Home /News /business /

PENNY STOCKS CAN BE USED TO DEFRAUD INVESTORS ZERODHA S NITHIN KAMATH UMG GH

Stock Market Scams: ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్.. పెన్నీ స్టాక్స్‌తో బీ కేర్‌ఫుల్.. బడా బ్రోకరైజ్ సంస్థ హెచ్చరిక

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారత్‌లో అతిపెద్ద బ్రోకరేజీ సంస్థ అయిన జెరోధా (Zerodha) సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ (Nithin Kamath) గురించి తెలియని స్టాక్ ఇన్వెస్టర్ ఎవరూ ఉండరు. నితిన్ తరచుగా ట్రేడర్స్ (Traders) కోసం విలువైన టిప్స్ చెబుతుంటారు.

భారత్‌లో అతిపెద్ద బ్రోకరేజీ సంస్థ అయిన జెరోధా (Zerodha) సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ (Nithin Kamath) గురించి తెలియని స్టాక్ ఇన్వెస్టర్ ఎవరూ ఉండరు. నితిన్ తరచుగా ట్రేడర్స్ (Traders) కోసం విలువైన టిప్స్ చెబుతుంటారు. ఒక స్టాక్ బ్రోకర్ సీఈవో అయ్యుండి కూడా ట్రేడింగ్ చాలా రిస్కీ అని, ట్రేడింగ్‌లో సంపాదించడం దాదాపు అసాధ్యమని సలహాలిస్తుంటారు. ఇన్వెస్టర్లకు ఎప్పుడూ మంచీచెడుల గురించి తెలిపే నితిన్ ఇప్పుడు మరోసారి వాళ్లను హెచ్చరిస్తున్నారు. డీమ్యాట్ అకౌంట్ హోల్డర్లు (Demat Account Holders) తమ లాగిన్ వివరాలను ఇతరులతో పంచుకోవద్దని తాజాగా ఆయన హెచ్చరించారు. పెట్టుబడిదారులు మోసపోవడానికి ప్రధాన కారణం వారి లాగిన్ వివరాల (Login Details)ను ఇతరులతో పంచుకోవడమేనని నితిన్ వెల్లడించారు.

పెన్నీ స్టాక్స్ సహాయంతో మోసగాళ్లు కృత్రిమ నష్టాల (Artificial Losses)ను సృష్టించవచ్చని కామత్ తెలిపారు. "మోసగాళ్లు ధనాన్ని తరలించడానికి ఇల్లిక్విడ్ ఆప్షన్‌ (Illiquid Options)లు లేదా పెన్నీ స్టాక్‌లను ఉపయోగించి కృత్రిమ నష్టాలను సృష్టించవచ్చు," అని అతను చెప్పారు. ఈ పెన్నీ స్టాక్స్‌/ఇల్లిక్విడ్ ఆప్షన్స్ పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. "మీరు మీ బ్యాంక్ లాగిన్‌ వివరాలను ఎవరితో షేర్ చేయనట్లే, మీ ట్రేడింగ్ అకౌంట్ లాగిన్‌ వివరాలను కూడా ఎవరితోనూ షేర్ చేయకూడద"ని నితిన్ సూచించారు. ఫిషింగ్ మోసాల ద్వారా అకౌంట్స్‌లోని మనీ లేదా హోల్డింగ్స్ తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.

 ఇదీ చదవండి: యూరప్ మార్కెట్‌లో మన బ్యాగులకు ఫుల్ డిమాండ్.. మొత్తం ఒక్క విలేజ్ నుంచే వెళ్తాయంటా..! ఆ బ్యాగులను చూసేద్దామా..


"అధికారిక బ్రోకర్ వెబ్‌సైట్‌లు, యాప్‌లు కాకుండా ఎక్కడా లాగిన్ వివరాలను ఎంటర్ చేయకూడదు. లేదంటే రిస్క్‌లో పడినట్టే" అని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఏ గుర్తింపులేని సలహాదారులు భారీ రాబడిని ఆఫర్ చేస్తామని చెబుతారు. ఇలాంటి కొందరి మోసగాళ్లపై తమ టీమ్ కొరడా ఝుళిపించిందని కామత్ వెల్లడించారు. “ఫేక్ సలహాదారులు పెట్టుబడిదారులను ఆకర్షించడానికి అసాధారణమైన రాబడిని అందిస్తామని నమ్మబలుకుతారు. ఇది నిజమే అనుకుని ఆశ పడి చాలామంది ఇన్వెస్టర్లు వాట్సాప్, టెలిగ్రామ్‌లో అపరిచితులతో వారి అకౌంట్ యాక్సెస్‌ను పంచుకుంటారు." అని నితిన్ అన్నారు. ఇలా పంచుకుంటే నిండా మోసపోయినట్లే అవుతుందని జెరోధా వెబ్‌సైట్ పేర్కొంది.



"మోసగాళ్లు ఈమెయిల్‌ ద్వారా కూడా ఫిషింగ్ అటాక్ స్టార్ట్ చేస్తారు. ఈమెయిల్‌లోనే చాలా మంది కస్టమర్లు అన్ని లాగిన్ డీటెయిల్స్, బ్యాంక్ ట్రేడింగ్ అకౌంట్స్ స్టోర్ చేస్తారు. అందుకే వీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల"ని నితిన్ తెలిపారు. "చాలా మంది వారి ఈమెయిల్ అకౌంట్స్‌కు 2 ఫ్యాక్టర్‌ అథెంటికేషన్ సెటప్ చేసుకోరు. ఇది ఫిషింగ్ అటాక్ జరిగే ప్రమాదాన్ని మరింత పెంచుతుంది." అని నితిన్ హెచ్చరించారు. SEBI రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌ నుంచి సహాయం తీసుకున్నా లేదా ట్రేడ్ చేయడం ఎలా అనేదానిపై ట్రైనింగ్ పొందినా పర్లేదు కానీ మీ లాగిన్ లాగిన్ వివరాలను ఇతరులతో పంచుకోవడం చాలా ప్రమాదమని జెరోధా వెబ్‌సైట్ గతంలోనే పేర్కొంది. అలానే అర్థం కానీ ఆప్షన్స్‌లో ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిదని తెలిపింది. ఆప్షన్స్ చాలా ప్రమాదకరమైనవని.. వాటిని ట్రేడ్ చేసే ముందు వాటిని బాగా అర్థం చేసుకోవాలని సూచించింది.
Published by:Mahesh
First published:

Tags: BUSINESS NEWS, Investers, Stock Market, Stocks

తదుపరి వార్తలు