హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC Plans: ఎటువంటి రిస్క్ లేకుండా అధిక రాబడి అందించే టాప్‌ ఎల్‌ఐసీ ప్లాన్స్‌ ఇవే!

LIC Plans: ఎటువంటి రిస్క్ లేకుండా అధిక రాబడి అందించే టాప్‌ ఎల్‌ఐసీ ప్లాన్స్‌ ఇవే!

LIC Plans: ఎటువంటి రిస్క్ లేకుండా అధిక రాబడి అందించే టాప్‌ ఎల్‌ఐసీ ప్లాన్స్‌ ఇవే!

LIC Plans: ఎటువంటి రిస్క్ లేకుండా అధిక రాబడి అందించే టాప్‌ ఎల్‌ఐసీ ప్లాన్స్‌ ఇవే!

LIC Plans: ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ల విషయానికొస్తే, LIC (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్)ని సురక్షితమైన, అత్యంత విశ్వసనీయ మైనదిగా పేర్కొంటారు. ఎల్‌ఐసీ ప్రస్తుతం విభిన్న ప్రయోజనాలు అందించే పాలసీలను అందిస్తోంది. బెస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీతో పాటు సేవింగ్స్‌ కూడా చేసుకునే ఆప్షన్‌లు ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఈ రోజుల్లో అంతకంతకూ పెరుగుతున్న ధరలు భరించాలన్నా, అనుకోకుంటా ఎదురయ్యే అవసరాలను తీర్చుకోవాలన్నా సరైన ఆర్థిక ప్రణాళికలు తప్పనిసరి. డబ్బును సురక్షితంగా ఉంచడమే కాకుండా, స్థిరమైన రాబడి అందేలా ఇన్వెస్ట్‌ (Invest) చేయాలి. ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌ (Investment Scheme)లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఏది సరైనదో ఎంచుకోవడం కాస్తంత కష్టమైన పనే. ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ల విషయానికొస్తే, LIC (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్)ని సురక్షితమైన, అత్యంత విశ్వసనీయ మైనదిగా పేర్కొంటారు. ఎల్‌ఐసీ ప్రస్తుతం విభిన్న ప్రయోజనాలు అందించే పాలసీలను అందిస్తోంది. బెస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీతో పాటు సేవింగ్స్‌ కూడా చేసుకునే ఆప్షన్‌లు ఉన్నాయి. ఇప్పుడు మంచి రాబడిని అందించే ఎల్‌ఐసీ స్కీమ్‌ల గురించి తెలుసుకుందాం.

* ఎల్‌ఐసీ న్యూ చిల్డ్రన్స్ మనీ-బ్యాక్‌ ప్లాన్‌(LIC New Children’s Money-Back Plan)

ఈ ఎల్‌ఐసీ న్యూ చిల్డ్రన్స్ మనీ-బ్యాక్‌ ప్లాన్‌ ద్వారా పిల్లలకు ఆర్థిక భద్రత లభిస్తుంది. ఈ ప్లాన్ సర్వైవల్ బెనిఫిట్, మెచ్యూరిటీ బెనిఫిట్, డెత్ బెనిఫిట్‌లను అందిస్తుంది. పాలసీని 0 నుంచి 12 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లల కోసం తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లాన్‌లో రూ.లక్ష నుంచి అన్‌లిమిటెడ్‌ అమౌంట్‌ ఇన్వెస్ట్‌ చేసే అవకాశం ఉంది. మెచ్యూరిటీ వయస్సు 25 సంవత్సరాలు. పాలసీని కొనుగోలు చేసిన తేదీ నుంచి 15 రోజులలోపు వాపసు తీసుకొనే సదుపాయం కూడా ఉంది.

* ఎల్‌ఐసీ న్యూ జీవన్ ఆనంద్(LIC New Jeevan Anand)

ఎల్‌ఐసీ న్యూ జీవన్ ఆనంద్ ప్లాన్‌లో సెక్యూరిటీతో పాటు రిటర్న్ హామీ ఉంటుంది. ఈ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడానికి వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. మెచ్యూరిటీ వయస్సు 75 సంవత్సరాలు. పాలసీ వ్యవధి 15 నుంచి 35 సంవత్సరాల మధ్య ఎక్కడైనా ఉండవచ్చు. ఈ ప్లాన్ కింద రూ.లక్ష నుంచి అన్‌లిమిటెడ్‌ అమౌంట్‌ వరకు గ్యారెంటీ ఉంటుంది. ప్లాన్ టర్మ్ ముగిసే వరకు జీవించి ఉంటే, ఇన్సూరెన్స్‌ పాలసీ హోల్డర్‌కు మెచ్యూరిటీ బెనిఫిట్‌ మొత్తం అందుతుంది. నామమాత్రపు ప్రీమియం చెల్లించి టాప్-అప్ కవర్స్‌ పొందవచ్చు.

ఇది కూడా చదవండి : కుటుంబ విహారయాత్రలకు టాప్ డొమెస్టిక్‌ డెస్టినేషన్ గోవా .. టాప్ 5 లిస్ట్ ఇదే!

* ఎల్‌ఐసీ జీవన్ ఉమంగ్(LIC Jeevan Umang)

ఎల్‌ఐసీ జీవన్‌ ఉమంగ్‌ పాలసీ కింద పాలసీదారు 100 సంవత్సరాల వయస్సు వరకు ఇన్సూరెన్స్‌ కవరేజీ పొందుతారు. కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి డబ్బు సహాయం, ఇన్సూరెన్స్‌ కవరేజీని అందించడమే ఈ స్కీమ్‌ ప్రధాన ఉద్దేశం. అత్యవసర పరిస్థితుల్లో, హామీ ఇచ్చిన బెనిఫిట్స్‌ ఆదుకుంటాయి. ఈ పాలసీ ద్వారా పాలసీదారులు తమకు లేదా పిల్లలకు 100 సంవత్సరాల వరకు జీవితకాల వార్షిక ఆదాయానికి హామీ ఇవ్వగలరు. కవరేజ్ గడువు ముగిసే వరకు ఈ ప్రయోజనాలు ప్రతి సంవత్సరం అందుతాయి.

First published:

Tags: Investment Plans, LIC, Personal Finance