news18-telugu
Updated: November 18, 2020, 1:41 PM IST
ఫ్రతీకాత్మకచిత్రం
నష్టభయం తక్కువగా ఉండే పెట్టుబడి మార్గాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ముఖ్యమైనవి. అందుకే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని ఇన్వెస్టర్లు ఎఫ్డీలలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే వీటిలో పెట్టుబడికి రాబడికి హామీ ఇవ్వబడుతుంది. కరోనా ప్రభావంతో పెరిగిన ద్రవ్యోల్బణం, ఇటీవల ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం మేరకు బ్యాంకులు వివిధ లోన్లపై వడ్డీ రేట్లు తగ్గించడంతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను తగ్గించాయి. అయితే, అనేక ప్రభుత్వ రంగ, ప్రముఖ ప్రైవేటు బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీరేట్లను తగ్గించినప్పటికీ, కొన్ని చిన్న బ్యాంకులు మాత్రం ఇప్పటికీ ఎఫ్‌డిలపై ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తున్నాయి. ఎఫ్డీలపై ఇతర బ్యాంకుల నుంచి ఎదుర్కొంటున్న పోటీలో భాగంగానే చిన్న ప్రైవేట్ బ్యాంకులు మెరుగైన రేట్లను అందిస్తున్నట్లుగా చెప్పవచ్చు.
ఎఫ్డీలపై ఎక్కువ వడ్డీ అందిస్తున్న బ్యాంకుల వివరాలు
బ్యాంకు |
వడ్డీరేటు(శాతం) | లక్ష పెట్టుబడిపై వచ్చే మొత్తం (రూ. లలో) |
ఇండస్ ఇండ్ బ్యాంక్ |
7.00 |
1,07,186 |
ఆర్బీఎల్ బ్యాంక్ |
6.75 |
1,06,923 |
యస్ బ్యాంక్ |
6.75 |
1,06,923 |
డీసీబీ బ్యాంక్ |
6.50 |
1,06,660 |
బంధన్ బ్యాంక్ |
5.75 |
1,05,875 |
కెనరా బ్యాంక్ |
5.30 |
1,05,406 |
పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ |
5.30 |
1,05,406 |
బ్యాంక్ ఆఫ్ ఇండియా |
5.25 |
1,05,354 |
యూనియన్ బ్యాంక్ |
5.25 |
1,05,354 |
ఇండస్ ఇండ్ బ్యాంక్ లో ఎఫ్డీపై 7 శాతం వడ్డీ..
2020 నవంబర్ 11 నాటికి లిస్టెడ్ (బిఎస్ఇ) ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకుల్లో ఎఫ్‌డిలపై అందిస్తున్న వడ్డీరేట్లను పరిగణించి బ్యాంక్ బజార్ ఈ డేటాను ప్రచురించింది. ఈ డేటా ప్రకారం చిన్న ప్రైవేటు బ్యాంకులు ఏడాదికి గాను ఎఫ్‌డిలలో పెట్టే పెట్టుబడిపై 7 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయని చెప్పవచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకులు అందించే వడ్డీరేట్లతో పోలిస్తే చిన్న ప్రైవేటు బ్యాంకులు ఎఫ్డీలపై అధిక వడ్డీ అందిస్తున్నాయని ఈ డేటాను పరిశీలిస్తే తెలుస్తుంది. ఎఫ్డీలపై ఎక్కువ వడ్డీ ఇచ్చే వాటిలో ఇండస్ ఇండ్ బ్యాంక్ అగ్రస్థానంలో ఉంది. ఇది ఏడాదికి గాను ఎఫ్‌డిలపై పెట్టే పెట్టుబడిపై 7 శాతం వడ్డీని అందిస్తుంది. అదేవిధంగా ఆర్బిఎల్ బ్యాంక్, యస్ బ్యాంక్ వంటి చిన్న ప్రైవేటు బ్యాంకులు ఎఫ్‌డిపై 6.75 శాతం వడ్డీని అందిస్తున్నాయి. కాగా, ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లు ఎఫ్‌డిలపై 4.90 శాతం వడ్డీని మాత్రమే అందిస్తున్నాయి. అదే విధంగా మరో ప్రైవేట్ బ్యాంకులు యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులు వరుసగా 5.15 శాతం, 4.60 శాతం వడ్డీని అందిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులైన పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్‌లు ఎఫ్‌డిలపై 5.30 శాతం వడ్డీని అందిస్తుండగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు 4.90 శాతం వడ్డీని అమలు చేస్తున్నాయి. ఎఫ్డీలపై రూ .5 లక్షల వరకు పెట్టే పెట్టుబడులపై ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) రాబడికి హామీ ఇస్తుంది.
Published by:
Krishna Adithya
First published:
November 18, 2020, 1:41 PM IST