Pension Schemes: ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా...రిటైర్ మెంట్ తర్వాత పెన్షన్ కావాలా...అయితే ఇది మీకోసం...

(ప్రతీకాత్మక చిత్రం)

సీనియర్​ సిటిజన్లకు రిటైర్​మెంట్​ తర్వాత ఆర్థిక భరోసా కల్పించేందుకు ఎల్​ఐసీ సరల్​ పెన్షన్​ స్కీమ్​ను ప్రారంభించింది. దీని కింద నాన్​ లింక్​డ్​, నాన్​ పార్టిసిపేటింగ్​, సింగిల్ ప్రీమియం, ఇండివిజువల్ వంటి​ పర్సనల్​ తక్షణ యాన్యుటీ ప్లాన్లను అందజేస్తుంది.

  • Share this:
భారతదేశంలోని సీనియర్ సిటిజన్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఆఫ్ ఇండియా (లాసి) ప్రకారం, ఈ జనాభా 2050 నాటికి మూడు రెట్లు పెరగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం సీనియర్ సిటిజన్ల సంఖ్య 103 మిలియన్లు లేదా మొత్తం జనాభాలో 8.6 శాతం ఉండగా, ఈ సంఖ్య ఏటా 3 శాతం పెరిగి రాబోయే మూడు దశాబ్దాల్లో దాదాపు 320 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఇక, ఇంటర్నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపిఎల్) నివేదిక ప్రకారం, 75 శాతం మంది సీనియర్ సిటిజన్లు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారు. 40 శాతం వైకల్యం సమస్యలతో, 20 శాతం మానసిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా​ మరణాల్లో 63 శాతం మంది సీనియర్​ సిటిజన్లే ఉండటం గమనార్హం. ఈ క్రమంలో సీనియర్​ సిటిజన్ల ఆర్థిక అసరాలను ఈ వ్యాధులు గుర్తు చేస్తున్నాయి.

అందుకే ఇటీవలి కాలంలో పెన్షన్, గ్రూప్ ఫండ్స్​లో ఇన్వెస్ట్​ చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుదలను చూసింది. IRDAI ఇండియన్ ఇన్సూరెన్స్ హ్యాండ్​బుక్ ప్రకారం, పెన్షన్​ స్కీమ్​ల మార్కెట్​ వాల్యూ 2014లో 17.25 శాతం ఉండగా.. 2020 నాటికి అది దాదాపు 23 శాతానికి పెరిగింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో పెన్షన్, గ్రూప్, జనరల్ యాన్యుటీ ఫండ్స్ మార్కెట్​ విలువ మొత్తం రూ .898,045 కోట్లుగా నమోదైంది.

టాప్​ 5 పెన్షన్ స్కీమ్స్ ఇవే​..

ఎల్​ఐసీ సరల్​ పెన్షన్​ స్కీమ్​
సీనియర్​ సిటిజన్లకు రిటైర్​మెంట్​ తర్వాత ఆర్థిక భరోసా కల్పించేందుకు ఎల్​ఐసీ సరల్​ పెన్షన్​ స్కీమ్​ను ప్రారంభించింది. దీని కింద నాన్​ లింక్​డ్​, నాన్​ పార్టిసిపేటింగ్​, సింగిల్ ప్రీమియం, ఇండివిజువల్ వంటి​ పర్సనల్​ తక్షణ యాన్యుటీ ప్లాన్లను అందజేస్తుంది. ఈ స్కీమ్​లో చేరేందుకు 40 నుంచి 80 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తులకు అర్హత ఉంటుంది. దీనిలో కనీసం రూ .12,000 పెట్టుబడి పెట్టాలి. నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక ప్రణాళికలతో చెల్లింపులు జరపవచ్చు. ఈ స్కీమ్​లో చేరిన వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే అతని పెట్టుబడికి 100 శాతం రాబడి వస్తుంది.

ఎన్‌పిఎస్ (జాతీయ పెన్షన్ పథకం)
సీనియర్ సిటిజన్లు ఎంచుకోగల అత్యంత ప్రజాదరణ పొందిన స్కీమ్​ జాతీయ పెన్షన్​ స్కీమ్​. ఈ స్కీమ్​ కింద ఎన్నో రకాలుగా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. మూడేళ్ల తర్వాత ఫండ్​ను విత్​డ్రా చేసుకోవచ్చు. మధ్యలో ఎప్పుడైనా విత్​డ్రా చేసుకుంటే మొత్తం కార్పస్‌ ఫండ్​లో 25 శాతం లభిస్తుంది. ఇల్లు నిర్మాణం, ఇతర ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని విత్​డ్రా చేసుకోవచ్చు.

APY (అటల్ పెన్షన్ యోజన)
ఇది పెన్షన్ కమ్ రిటైర్మెంట్ స్కీమ్​ 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న భారతీయ పౌరులందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. 60 సంవత్సరాల తరువాత, 100 శాతం పెన్షన్​ను విత్​డ్రా చేసుకోవచ్చు. సమాజంలో అట్టడుగు, తక్కువ ఆదాయ వర్గాల వారు రిటైర్​మెంట్​ తర్వాత కూడా గౌరవప్రదంగా జీవించడం కోసం ఈ స్కీమ్​ను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ స్కీమ్​ ప్రభుత్వ -సహకారాన్ని కూడా అందిస్తుంది. వారికి అదనంగా సంవత్సరానికి రూ. 1,000 అదజేస్తుంది. ఇతర భద్రతా పథకాల పరిధిలోకి రాని వారికి మాత్రమే ఈ స్కీమ్​ అందుబాటులో ఉంటుంది.

పిఎమ్‌వివివై (ప్రధాన్ మంత్రి వయా వందన యోజన)
పిఎమ్‌వివివై 10 సంవత్సరాల కాలానికి 7.4 శాతం నెలవారీ హామీతో కూడిన పెన్షన్ అందిస్తుంది, తద్వారా రిటైర్​మెంట్​ తర్వాత స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్​లో మూడేళ్ల డిపాజిట్ తర్వాత 75 శాతం రుణం కింద తీసుకోవచ్చు. అయితే, ఈ స్కీమ్​లో పన్ను ప్రయోజనాలు ఉండవని గుర్తించుకోవాలి.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సంవత్సరానికి 7.4 శాతం చొప్పున రాబడిని అందించే ఒక అద్భుతమైన పథకం. కేవలం రూ. 1,000లతో ఎన్​పీఎస్​ఎస్​లో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ప్రారంభ పదవీకాలం ఐదేళ్ళు ఉంటుంది. ఆ తరువాత పదవీ కాలాన్ని మూడు సంవత్సరాల పాటు పొడిగించుకోవచ్చు. 60 ఏళ్లు పైబడిన పౌరులందరికీ ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఏదేమైనా, ఈ స్కీమ్​లో మీ గరిష్ట పెట్టుబడి మొత్తం రూ. 1,500,000 మించకూడదు, ఈ స్కీమ్​లో చేరిన వారికి సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి.

ఇది చూడండి..
Published by:Krishna Adithya
First published: