Home /News /business /

PENSION PLAN BEST INSURANCE POLICY FOR RETIREMENT SAVINGS NEWLY LAUNCHED ICICI FULL DETAILS HERE GH VB

Pension Plan: రిటైర్‌మెంట్ సేవింగ్స్ కోసం బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ.. తాజాగా ప్రారంభించిన ప్రముఖ బ్యాంక్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ (ICICI Prudential Life Insurance) ఒక అదిరిపోయే పెన్షన్ ప్రొడక్ట్ లాంచ్ చేసింది. ఐసీఐసీఐ ప్రూ గ్యారెంటీడ్ పెన్షన్ ప్లాన్ ఫ్లెక్సీ (ICICI Pru Guaranteed Pension Plan Flexi) అనే కొత్త పెన్షన్ ప్రొడక్ట్ పరిచయం చేసింది.

ఇంకా చదవండి ...
కరోనా సమయంలో చాలామంది ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. ఇదే సమయంలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసొచ్చింది. దీంతో భవిష్యత్తులో సరిపడా డబ్బు తమ వద్ద ఉండేలా ప్రజలు పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా రిటైర్‌మెంట్ (Retirement) తర్వాత లైఫ్ లాంగ్ గ్యారెంటీ ఇన్‌కమ్ పొందేలా చాలామంది ప్లాన్ చేస్తున్నారు. ఈ తరహా ప్రజల కోసమే తాజాగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ (ICICI Prudential Life Insurance) ఒక అదిరిపోయే పెన్షన్ ప్రొడక్ట్ లాంచ్ చేసింది. ఐసీఐసీఐ ప్రూ గ్యారెంటీడ్ పెన్షన్ ప్లాన్ ఫ్లెక్సీ (ICICI Pru Guaranteed Pension Plan Flexi) అనే కొత్త పెన్షన్ ప్రొడక్ట్ పరిచయం చేసింది. ఇది కస్టమర్లు దీర్ఘకాలికంగా రిటైర్‌మెంట్ సేవింగ్స్ (Retirement Savings) క్రమపద్ధతిలో సేవ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఏ ఇతర ఆదాయంపై ఆధారపడకుండా రిటైర్డ్ జీవితాన్ని గడపడానికి లైఫ్ లాంగ్ గ్యారెంటీ ఇన్‌కమ్ అందించేలా ఈ ప్రొడక్ట్‌ను ఐసీఐసీఐ రూపొందించింది.

కస్టమర్ల అన్ని అవసరాలకు అనుగుణంగా ఈ పెన్షన్ ప్లాన్‌ను ఏడు వేరియంట్‌లలో అందుబాటులో తెచ్చింది ఐసీఐసీఐ. యాక్సిలరేటెడ్ హెల్త్ బూస్టర్‌ (Accelerated Health Boosters)లతో లైఫ్ యాన్యుటీ, బూస్టర్ పేఅవుట్లతో లైఫ్ యాన్యుటీ వంటి స్పెషల్ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. కస్టమర్ల మెడికల్ కేర్, జీవనశైలి అవసరాలను తీర్చడానికి, లైఫ్ లాంగ్ గ్యారెంటీ ఇన్‌కమ్ అందించే యాన్యుటీ ప్రొడక్ట్స్ కోరుకునే కస్టమర్ల కోసం ఈ వేరియంట్‌లు రూపొందించారు. యాక్సిలరేటెడ్ హెల్త్ బూస్టర్ ఆప్షన్‌తో కస్టమర్లు తమ రోజువారీ ఖర్చుల కోసం అదనపు చెల్లింపును పొందుతారు. ఈ అదనపు మనీ ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కస్టమర్లకు వైద్య ఖర్చులను తీర్చడానికి వీలు కల్పిస్తుంది. బూస్టర్ పేఅవుట్ (Booster Payout) ఆప్షన్ కస్టమర్ల వార్షికాదాయానికి అదనంగా ఐదు లంప్ సమ్ (Lump Sum) పేమెంట్స్ అందిస్తుంది.

ఐసీఐసీఐ ప్రూ గ్యారెంటీడ్ పెన్షన్ ప్లాన్ ఫ్లెక్సీ జాయింట్ లైఫ్ యాన్యుటీ (ICICI Pru Guaranteed Pension Plan Flexi Joint Life Annuity) ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే.. ప్రీమియం చెల్లింపు సమయంలో మొదటి హోల్డర్ మరణిస్తే ప్రీమియం చెల్లించనక్కర్లేదు. ఇలాంటి సందర్భంలో ప్రీమియం వాయిదా వ్యవధి ముగిసిన తర్వాత రెండవ లేదా జాయింట్ హోల్డర్ లైఫ్ లాంగ్ గ్యారెంటీ ఇన్‌కమ్ పొందుతారు. అంతేకాదు మొదటి హోల్డర్ చనిపోయాక అన్ని ఫ్యూచర్ ప్రీమియంలు మాఫీ అవుతాయి. ఒకవేళ జాయింట్ హోల్డర్ మరణిస్తే.. పెట్టుబడి పెట్టిన మొత్తం ప్రీమియంలు నామినీ(ల)కి చెల్లిస్తారు. ఇది లెగసీ ప్లానింగ్ టూల్ గా పని చేస్తుంది.

Global Positioning System: స్మార్ట్‌ఫోన్లలో GPSను ఎందుకు డిసేబుల్ చేయాలి..? దీంతో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి..?


ఈ ప్రొడక్ట్ ప్రీమియం వాపసు (Return of Premium) కూడా వేస్తుంది. తీవ్ర అనారోగ్యం బారిన పడినప్పుడు కస్టమర్లు తాము కట్టిన ప్రీమియంలను వెనక్కి తీసుకోవచ్చు. వైద్య చికిత్స కోసం ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు. ఈ పొదుపు ప్లాన్ రెగ్యులర్ కంట్రిబ్యూషన్లను వాలెట్ ద్వారా చేసుకోవడానికి అనుమతిస్తుంది. ప్రజలు సౌకర్యవంతమైన రిటైర్డ్ జీవితాన్ని గడపాలంటే వారు తమ పదవీ విరమణకు ముందు ఆదాయంలో 70%-90% సమానమైన డబ్బు ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. పెరుగుతున్న ధరలు, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, అధిక ఆయుర్దాయం వంటి కారణాల వల్ల ప్రజలు తమ ఆర్థిక పోర్ట్‌ఫోలియోలో యాన్యుటీ ప్లాన్‌ను కలిగి ఉండటం చాలా ముఖ్యం.
Published by:Veera Babu
First published:

Tags: Health Insurance, Insurance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు