Home /News /business /

PENSIONERS GET MORE TIME TO SUBMIT LIFE CERTIFICATE KNOW DETAILS GH SK

Life Certificate: పెన్షనర్లకు గుడ్​న్యూస్​.. లైఫ్​ సర్టిఫికెట్​ సబ్​మిట్​ చేసే గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Life Certificate: పెన్షనర్లకు గుడ్​న్యూస్​. ఈ ఏడాది పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే గడువు పొడగించింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పెన్షనర్లు డిసెంబర్​ 31 వరకు లైఫ్ సర్టిఫికేట్ సబ్​మిట్​ చేసే అవకాశం కల్పించింది.

ఇంకా చదవండి ...
పెన్షనర్లకు (Pensioners)  గుడ్​న్యూస్​. ఈ ఏడాది పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే గడువు పొడగించింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పెన్షనర్లు డిసెంబర్​ 31 వరకు లైఫ్ సర్టిఫికేట్ సబ్​మిట్​ చేసే అవకాశం కల్పించింది. కోవిడ్ -19 మహమ్మారి(Covid-19 Pandemic) కారణంగా సీనియర్ సిటిజన్లు తరచుగా బయటకు వెళ్లలేని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, పెన్షనర్లు ప్రతి ఏటా లైఫ్​ సర్టిఫికెట్​​ సబ్​మిట్​ చేయాల్సి ఉంటుంది. దీన్నే జీవన్ ప్రమాణ్ పత్ర (Jeevan Paraman Patra) అని కూడా పిలుస్తారు. ఇది పెన్షనర్లు తాము జీవించి ఉన్నామని తెలిపే ధృవీకరణ పత్రం. నిర్ణీత కాలంలో ఈ సర్టిఫికెట్​ సబ్​మిట్​ చేస్తేనే ప్రతి నెలా పెన్షన్​ అందుతుంది. సాధారణంగా, పెన్షనర్లు ప్రతి ఏడాది నవంబర్ 30 లోపు తమ జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించాలి. అయితే, కరోనా భయాందోళనల నేపథ్యంలో సీనియర్​ సిటిజన్లు జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి భౌతికంగా బ్యాంకు శాఖలకు రావడం ఇబ్బందిగా మారింది. దీంతో, డిసెంబర్​ 31 వరకు గడువు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ఆన్​లోనూ సబ్​మిట్​ చేసే అవకాశం కల్పిస్తోంది.

Gold Rate today: పసిడి ప్రియులకు పండగే.. ఒమిక్రాన్ దెబ్బకు భారీగా తగ్గిన  బంగారం విలువ

ఆన్​లైన్​లో సబ్​మిట్ చేసే ప్రాసెస్​..

కాగా,పెన్షనర్లు భౌతికంగా అంటే బ్యాంకు, పోస్టాఫీసు వెళ్లి గానీ, డోర్ స్టెప్ విధానంలో ఇంటి వద్ద గానీ, డిజిటల్ విధానంలో గానీ లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయవచ్చు. అయితే, లైఫ్ సర్టిఫికేట్‌లను పొందేందుకు బ్యాంకు శాఖల వద్ద రద్దీ పెరిగే అవకాశం ఉంది. తద్వరా సీనియర్ సిటిజన్లు కరోనా భారీన పడే ప్రమాదం ఉంది. దీన్ని గుర్తించి ఆన్​లైన్​లో కూడా పెన్షన్​ సర్టిఫికెట్​ సబ్​మొట్ చేసే అవకాశం కల్పిస్తోంది. ఇప్పుడు జీవన్ ప్రమాణ్ వెబ్‌సైట్ www. jeevanpramaan.gov.in లేదా యాప్ ద్వారా డిజిటల్‌ రూపంలో లైఫ్​​ సర్టిఫికేట్లను సబ్​మిట్​ చేయవచ్చు.

Pension Scheme: నెలకు రూ.210 దాచుకుంటే రూ.5,000 పెన్షన్... స్కీమ్  వివరాలు ఇవే

ముందుగా పెన్షనర్లు తమను తాము నమోదు చేసుకోవడానికి మొదట జీవన్ ప్రమాణ్ మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇక్కడ, దరఖాస్తుదారు వారి ఆధార్ నంబర్, పెన్షన్ చెల్లింపు ఆర్డర్, బ్యాంక్ ఖాతా నంబర్, బ్యాంక్ పేరు, మొబైల్ నంబర్‌ను ఎంటర్​ చేయాలి. ఆ తర్వాత మీ వేలిముద్రను సమర్పించాలి. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్​ఎమ్​ఎస్​ వస్తుంది. ఇది లైఫ్ సర్టిఫికేట్ ఐడీని కలిగి ఉంటుంది. ఆ తర్వాత మీ లైఫ్ సర్టిఫికేట్ యాక్సెస్ చేయవచ్చు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Business, Money, Pensioners

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు