కొత్త సేవలను ప్రవేశపెట్టిన PFRDA...ఇకపై బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చాలా ఈజీ...

చందాదారులు తమ బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయడాన్ని ఆ సంస్థ సులభతరం చేసింది. ఇందుకు ప్రత్యేకంగా డి- రెమిట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

news18-telugu
Updated: November 18, 2020, 7:24 PM IST
కొత్త సేవలను ప్రవేశపెట్టిన PFRDA...ఇకపై బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చాలా ఈజీ...
ఫ్రతీకాత్మకచిత్రం
  • Share this:
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) కొత్త సేవలను ప్రారంభించింది. చందాదారులు తమ బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయడాన్ని ఆ సంస్థ సులభతరం చేసింది. ఇందుకు ప్రత్యేకంగా డి- రెమిట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఈ సంస్థ ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. భారతదేశ పౌరులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టమ్ పేరుతో పెన్షన్, పెట్టుబడి పథకాన్ని ప్రారంభించింది. ఇది దీర్ఘకాలంలో సురక్షితమైన, మార్కెట్ ఆధారిత రాబడిని అందిస్తుంది. ఈ పథకం ఫలాలు పదవీ విరమణ తరువాత ఎంతగానో ఉపయోగపడతాయి.

డి రెమిట్ ద్వారా ఖాతాదారులు NPSలో సులభంగా పెట్టుబడులు పెట్టవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్‌కు లభించే నెట్ అసెట్ వ్యాల్యూ (NAV)ని చందాదారుడు పెట్టుబడి చేసే రోజే తెలుసుకోవచ్చు. దీంతో పాటు ఎన్‌పీఎస్ పెట్టుబడిదారుడు మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) మాదిరిగానే తమ బ్యాంక్ ఖాతాల నుంచి క్రమానుగతంగా చెల్లింపులు చేయవచ్చు. 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసు (ఎన్‌పీఎస్ దరఖాస్తు సమర్పించిన తేదీ నాటికి) ఉన్న దేశ ప్రజలు ఎవరైనా ఎన్‌పీఎస్‌లో చేరవచ్చు.

సులభంగా సేవలు
డి- రెమిట్ సౌకర్యం ద్వారా NPS చందాదారులు నేరుగా తమ బ్యాంక్ అకౌంట్ల నుంచి ఎన్‌పీఎస్ అకౌంట్లకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దీంతో పాటు వినియోగదారులు సులభంగా డిపాజిట్లు చేయవచ్చు. సేమ్ డే ఎన్‌ఏవీని ఉపయోగించుకొని పెట్టుబడులపై మంచి రాబడిని పొందవచ్చు. డి- రెమిట్ వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నెట్ బ్యాంకింగ్‌లో ఆటో డెబిట్ ఆప్షన్‌ను ఉపయోగించి క్రమానుగత పెట్టుబడిని చెల్లింపుల కోసం ఏర్పాట్లు చేసుకోవచ్చు. రోజువారీ, నెలవారీ, త్రైమాసిక క్రమానుగత పెట్టుబడుల ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. టైర్1, టైర్- II అకౌంట్లలో డి రెమిట్ కనీస విలువ ప్రతి లావాదేవీకి రూ.500గా ఉంది. సేమ్ డే NAVని పొందడానికి డైరెక్ట్ రెమిటెన్స్ (D-రెమిట్)ను ట్రస్టీ బ్యాంక్ (ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్)కు పంపాలి.

NAV తెలుసుకోవచ్చు
డి రెమిట్టెన్స్ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి చందాదారులకు ట్రస్టీ బ్యాంకులో వర్చువల్ ఐడి (అకౌంట్) ఉంటే చాలు. ట్రస్టీ బ్యాంకులో తీసుకున్న వర్చువల్ అకౌంట్ కేవలం ఎన్‌పీఎస్ కాంట్రిబ్యూషన్ రెమిట్టెన్స్ కోసమే ఉపయోగపడుతుంది. నెట్ అసెట్ వాల్యూ (NAV) అనేది ఫండ్ యూనిట్ ధర. ప్రతి వర్కింగ్‌ డే చివర్లో NAVని లెక్కిస్తారు. ఫండ్ పోర్ట్‌ఫోలియోలోని అన్ని సెక్యూరిటీలు, నగదు విలువను యాడ్ చేసి, దాని నుంచి ఫండ్ లయబిటిటీని తీసివేస్తారు. దీన్ని ఫండ్ యూనిట్ల సంఖ్యతో భాగిస్తే ఎన్‌ఏవీ వస్తుంది. ఫండ్ హోల్డింగ్స్ విలువపై NAV ఆధారపడి ఉంటుంది.

డి రెమిట్‌ను ఎలా ఎంచుకోవాలి?

CRA సిస్టమ్‌ను యాక్సెస్ చేయడానికి, PRANతో లింక్ అయ్యి ఉండే వర్చువల్ IDని క్రియేట్ చేయడానికి D-రెమిట్ అవసరం. ఆథరైజేషన్ తరువాత చందాదారులు తమ నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అయ్యి వర్చువల్ ఐడిని యాడ్ చేసుకోవచ్చు. ఆ తరువాత UTIB0CCH274 IFSCకోడ్‌తో NEFT,RTGS,IMPS ద్వారా పెట్టుబడుల కోసం సులభంగా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.
Published by: Krishna Adithya
First published: November 18, 2020, 7:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading