ప్రైవేటు రంగంలో పెద్ద బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. నవంబర్ 13 నుంచి తాజా వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంకు ప్రకటించింది. యాక్సిస్ బ్యాంక్ ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు గడువుతో ఫిక్స్డ్ డిపాజిట్లను అందిస్తుంది. తాజా సమీక్ష తరువాత యాక్సిస్ బ్యాంక్ ఏడు నుంచి 29 రోజుల వరకు మెచూరిటీ ఉండే ఎఫ్డీలపై 2.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 30 రోజుల నుంచి మూడు నెలల వరకు మెచూరిటీ ఉండే ఎఫ్డీలపై మూడు శాతం, మూడు నుంచి ఆరు నెలల వరకు మెచూరిటీ ఉండే ఎఫ్డీలపై 3.5 శాతం వడ్డీ అందిస్తున్నట్టు బ్యాంకు ప్రకటించింది.
తాజా వడ్డీ రేట్లు
ఆరు నెలల నుంచి 11 నెలల 25 రోజుల వరకు మెచూరిటీ ఉండే ఎఫ్డీలపై యాక్సిస్ బ్యాంక్ 4.40శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 11 నెలల 25 రోజుల నుంచి ఒక సంవత్సరానికి అదనంగా ఐదు రోజుల లోపు మెచూరిటీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లపై వినియోగదారులు 5.15 శాతం వడ్డీని పొందవచ్చు. ఒక సంవత్సరం ఐదు రోజుల నుంచి 18 నెలల కన్నా తక్కువ గడువు ఉండే ఎఫ్డీలపై 5.10 వడ్డీ రేట్లను బ్యాంకు విధిస్తోంది. 18 నెలల నుంచి రెండు సంవత్సరాల కన్నా తక్కువ మెచూరిటీ ఉండే టర్మ్ డిపాజిట్లపై యాక్సిస్ బ్యాంక్ 5.25 వడ్డీని అందిస్తుంది. రెండు నుంచి ఐదేళ్ల గడువు ఉండే లాంగ్ టర్మ్ డిపాజిట్లపై ఖాతాదారులు 5.40శాతం, ఐదు నుంచి 10 సంవత్సరాల వరకు ఉండే టర్మ్ డిపాజిట్లపై 5.50% వడ్డీ రేటును పొందవచ్చు.
సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకం
ఎంచుకున్న మెచ్యూరిటీలపై సీనియర్ సిటిజన్లకు యాక్సిస్ బ్యాంక్ పెద్ద మొత్తంలో వడ్డీ రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మెచూరిటీ ఉండే డిపాజిట్లపై 2.5 శాతం నుంచి 6.05 శాతం వరకు వడ్డీ రేటు లభిస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లను తాజాగా సవరించింది. ఈ రేట్లు నవంబర్ 13 నుంచి అమల్లోకి వస్తాయని ఆ బ్యాంకు తెలిపింది. ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మెచూరిటీ ఉండే ఎఫ్డీలపై హెచ్డీఎఫ్సీ 2.5 శాతం నుంచి 5.50 వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Axis bank, Bank account, Banks