మీరు నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో డబ్బులు దాచుకుంటున్నారా? అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో నెలనెలా డబ్బులు జమ చేస్తున్నారా? ఈ పొదుపు పథకాల్లో మీకు ఏవైనా సమస్యలు ఉన్నాయా? ఎక్కడ కంప్లైంట్ చేయాలో, ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కావట్లేదా? అయితే మీ సమస్య తీరినట్టే. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ-PFRDA అంబుడ్స్‌మన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇమెయిల్ ఐడీ, ల్యాండ్‌లైన్ నెంబర్, పోస్టల్ అడ్రస్‌ను ప్రకటించింది. మీరు నేషనల్ పెన్షన్ స్కీమ్, అటల్ పెన్షన్ యోజన పథకాల్లో ఉంటే ఈ వివరాలను ఎక్కడైనా నోట్ చేసుకోవాలి. ఏవైనా సమస్యలు ఉంటే అంబుడ్స్‌మన్‌కు కంప్లైంట్ చేయొచ్చు. మీ ఫిర్యాదును 30 రోజుల్లో పరిష్కరిస్తారు. అంబుడ్స్‌మన్‌కు సంబంధించిన ఇమెయిల్, ఫోన్ నెంబర్, అడ్రస్ ఇవే.
ఇమెయిల్ ఐడీ: ombudsman@pfrda.org.in
ల్యాండ్‌లైన్ నెంబర్: 011 – 26517507
అడ్రస్: The Ombudsman, The office of Ombudsman, O/o Pension Fund Regulatory and Development Authority, Plot No-14/A, Chhatrapati Shivaji Bhawan, Qutab Institutional Area, New Delhi-110016
Pension Scheme: ఈ పెన్షన్ స్కీమ్‌లో ఉన్నవారికి సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్... ఆ తర్వాత పెనాల్టీ తప్పదు
Ration Card: రేషన్ కార్డు కావాలా? స్మార్ట్‌ఫోన్‌లోనే అప్లై చేయొచ్చు ఇలా
నేషనల్ పెన్షన్ స్కీమ్ 2004లో ప్రారంభమైంది. మొదట ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రారంభించిన ఈ స్కీమ్ 2009 లో సాధారణ ప్రజలకు, 2011లో కార్పొరేట్ ఉద్యోగులకు కూడా అందుబాటులోకి వచ్చింది. 18 ఏళ్ల నుంచి 65 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారెవరైనా నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో చేరొచ్చు. ఇక అటల్ పెన్షన్ యోజన వృద్ధాప్యంలో పెన్షన్ కోరుకునేవారి కోసం ప్రకటించిన పథకం. 18 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు డబ్బులు జమ చేయాలి. 60 ఏళ్ల వయస్సు నుంచి గరిష్టంగా రూ.5000 వరకు పెన్షన్ పొందొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Atal Pension Yojana, National Pension Scheme, Pension Scheme, Personal Finance