హోమ్ /వార్తలు /బిజినెస్ /

Covid care policy: ఇంటి వద్దే కరోనా ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారా?.. అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్​ కోసం ఇలా చేయండి

Covid care policy: ఇంటి వద్దే కరోనా ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారా?.. అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్​ కోసం ఇలా చేయండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఇంటి వద్ద చికిత్స తీసుకుంటే ఆరోగ్య బీమా పాలసీ వర్తిస్తుందా? లేదా? అనే సందేహం చాలా మందిలో ఉంది. ఎందుకంటే ఆరోగ్య బీమా పాలసీలు సాధారణంగా ఆసుపత్రిలో చేరినప్పుడే చెల్లుబాటవుతాయి. ఇంటి దగ్గర తీసుకునే ట్రీట్​మెంట్లకు అయ్యే ఖర్చులను క్లెయిమ్​ చేసుకోలేం. ఈ నేపథ్యంలో ఇంట్లోనే కరోనా చికిత్స పొందుతున్నప్పుడు కవరేజీ పొందడానికి ఉన్న ఐఆర్​డీఏఐ నిబంధనలను తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజుకు మూడు లక్షలకు పైగా పాజిటివ్​ కేసులు నమోదవుతున్నాయి. కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడింది. దీంతో పరిస్థితి చేజారిన వారినే ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని, మిగతా వారిని హామ్​ ఐసోలేషన్​లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు కోరుతున్నారు. అయితే ఇంటి వద్ద చికిత్స తీసుకుంటే ఆరోగ్య బీమా పాలసీ వర్తిస్తుందా? లేదా? అనే సందేహం చాలా మందిలో ఉంది. ఎందుకంటే ఆరోగ్య బీమా పాలసీలు సాధారణంగా ఆసుపత్రిలో చేరినప్పుడే చెల్లుబాటవుతాయి. ఇంటి దగ్గర తీసుకునే ట్రీట్​మెంట్లకు అయ్యే ఖర్చులను క్లెయిమ్​ చేసుకోలేం. ఈ నేపథ్యంలో ఇంట్లోనే కరోనా చికిత్స పొందుతున్నప్పుడు కవరేజీ పొందడానికి ఉన్న ఐఆర్​డీఏఐ నిబంధనలను తెలుసుకుందాం.

ఐఆర్​డీఏఐ తాజా నిబంధనలు

గతేడాది జూన్​లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డిఎఐ) కోవిడ్-19 చికిత్సను ఆరోగ్య బీమా పాలసీ కిందికి తెచ్చింది. అన్ని కంపెనీలు కోవిడ్ స్టాండర్డ్ హెల్త్ పాలసీ లేదా కోవిడ్ కేర్ పాలసీని అందించాలని ఆదేశించింది. బీమా చేసిన వ్యక్తికి కరోనా నిర్ధారణ అయ్యి 14 రోజుల పాటు హోమ్​ ఐసోలేషన్​లో ఉన్నప్పటికీ.. అతడి చికిత్సకు అయ్యే ఖర్చులను చెల్లించాలని ఐఆర్​డీఏఐ ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది. ఈ సందర్భంలో కవరేజీకి నిరాకరిస్తే ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

పాలసీ ఎంపికలో జాగ్రత్తలు

భారత్​లో హెల్త్​ ఇన్సూరెన్స్​లకు ఇప్పుడిప్పుడే ప్రజలు అలవాటు పడుతున్నారు. ఇంతకు ముందు ఉన్న పాలసీల్లో కోవిడ్​–19 చికిత్స ఖర్చులను భర్తీ చేసేవి లేవు. ఈ నేపథ్యంలో ప్రతి కంపెనీ కరోనా కవచ్​ లేదా స్టాండర్డ్​ కోవిడ్ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీలను కచ్చితంగా అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ప్రస్తుతం వివిధ సంస్థలు కరోనా చికిత్సకు ప్రత్యేకంగా పాలసీలను అందిస్తున్నాయి. కరోనా మహమ్మారి వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులకు ఇవి కవరేజీ కల్పిస్తున్నాయి. కొత్త పాలసీని కొనుగోలు చేసే ముందు కరోనా చికిత్సలో భాగంగా హోమ్​ ఐసోలేషన్​లో ఉన్నా సరే కవరేజీ లభిస్తుందా? లేదా? అనేది చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని బీమా సంస్థలు మాత్రమే దీనికి అవకాశం కల్పిస్తున్నాయి. దీనిపై స్పష్టత కోసం పాలసీ బుక్‌లెట్​లో వివరాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి.

వీటికి మాత్రమే కవరేజీ

స్టాండర్డ్​ కోవిడ్ పాలసీ కింద పాలసీదారుడు కరోనా బారిన పడి ఇంట్లో లేదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా కవరేజీ లభిస్తుంది. అనేక ఆస్పత్రులు ఇప్పుడు డొమిసిలియరీ చికిత్స కోసం రూపొందించిన హెల్త్‌కేర్ ప్యాకేజీలను అందిస్తున్నాయి. ఈ ప్యాకేజీ కింద నర్సింగ్, కన్సల్టేషన్, ప్రిస్క్రిప్షన్లు, ట్రీట్​మెంట్​ వంటి వాటికి కవరేజీ లభిస్తుంది. ఈ స్టాండర్డ్​ కోవిడ్ పాలసీల క్లెయిమ్‌లను 15 నుంచి 30 రోజుల్లో పరిష్కరించాలనే నియమం ఉంది. అయితే పిపిఈ కిట్లు, మెడికల్​ పరికరాల ఖర్చును మాత్రం బీమా సంస్థలు భరించవు. హోమ్​ ఐసోలేషన్​లో ఉన్నప్పుడు ఏ చికిత్సలకు కవరేజీ లభిస్తుందనే విషయంపై అవగాహన పెంచుకోవాలి.

క్లెయిమ్​ ఎలా చేయాలి?

ప్రతి పాలసీకి క్లెయిమ్​ ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. వాటిని పాలసీదారుడు తప్పక పాటించాలి. మీ చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చుకు సంబంధించిన మెడికల్​ డాక్యుమెంట్లను సమర్పించాలని ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీదారుడిని కోరుతుంది. అయితే ఇంట్లోనే ఉంటూ కోవిడ్​ చికిత్స తీసుకునే విషయంలో, మీకు కరోనా పాజిటివ్​ నిర్థారణ అయినట్లు RTPCR టెస్ట్ పాజిటివ్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాక హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ కోసం బెడ్​ లభించలేదని, హోమ్​ ట్రీట్​మెంట్​కు డాక్టర్​ సిఫారసు చేసినట్లు డాక్యుమెంట్లను చూపించాల్సి ఉంటుంది.

First published:

Tags: Health Insurance

ఉత్తమ కథలు