NoCost EMI పథకాన్ని ఎంచుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి...

ఈ స్కీం కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా ఉన్నా, నిర్ణీత సమయంలో వాయిదాలు చెల్లించకపోతే మీ క్రెడిట్ స్కోర్ పై ఎఫెక్ట్ పడుతుంది. తద్వారా భవిష్యత్లో మీరు ఇతర లోన్లు తీసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.

news18-telugu
Updated: October 28, 2020, 6:02 PM IST
NoCost EMI పథకాన్ని ఎంచుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
దేశంలో కోవిడ్–19 మహమ్మారి కారణంగా స్పంభించిన అన్ని రకాల సేవలు అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా క్రమంగా ప్రారంభమవుతున్నాయి. దీనికి అనుగుణంగానే ఈ పండుగ సీజన్లో కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజాలు Flipkart మరియు Amazon  సంస్థలు ఫెస్టివల్ సేల్స్ను నిర్వహించాయి. కోవిడ్–19తో స్పంభించిన భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్న ఈ సమయంలో కస్టమర్లను ఆకర్షించడానికి ఆయా ఈ–కామర్స్ సంస్థలుKotak Mahindra, HDFC, ICICI, State Bank of India (SBI), Bank of Baroda వంటి ప్రముఖ బ్యాంకులతో టైఅప్ అయ్యాయి. ఆయా బ్యాంకులు తమ డెబిట్ మరియు క్రెడిట్ కార్డుదారులకు ప్రత్యేకమైన ఆఫర్లు కల్పించాయి. ఈ ఆఫర్లన్నింట్లో ‘NoCost EMI’ సౌకర్యం కొనుగోలుదారులను అత్యంత ఆకర్షించింది.

NoCost EMI అంటే ఏమిటి?

నో-కాస్ట్ EMI పథకాలు లోన్ ఆఫర్ల పరిధిలోకి వస్తాయి. ఈ స్కీం ద్వారా ప్రోడక్ట్ మొత్తం ధరను కొనుగోలుదారుడు నిర్ణీత నెలల పాటు సమాన వాయిదాల్లో చెల్లించి అమ్మకపు ధరకే ఆ ప్రోడక్ట్ను సొంతం చేసుకోవచ్చు. ఈ స్కీంపై మైలోన్ కేర్ డాన్ ఇన్ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ “ఈ స్కీం కింద ప్రోడక్ట్ తయారీదారుడు లేదా ఈ–కామర్స్ సంస్థ కస్టమర్ చెల్లించాల్సిన వడ్డీ మొత్తాన్ని ముందస్తు డిస్కౌంట్ రూపంలో లేదా క్యాష్‌బ్యాక్‌ రూపంలో చెల్లిస్తుంది. కొనుగోలు సమయంలో చేసిన ఒప్పందం ప్రకారమే నిర్ణీత కాలానికి ఈ క్యాష్బ్యాక్ పొందవచ్చు.

ఎలా పని చేస్తుంది?

ఒకవేళ మీరు ఏదైనా ఈ–కామర్స్ పోర్టల్ నుండి రూ .74,990 విలువ చేసే ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయానుకుంటున్నారు. కొనుగోలు సమయంలో మీ సిటీబ్యాంక్ కార్డుతో 12 నెలల ఈఎంఐ కాలానికి గాను ‘NoCost EMI’ ఆప్షన్ను ఎంచుకోండి. తద్వారా మీరు చెల్లించాల్సిన ల్యాప్టాప్ మొత్తం ధర 12 నెలల కాలానికి గాను సమానంగా విభజించబడింది. దీనికి గాను మీరు ప్రతినెల రూ. 6,249 చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీరు ఎంచుకున్న 12 నెలల ఈఎంఐ కాలానికి మీ బ్యాంక్ మీ నుండి వడ్డీ వసూల్సి ఉంటుంది. కానీ, NoCost EMI స్కీం కింద మీ వడ్డీ మాఫీ చేయబడుతుంది. తద్వారా మీరు రూ.5,754 వడ్డీ మాఫీ పొందుతారు. ల్యాప్టాప్ కొనుగోలు సమయంలోనే ముందస్తుగా ఈ వడ్డీ ఛార్ట్ మీకు ప్రత్యక్షమవుతుంది. దీని ప్రకారం మీరు 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12 నెలల ఆప్షన్లను సెలెక్ట్ చేసుకోవచ్చు.

రూ.74,990 విలువ చేసే ల్యాప్టాప్ కొనుగోలుపై వర్తించే నెలవారీ ఈఎంఐ

ఈఎంఐ ప్లాన్                                        వడ్డీ(ఏడాదికి)                   డిస్కౌంట్                                మొత్తం ధరరూ.24,997 x 3 నెలలు             రూ. 1,596(13%)         రూ. 1,596                   రూ. 74,990

రూ.12,498 x 6 నెలలు             రూ. 2,763(13%)         రూ. 2,763                   రూ. 74, 990

రూ.8,332 x  9 నెలలు              రూ. 4,480(15%)         రూ. 4,480                  రూ.74,990

రూ.6,249 x 12 నెలలు              రూ. 5754 (15%)         రూ. 5754                  రూ. 74,990

సకాలంలో చెల్లించకపోతే పెనాల్టీ వసూలు..

ఈ స్కీం కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా ఉన్నా, నిర్ణీత సమయంలో వాయిదాలు చెల్లించకపోతే మీ క్రెడిట్ స్కోర్ పై ఎఫెక్ట్ పడుతుంది. తద్వారా భవిష్యత్లో మీరు ఇతర లోన్లు తీసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అంతేకాక ఆయా బ్యాంకులు మీ నుండి పెనాల్టీ ఛార్జీల కింద 2 నుండి 3.5 శాతం అదనపు వడ్డీని వసూలు చేస్తాయని గుర్తించుకోడి. ఒకవేళ మీరు ఒక్క ఈఎంఐని ఆలస్యంగా చెల్లించినా సరే పెనాల్టీ ఛార్జీలను ఎదుర్కోవడంతో పాటు, కొనుగోలు సమయంలో తగ్గింపును కూడా కోల్పోతారు. అందువల్ల నోకాస్ట్ వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో, మీరు ఆలస్యంగా ఈఎంఐ చెల్లిస్తే అన్ని ఇబ్బందులు కూడా రావొచ్చు. అందువల్ల సకాలంలో మీ ఈఎంఐని చెల్లించడం మర్చిపోకండి.
Published by: Krishna Adithya
First published: October 28, 2020, 5:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading