Home /News /business /

Term Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా ? అయితే ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

Term Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా ? అయితే ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Term Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిదని గుర్తించుకోవాలి. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి అర్హులు. వయసు పెరిగే కొద్ది ప్రీమియం కూడా పెరుగుతుంది.

    లైఫ్ ఇన్సూరెన్స్.. ఒకప్పుడు దీని గురించి చర్చించేందుకు ప్రజలు అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. కానీ, కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరు జీవిత బీమా గురించి అవగాహన ఏర్పర్చుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ కారణంగానే గత ఏడాది కాలంగా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య రెట్టింపు అయ్యిందని అనేక సర్వేలు తేల్చి చెబుతున్నాయి. లైఫ్ ఇన్స్రెన్స్ గురించి తెలుసుకోవడంలో భాగంగా టర్మ్ ఇన్సూరెన్స్, దాని ప్రయోజనాలను కూడా తెలుసుకోవాల్సిందే. ఎవరి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో ఎవరికీ తెలియదు. కాబట్టి, మన ఆశలు, ఆశయాలు మనం ఉన్నా, లేకున్నా జరిగేలా చూడడానికి, మన మీద ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ మనం లేకపోయినా సరే ఆర్థిక భరోసా అందించడానికి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉపయోగపడతాయి.

    అయితే, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిదని గుర్తించుకోవాలి. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి అర్హులు. వయసు పెరిగే కొద్ది ప్రీమియం కూడా పెరుగుతుంది. అందువల్ల కెరీర్ ప్రారంభించిన వెంటనే ఈ పాలసీని తీసుకోవడం మంచిది.

    చిన్న వయస్సులోనే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటే ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 45 ఏళ్ల వయస్సులో కోటి రూపాయల విలువ చేసే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే, మీకు 20 ఏళ్ల పాటు ఏడాదికి రూ .30,000 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కానీ, అదే పాలసీని మీరు 30 ఏళ్ళ వయస్సులోనే తీసుకుంటే.. 35 ఏళ్ల పాటు ఏడాదికి కేవలం రూ .10,000 మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల, మీరు కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలోనే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం ఎంతో లాభదాయకమని గుర్తించుకోండి.

    రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్స్..
    అందువల్ల, కెరీర్ ప్రారంభంలో మీ ఆదాయం తక్కువగా ఉన్నా సరే.. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీతో మీ కుటుంబానికి చాలా తక్కువ ఖర్చుతోనే సమగ్ర కవరేజీని అందించవచ్చు. అంతేకాక, మీరు 30 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు పెద్దగా బాధ్యతలు ఉండవు కాబట్టి, టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజీని కొనడం కూడా సులభమనే చెప్పవచ్చు. వయస్సు పెరుగుతున్న కొద్ది బాధ్యతలతో పాటు ఖర్చులు కూడా పెరగడం, అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉండటంతో మీరు ఎక్కువ మొత్తంలో వెచ్చించి పాలసీ తీసుకోవడం సాధ్యం కాకపోవచ్చని అధిల్ శర్మ అభిప్రాయపడ్డారు.

    Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్లాన్ రివర్స్.. కథ మళ్లీ మొదటికొచ్చిందా ?

    Harish Rao: హరీశ్ రావుకు మరో కీలక బాధ్యతలు.. కేసీఆర్ నిర్ణయం.. త్వరలోనే ప్రకటన..

    ఇక, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల ద్వారా అనేక పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీదారులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపుకు అర్హులు. దీనితో పాటు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10 (10 డి) కింద డెత్ బెనిఫిట్స్పై పన్ను మినహాయింపును కూడా పొందవచ్చు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Insurance

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు