personal Finance, Personal loan, cibil score, credit score, how to improve credit score, credit cards, పర్సనల్ ఫైనాన్స్, పర్సనల్ లోన్, సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్, క్రెడిట్ కార్డ్
ప్రతీకాత్మక చిత్రం


సాధారణంగా సిబిల్ స్కోర్ 300 నుంచి 900 పాయింట్స్ మధ్య ఉంటుంది. 750 పైన సిబిల్ స్కోర్ ఉంటే మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నట్టే. అంతకన్నా తక్కువ ఉంటే మీ క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గిందో ఓసారి చెక్ చేసుకోవాలి. మీరు గడువు లోగా బిల్లులు, ఈఎంఐలు, లోన్లు క్లియర్ చేయడంపైనే మీ క్రెడిట్ స్కోర్ ఆధార పడి ఉంటుంది. అందుకే మీ పెండింగ్ బిల్స్, ఈఎంఐలు ఏవైనా ఉంటే గడువులోగా చెల్లించాలి. మీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందని మీ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే, మీకు ఆదాయం వచ్చే మార్గాల గురించి, మీరు లోన్ చెల్లించే సామర్థ్యం గురించి బ్యాంకుకు వివరించాలి. మీ దగ్గరున్న ప్రూఫ్స్ చూపించాలి. అంటే మీ జీతం, ఇతర ఆదాయాలు, వార్షిక బోనస్‌లు ఎంత వస్తాయో స్టేట్‌మెంట్‌లో చూపించాలి.

Pension Scheme: రోజూ రూ.10 పొదుపుతో నెలకు రూ.5,000 పెన్షన్... ఈ స్కీమ్‌లో చేరండిలా

SBI: ఈ బ్యాంకింగ్ సేవలకు మిస్డ్ కాల్‌, ఎస్ఎంఎస్ చాలు
Personal Finance, Personal loan, cibil score, credit score, how to improve credit score, credit cards, పర్సనల్ ఫైనాన్స్, పర్సనల్ లోన్, సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్, క్రెడిట్ కార్డ్
ప్రతీకాత్మక చిత్రం


బ్యాంకులో మీ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అయితే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ-NBFC దగ్గర రుణాలకు దరఖాస్తు చేయాలి. బ్యాంకుల కన్నా ఎన్‌బీఎఫ్‌సీ నియమనిబంధనలు కాస్త సడలింపులు ఉంటాయి. కాకపోతే వడ్డీ రేట్లు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇక మీరు ఎక్కువ లోన్‌కు దరఖాస్తు చేసుకుంటే రుణం మంజూరు కాకపోతే తక్కు మొత్తంలో లోన్ తీసుకోవాలి. ఆ లోన్ ఈఎంఐలు గడువు తేదీల్లోగా చెల్లించడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నందుకు మీ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అయితే ఎవరి సాయంతో అయినా జాయింట్ లోన్ తీసుకోవచ్చు. అయితే మంచి క్రెడిట్ హిస్టరీ, సిబిల్ స్కోర్ ఉన్న వ్యక్తినే గ్యారెంటర్‌గా ఎంచుకోవాలి.

కరోనా కష్టకాలంలో అప్పులు ఇస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

SBI Rules: డబ్బులు డ్రా చేస్తున్నారా? ఎస్‌బీఐ రూల్స్ ఇవే

Personal Finance, Personal loan, cibil score, credit score, how to improve credit score, credit cards, పర్సనల్ ఫైనాన్స్, పర్సనల్ లోన్, సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్, క్రెడిట్ కార్డ్
ప్రతీకాత్మక చిత్రం


మీకు పర్సనల్ లోన్ రాకపోతే సెక్యూర్డ్ లోన్‌కు అప్లై చేయాలి. అంటే ప్రాపర్టీ, ఇతర విలువైన వస్తువులతో కొలెటరాల్ లోన్ తీసుకోవచ్చు. ఇలాంటి రుణాలు పర్సనల్ లోన్ల కన్నా సులువుగా వస్తాయి. ఓసారి మీ క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేసుకోవాలి. మీ ప్రమేయం లేకుండా ఏవైనా తప్పులు జరిగినట్టైతే ఫిర్యాదు చేసి తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు. అందుకే ప్రతీ ఆరు నెలలకోసారి క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేయడం మంచిది.
Published by: Santhosh Kumar S
First published: July 16, 2020, 5:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading