news18-telugu
Updated: April 20, 2019, 6:57 PM IST
Personal Finance: ఈ స్కీమ్‌లో డబ్బులు పెడితే మీ డబ్బులు రెండింతలు
(ప్రతీకాత్మక చిత్రం)
కిసాన్ వికాస్ పత్ర... ఇండియా పోస్ట్ అందించే చిన్నమొత్తాల పొదుపు పథకం. ఈ పథకంలో మీరు పెట్టే ప్రతీ రూపాయికి భద్రత ఉంటుంది. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బు రెండింతలయ్యే ఛాన్స్ ఉంది. రిస్క్ కూడా ఉండదు. మీ ఇన్వెస్ట్‌మెంట్‌కు సర్టిఫికెట్ ఇస్తారు. వీటిని పోస్ట్ ఆఫీసులతో పాటు పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో కొనొచ్చు. అయితే ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసేముందు పథకం గురించి మొత్తం తెలుసుకోవడం మంచిది. మరి కిసాన్ వికాస్ పత్ర(KVP) స్కీమ్ గురించి, వడ్డీ రేట్ల గురించి తెలుసుకోండి.
Read this:
EPF Nomination: ఈపీఎఫ్‌కు నామినీ తప్పనిసరి... ఆన్లైన్లో పేరు నమోదు చేయండి ఇలా...కిసాన్ వికాస్ పత్ర వివరాలివే...
కిసాన్ వికాస్ పత్రను భారతీయులు ఎవరైనా తీసుకోవచ్చు. పిల్లల పేర్ల మీద తల్లిదండ్రులు ఇన్వెస్ట్ చేయొచ్చు. హిందూ అవిభాజ్య కుటుంబం, ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేయలేరు. రూ.1,000 నుంచి ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి ఏమీ లేదు. ఇండియా పోస్ట్ ఆఫీసులతో పాటు బ్యాంకుల్లో కిసాన్ వికాస్ పత్ర తీసుకోవచ్చు. కిసాన్ వికాస్ పత్రను ఒక వ్యక్తి పేరు నుంచి మరో వ్యక్తి పేరు మీదకు బదిలీ చేయొచ్చు. ఒక పోస్ట్ ఆఫీసు నుంచి మరో పోస్ట్ ఆఫీసుకీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే పన్ను లాభాలు ఉంటాయి. మీరు సుమారు 10 ఏళ్ల పాటు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను అలాగే ఉంచితే డబ్బులు రెట్టింపు అవుతాయి. ఉదాహరణకు మీరు 2009లో రూ.1 లక్ష కిసాన్ వికాస్ పత్రలో ఇన్వెస్ట్ చేసి ఉంటే 2019లో రూ.2 లక్షలు వచ్చేవి.
Read this:
SBI clerk Jobs: ఎస్బీఐలో 8,653 క్లర్క్ పోస్టులు... హైదరాబాద్‌లో 425 ఖాళీలు...
కిసాన్ వికాస్ పత్రలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత గడువు లోపు డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఇందుకు కొన్ని నిబంధనలు ఉంటాయి. రెండున్నరేళ్ల తర్వాత నియమనిబంధనలకు లోబడి డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు. ఏడాదిలోపు విత్‌డ్రా చేసుకుంటే ఎలాంటి వడ్డీ రాదు. జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది నుంచి రెండున్నరేళ్ల మధ్య విత్‌డ్రా చేస్తే వడ్డీ తక్కువగా వస్తుంది. ప్రస్తుతం కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌లో 7.7 వడ్డీ లభిస్తుంది. చక్రవడ్డీని ఏడాదికోసారి లెక్కిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. సరిగ్గా 112 నెలలు అంటే తొమ్మిది ఏళ్ల 4 నెలల్లో మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది.
Photos: న్యూయార్క్ ఆటో షోలో కళ్లుచెదిరే 16 కార్లు
ఇవి కూడా చదవండి:
Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... మొత్తం 310 ఖాళీలు
FSSAI Jobs: ఇంటర్ చదివితే చాలు... ఫుడ్ సేఫ్టీ ఉద్యోగాలు... మొత్తం 275 ఖాళీలు
SBI Charges: ఎస్బీఐ వసూలు చేసే ఈ 5 ఛార్జీలు తెలుసుకోండి...
Published by:
Santhosh Kumar S
First published:
April 20, 2019, 6:57 PM IST