హోమ్ /వార్తలు /బిజినెస్ /

Home loan ముందే కట్టేస్తున్నారా...అయితే pre-payment చేసేముందు ఇవి తెలుసుకోండి

Home loan ముందే కట్టేస్తున్నారా...అయితే pre-payment చేసేముందు ఇవి తెలుసుకోండి

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

నిజమే.. మీకు చేతికందిన అదనపు డబ్బును ప్రీపేమెంట్ కింద కట్టి శాశ్వతంగా హోం లోన్ నుంచి బయటపడవచ్చు. కానీ ఇలా చేయడం ఎంతవరకు తెలివైన పని? అదనంగా మీచేతిలో ఉన్న డబ్బును మరెక్కడైనా, వేరే రూపంలో పెట్టుబడిగా (investment) పెడితే మీ చేతికి మరింత ఎక్కువ లాభం వస్తుందేమో అని ఎప్పుడైనా అలోచించారా?

ఇంకా చదవండి ...

EMI అంటే చాలామందికి భయం, వీటిని తలుచుకుంటేనే కొందరికి గుండెదడ వచ్చేసినంత పనవుతుంది. మరి హోం లోన్ తీసుకున్నాం, కనీసం 15-20 ఏళ్ల పాటు చెల్లించాలి, వడ్డీతో కలిపి తడిసి మోపెడవుతుంది ఎలారా దేవుడా అని ఆలోచిస్తున్నారా? ప్రీపేమెంట్ సౌలభ్యం ఉందికదా? అని ఆలోచిస్తున్నారా? నిజమే.. మీకు చేతికందిన అదనపు డబ్బును ప్రీపేమెంట్ కింద కట్టి శాశ్వతంగా హోం లోన్ నుంచి బయటపడవచ్చు. కానీ ఇలా చేయడం ఎంతవరకు తెలివైన పని? అదనంగా మీచేతిలో ఉన్న డబ్బును మరెక్కడైనా, వేరే రూపంలో పెట్టుబడిగా (investment) పెడితే మీ చేతికి మరింత ఎక్కువ లాభం వస్తుందేమో అని ఎప్పుడైనా అలోచించారా? ప్రీపేమెంట్ చార్జీలున్నా, ఈ చార్జీలు వసూలు చేయకపోయినా ఇతర అంశాలను, మార్కెట్ స్థితిగతులతో పాటు పలు అంశాలను పరిగణలోకి తీసుకోవటం చాలా ముఖ్యం.

హోం లోన్ వడ్డీ చాలా తక్కువ

మీరు బ్యాంకుకు చెల్లిస్తున్న హోం లోన్ వడ్డీ (interest) ఎంత? ఇది పెరిగిందా తగ్గిందా? ఫ్లోటింగ్ home loans వడ్డీ రేటా? ఫిక్స్డ్ వడ్డీ రేటు చెల్లిస్తున్నారా? ఇంకా ఎన్నేళ్లు మీరు ఈ లోన్ చెల్లించాల్సి ఉంది? మీ ఆరోగ్య స్థితిగతుల మాటేంటి? మీకు కార్పస్ ఫండ్ (corpus fund) ఉందా? మీ పిల్లల ఉన్నత చదువులు, ఉద్యోగాల మాటేంటి? వంటివన్నీ లెక్కలేసుకోండి. ఇలా వద్దనుకుంటే పూర్తి ప్రీపేమెంట్ కాకపోయినా కొన్ని ప్రత్యామ్నాయాల ద్వారా మీ వాయిదాలను తగ్గించుకోవచ్చు. అంటే ఇంటి లోన్ తీసుకుని 5 ఏళ్ల అయిందనుకోండి మీరు లోన్ తీసుకున్న మొత్తంలో కనీసం 5శాతం చెల్లించండి.. చాలు.. దీంతో మీ ఈఎంఐ చాలా తగ్గుతుంది. కాబట్టి ప్రతినెలా పెద్దగా భారం అనిపించదు. ఇలా చేస్తే మీ ఈఎంఐలు 18 నెలలు తగ్గుతాయి. లోనుపై వడ్డీ భారం దింపుకోవచ్చు. ఇలా చేసే సమయంలో హోం లోన్ వడ్డీ తక్కువగా ఉండే సమయం చూసి కట్టండి, మరింత భారం తగ్గుతుంది. మిగతా డబ్బును మరెక్కడైనా సురక్షితంగా మదుపు చేసుకోండి. జనరల్ గా ఉద్యోగులకు ఏటా జీతం పెరుగుతుంది కనుక ఏటా మీరు ఈఎంఐ చెల్లించే మొత్తాన్ని పెంచుకోండి, ఇలా చేస్తే ప్రీపేమెంట్ అవసరం ఉండదు. 5-10శాతం ఈఎంఐ ఏటా పెంచమని బ్యాంకులకు విజ్ఞప్తి చేసుకునే వెసులుబాటుంది. హోం లోన్ పై వసూలు చేసే వడ్డీలు చాలా తక్కువ అనేది గుర్తుంచుకోండి, మీ మనసు కుదుటపడుతుంది.

అదనపు వాయిదా

ఏడాదికి 12 నెలలు, కానీ మీరు 13వ ఈఎంఐ కట్టేలా ప్రణాళిక రెడీ చేసుకోండి. అంటే ప్రతినెలా కొంత మొత్తాన్ని అదనంగా పక్కకి పెడుతూ, మిగతా ఖర్చులు తగ్గించుకోండి, దీన్ని ఏడాది చివరిలో ఒక ఈఎంఐ ఎక్స్ ట్రా అనేలా కట్టారనుకోండి మరింత త్వరగా మీరు గృహరుణాన్ని తీర్చుకోవచ్చు. మీ జీవితంలో ఉద్యోగం లేదా ఇతర రూపంలో అదనపు డబ్బు చేతికందితే దాన్ని హోం లోన్ కోసం ఉపయోగించండి. దీంతో మీకు రుణభారం తగ్గడమే కాదు, వడ్డీ నుంచి కాస్త రిలాక్సేషన్ వస్తుంది. అలాగని ప్రీ పేమెంట్ కు వెళితే ఓ రకంగా మీరు నష్టపోతారు కూడా. ఎందుకంటే ఇలా హోం లోన్ తీసుకోవటం వల్ల దీన్ని పన్ను మినహాయింపుకింద చూపవచ్చు. మరోవైపు ప్రీపేమెంట్ చెల్లింపుల కోసం చేతిలో ఉన్న డబ్బును మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర రూపాల్లో మదుపు చేస్తే అదనపు ఆదాయం రావటం ఖాయం.

అత్యవసర నిధి emergency fund ముట్టుకోవద్దు

హోం లోన్ త్వరగా తీర్చేసుకుని సొంతింటి కల సాకారం చేసుకోవాలనే ఆతురతలో మీరు ఎమర్జెన్సీ ఫండ్ ను ముట్టుకోవద్దు. ఎందుకంటే కోవిడ్ వంటి మహమ్మారుల నేపథ్యంలో అత్యవసర నిధులు కలిగి ఉండటం తప్పనిసరిగా మారింది. సడన్ గా ఉద్యోగమే పోయిందనుకోండి అప్పుడు మీ పరిస్థితి ఏంటి, మిమ్మల్ని ఆదుకునేందుకు ఈ ఫండ్ చేతిలో ఉండాలిగా. పిల్లల ఫీ, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, అద్దె, సరుకులు, అనారోగ్యం వంటివాటికి ఇది ఉపయోగపడుతుంది కనుక ఎమర్జెన్సీ ఫండ్ లో ఉన్న డబ్బు తీసి హోం లోన్ ప్రీపేమెంట్ చేస్తే మీకు చాలా నష్టం వస్తుంది. మీరెక్కడైనా పెట్టుబడులు పెట్టి ఉంటే వాటిని క్యాన్సిల్ చేసి ఎప్పడూ హోం లోన్ ప్రీపేమెంట్ చేయకండి. పెట్టుబడులతో వచ్చే లాభాలు చాలా ఎక్కువ, వాటిని హోం లోన్ కోసం పోగొట్టుకోకండి. హోం లోన్ పై మీరు బ్యాంకులకు చెల్లించే వడ్డీ, పెట్టుబడులపై వచ్చే రిటర్న్స్ కంటే చాలా తక్కువ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. హోం లోను కట్టేబదులు దీర్ఘకాల పెట్టుబడి పెట్టారో మీ సంపద మరింత పెరిగి ఆర్థికంగా ఎదుగుతారు.

Published by:Krishna Adithya
First published:

Tags: Business, Home loan

ఉత్తమ కథలు