మీ సంపాదన ఎంత ఎక్కువైనా, తక్కువైనా ..ఎంత పొదుపు చేస్తున్నారన్నది, ఎలా పొదుపు చేస్తున్నారన్నది మాత్రమే అసలు పాయింట్. మీరు చేస్తున్న పొదుపు లేదా మదుపు ఎంత గొప్పగా ఉన్నప్పటికీ సక్రమంగా లేకపోతే అదంతా బూడిదలో పోసిన పన్నీరే. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేస్తేనే మార్కెట్లో లాభాలు వస్తాయి. ఇందుకు మీకు తీరిక సమయం లేకపోయినా, అవగాహన లేకపోయినా ఆర్థిక నిపుణులు సలహాలు తీసుకునేందుకు ఆలస్యం చేయకండి. కాస్త ఫీజు పోయినా ఫర్లేదు నిపుణులు మీ డబ్బును మరిన్ని రెట్లు పెరిగేలా సాయపడతారు. కేవలం బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పొదుపు చేస్తే ఆ రిటర్న్స్ భవిష్యత్ అవసరాలకు ఏమాత్రం సరిపోదు. పైపెచ్చు మీరు లైఫ్ స్టైల్‌లో చిన్న మార్పులు చేసుకుని, కాస్త పొదుపు విధానాన్ని మార్చుకుంటే చాలు జీవితాంతం హ్యాపీగా గడపచ్చు.
ఉదాహరణకు 2018లో పెళ్లైన ఓ జంటను తీసుకుందాం. ఉద్యోగస్తులైన వీరిద్దరూ 18శాతం పొదుపు చేసి, 45 శాతం ఈక్విటీల్లో పెట్టి, 80సీ టార్గెట్ రీచ్ అవుతూనే.. మిగతాది లోన్లు చెల్లించేందుకు ఉపయోగిస్తున్నా, అది ఏమాత్రం సంతృప్తికరమైన ఫలితాలను ఇవ్వలేకపోయింది. మీరు వీరిలాంటి వారైతే ముందు పెన్ను, పేపర్ తీసుకుని మీరు చేస్తున్న సేవింగ్స్, ఇన్వెస్ట్ మెంట్స్ లిస్ట్ రాసుకుని ఓ ఫైనాన్స్ అడ్వైజర్ దగ్గరికి వెళ్తే మీరు చేస్తున్న తప్పొప్పులను వారు కచ్ఛితంగా లెక్కగట్టి, మీకు అద్భుతమైన సలహా ఇవ్వగలరు.
సెబీ రెజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్:
ఆర్థిక ప్రణాళికను పకడ్బందీగా వేసి ఇవ్వగల నైపుణ్యం వీరి సొంతం. కనుక మీరు ఇలాంటి వారి సాయం తీసుకోండి. కొందరు పొదుపు అంటే కేవలం బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనే అత్యధికంగా చేస్తారు. కానీ కాలం గడిచేకొద్దీ ఇది తప్పు నిర్ణయం అని మీరే అర్థం చేసుకుంటారు. కొద్ది మొత్తాన్ని ఇలా పొదుపు చేయటం ఎప్పుడూ మంచిదే. కానీ కొంత మొత్తాన్ని ఇతర రూపాల్లో అంటే సిప్ వంటి వాటిలో పొదుపు చేస్తే మీకు భారీ మొత్తం చేతికందుతుంది. హై రిస్క్ కాంపొనెంట్ లేని పోర్ట్ ఫోలియోల్లో మీ ఆదాయాన్ని చిన్న వయసులో పెట్టుబడిగా పెడితే మధ్యవయసు వచ్చేసరికి మీరు ఆర్థికంగా నిలదొక్కుకోగలరు. లార్జ్ క్యాప్,మిడ్ క్యాప్,స్మాల్ క్యాప్స్ లో స్మార్ట్ గా పెట్టుబడి ఎలా పెట్టాలన్న విషయాలు మీకు ఫైనాన్స్ అడ్వైజర్లు ఇస్తారు. ఫ్లెక్సీ క్యాప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి కనుక మీరు45శాతం ఈక్విటీ అలొకేషన్ ఇందులో పెట్టడం ఉత్తమం అంటూ వీరు సూచిస్తున్నారు.
షార్ట్ టర్మ్ గోల్స్ కోసం:
ఇంటర్నేషనల్ టూర్ వెళ్లాలనుకుంటే వీటి నుంచి వచ్చే రిటర్న్స్‌ను మీరు ఈజీగా ఖర్చుపెట్టవచ్చు. ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఈ రిటర్న్స్‌ను ఉపయోగించుకుంటే మీరు లోన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మీ గోల్స్ ఏంటి, వాటికి అవసరమయ్యే మొత్తం ఎంత, ఈ గోల్‌ను రీచ్ అయ్యేందుకు ఉన్న మార్గం ఏమిటో మీరు అడ్వైజర్‌కు వివరించండి. వారు మీకు బెస్ట్ రూట్ మ్యాప్ ఇస్తారు. అరకొర జ్ఞానంతో మార్కెట్లో పెట్టి మునగకండి. మిడిమిడి జ్ఞానం కంటే ఈ రంగంలో నిపుణులను ఆశ్రయిస్తే వారు మీకు చక్కని మార్గాన్ని చూపుతారు. ఈ విషయంలో ఆలస్యం చేయకండి. ఎందుకంటే చిన్న వయసులో చేసే పొదుపు లేదా పెట్టుబడి మీరు చాలా మంచి రిటర్న్స్‌ను ఆర్జించేలా చేస్తుంది. ఇందుకు కావాల్సిందల్లా మీరు స్మార్ట్‌గా మీ ఆదాయాన్ని దాచుకునే మార్గాలను అన్వేషించటమే. భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగస్తులైతే ఇద్దరూ కలిసి ఓ ఆర్థిక లక్ష్యాన్ని నిర్ణేశించుకుని ఆర్థిక క్రమశిక్షణతో అడుగులు వేస్తే సరి. మీకున్న పరిమిత ఆదాయంతో సంపద సృష్టించాలంటే ఇలాంటి ప్రయాణం చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Finance, Money, Money making, Personal Finance, Save Money