మొదటిసారి PPFలో పెట్టుబడులు పెడుతున్నారా...అయితే ఈ విషయాలు మీకోసమే...

PPFకు 15 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ పెట్టుబడులపై ట్యాక్స్ మినహాయింపులు కూడా ఉన్నాయి. మెచూరిటీ తరువాత తీసుకొనే మొత్తం, పెట్టుబడి కాలంలో సంపాదించిన వడ్డీపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. PPF గురించి మరిన్ని వివరాలు..

news18-telugu
Updated: November 3, 2020, 6:31 PM IST
మొదటిసారి PPFలో పెట్టుబడులు పెడుతున్నారా...అయితే ఈ విషయాలు మీకోసమే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ప్రభుత్వం ధ్రువీకరించిన, రక్షణ కల్పిస్తున్న పెట్టుబడి మార్గంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)కు పేరుంది. పదవీ విరమణను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు పెట్టేవారికి ఇది మంచి రాబడిని ఇస్తుంది. దీన్ని 1968లో నేషనల్ సేవింగ్స్ ఆర్గనైజేషన్ ప్రవేశపెట్టింది. PPFకు 15 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ పెట్టుబడులపై ట్యాక్స్ మినహాయింపులు కూడా ఉన్నాయి. మెచూరిటీ తరువాత తీసుకొనే మొత్తం, పెట్టుబడి కాలంలో సంపాదించిన వడ్డీపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. PPF గురించి మరిన్ని వివరాలు..

అర్హత

భారతీయులు ఎవరైనా PPF అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. మైనర్, మానసిక స్థితి సరిగా లేని వారి తరఫున ఒక సంరక్షకుడు PPF అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. 50 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు ఉన్న రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగులు.. పదవీ విరమణ ప్రయోజనాలు అందిన ఒక నెలలోపు పెట్టుబడులు పెట్టాలనే షరతుతో  PPF అకౌంట్‌ ఓపెన్ చేయవచ్చు. కానీ వారికి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు అనుమతి లేదు.

మెచూరిటీ తేదీ

PPF మెచూరిటీ తేదీని అకౌంట్ ఓపెన్ చేసిన రోజు నుంచి లెక్కించరు. అకౌంట్‌లో మొదటిసారి డబ్బు జమచేసిన తేదీ నుంచి, సంబంధిత ఆర్థిక సంవత్సరం చివరి రోజును ప్రామాణికంగా తీసుకొని మెచూరిటీ తేదీని లెక్కిస్తారు. అకౌంట్ ఓపెన్ చేసిన తేదీకి, మెచూరిటీకి సంబంధం ఉండదు. ఉదాహరణకు, ఒక పెట్టుబడిదారుడు జూలై 1, 2019న PPF అకౌంట్‌లో మొదటి కాంట్రిబ్యూషన్ జమ చేస్తే, మార్చి 31, 2020 నుంచి మెచూరిటీ గడువును 15ఏళ్ల వరకు లెక్కిస్తారు. ఈ సందర్భంలో మెచూరిటీ తేదీ ఏప్రిల్ 1, 2035 అవుతుంది.

వడ్డీ లెక్కింపు

PPF నిబంధనల ప్రకారం పెట్టుబడిదారులు తమ వాయిదాలను ప్రతి నెల ఐదవ తేదీన లేదా అంతకుముందు అకౌంట్కు క్రెడిట్ చేయాలి. ఇలా చేస్తేనే ఆ నెలకు వారికి వడ్డీ లభిస్తుంది. నెలలో ఐదవ తేదీ నుంచి నెలాఖరు వరకు అకౌంట్‌లో ఉన్న మినిమం బ్యాలెన్స్‌పై వడ్డీ రేట్లను లెక్కిస్తారు. PPFలో డిపాజిట్ చేసిన మొత్తంపై వడ్డీని నెలవారీ ప్రాతిపదికన లెక్కిస్తారు. కానీ మొత్తం వడ్డీని ఆర్థిక సంవత్సరం చివర్లో, అంటే ప్రతి సంవత్సరం మార్చి 31న అకౌంట్‌కు క్రెడిట్ చేస్తారు. నెలలో ఐదవ తేదీకి ముందే డబ్బు జమ చేస్తే వడ్డీపై వడ్డీని కూడా పొందవచ్చని ఫిన్‌డాక్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నితిన్ షాహి చెబుతున్నారు.

ప్రీ మెచూర్ విత్‌డ్రా, లోన్‌

మెచూరిటీ తేదీని లెక్కించే రోజు నుంచి ఒక సంవత్సరం దాటిన తరువాత, ఐదేళ్ల లోపు వరకు PPFపై లోన్‌ తీసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన సంవత్సరం చివరి నుంచి ఐదేళ్ల గడువు ముగిసిన తరువాత డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఖాతాదారుడు అకౌంట్‌లో ఉన్న మొత్తం డబ్బులో 50 శాతం వరకు మాత్రమే ప్రీమెచూర్ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆ తరువాత ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు.
Published by: Krishna Adithya
First published: November 3, 2020, 6:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading