Zomato : జొమాటోపై నెటిజన్ల ఫైర్... పడిపోయిన యాప్ రేటింగ్...

Zomato App : రెండ్రోజుల కిందట ఇదే జొమాటో... నెటిజన్ల నుంచీ ప్రశంసలు అందుకుంది. అంతలోనే మరో వివాదం ఆ యాప్‌ రేటింగ్‌ని అమాంతం పడేసింది. అసలేం జరిగిందో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: August 2, 2019, 9:52 AM IST
Zomato : జొమాటోపై నెటిజన్ల ఫైర్... పడిపోయిన యాప్ రేటింగ్...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: August 2, 2019, 9:52 AM IST
మీకు తెలుసు... రెండ్రోజుల కిందట... మత పరమైన అంశంలో జొమాటో యాప్‌కి నెటిజన్లు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ముస్లిం డెలివరీ బాయ్‌తో తన ఆర్డర్ పుడ్ పంపవద్దని ఓ కస్టమర్ కోరడంతో... అలా కుదరదన్న జొమాటో... ఫుడ్‌కి మతం ఉండదనీ... ఎవరు డెలివరీ చేసినా తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. అందుకు ఒప్పుకోని ఆ కస్టమర్... తన ఆర్డర్‌ను కేన్సిల్ చేసుకున్నాడు. వెంటనే జొమాటో... తమకు ఆర్డర్ పోయినా పర్వాలేదనీ... మత పరమైన తేడాలు తాము చూపబోమని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని చెబుతూ ట్విట్టర్‌లో ట్వీట్ పెట్టింది. ఈ ట్వీట్‌ని సమర్థిస్తూ... చాలా మంది నెటిజన్లు జొమాటోని మెచ్చుకున్నారు. ఇకపై మేం జొమాటోలోనే ఫుడ్ ఆర్డర్ ఇస్తామని చాలా మంది అన్నారు. రెండ్రోజులు గడవక ముందే... సీన్ రివర్సైంది. అదే జొమాటోపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రేటింగ్ కూడా పడిపోతోంది.




ఫుడ్‌కి మతంతో సంబంధం లేదన్న జొమాటో... తన మెనూలో... "హలాల్" అనే పేరుతో ఉన్న ఫుడ్ కూడా ఉంచింది. "హలాల్" అనేది ముస్లింల కోసం ప్రత్యేకంగా వండే ఆహార విధానం. మతంతో సంబంధం లేదనే జొమాటో... మరి హలాల్ అనే ఫుడ్ ఐటెంని ఎందుకు ప్రత్యేకంగా పెట్టిందని ప్రశ్నించారు ఓ నెటిజన్. ఎవరైనా హలాల్ మీట్ ఇవ్వమని ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా జొమాటో... ఫుడ్‌కి మతంతో పని లేదని చెబుతోందా? అని నిలదీశారు ఆ నెటిజన్. ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలని చాలా మంది నెటిజన్లు కూడా జొమాటోను నిలదీశారు.
Loading...


సీన్ రివర్స్ అవ్వడంతో జొమాటో అప్రమత్తమైంది. విమర్శకులకు సమాధానంగా ఓ వివరణాత్మక నోట్‌ను రిలీజ్ చేసింది. ప్రజలు ప్రత్యేకించి హలాల్ అని అడుగుతున్నారనీ, అందువల్ల ప్రజల కోరిక మేరకే... యాప్ తయారీలో అలాంటి ఫుడ్ ఆర్డర్‌ను కూడా పెట్టామనీ, అది మతపరంగా కాదనీ, కస్టమర్లకు యూజర్ ఫ్రెండ్లీగా యాప్‌ని ఉంచేందుకే పెట్టామని చెప్పింది.


ఈ సమాధానం నెటిజన్లను సంతృప్తి పరచలేదు. ట్విట్టర్‌లో వెంటనే #ZomatoUninstalled అనే హ్యాష్ ట్యాగ్ క్రియేట్ అయ్యింది. ఫుడ్ పేరుతో మతాన్ని జొమాటో స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోందని నెటిజన్లు మండిపడుతున్నారు.

జొమాటోపై నెటిజన్ల ఫైర్


జొమాటోపై నెటిజన్ల ఫైర్


జొమాటోపై నెటిజన్ల ఫైర్


కొంతమందైతే ఆ జొమాటోకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో... గూగుల్ ప్లే స్టోర్‌లో జొమాటో యాప్‌కి సింగిల్ స్టార్ రేటింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు.

రెండ్రోజుల కిందట జొమాటోకి సపోర్ట్‌గా నిలిచింది ఉబెర్ ఈట్స్ (Uber Eats). ఇప్పుడు ఆ కంపెనీ కూడా రూట్ మార్చేసింది. ఎవరైనా సరే... మత పరంగా వివక్ష చూపరాదని అభిప్రాయం వ్యక్తం చేసింది.
First published: August 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...