PEHLA KADAM AND PEHLI UDAAN ARE TWO TYPES OF SAVINGS ACCOUNTS FOR MINORS MK
Children's Day 2021: బాలల దినోత్సవం నాడు మీ పిల్లల పేరిట ఈ రెండు పనులు చేస్తే..కోటీశ్వరులు అవ్వడం ఖాయం..
ప్రతీకాత్మక చిత్రం
బాలల దినోత్సవం నాడు మీ పిల్లలకు ఇప్పటి నుంచే డబ్బు విలువ చెప్పాలనుకుంటున్నారా? ఆర్థిక క్రమశిక్షణ నేర్పించాలని అనుకుంటున్నారా? దేశీయ అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ సేవల విభాగంలో భాగంగా SBI పెహ్లా కదమ్, పెహిలి ఉడాన్ పేరిట రెండు సేవింగ్ అకౌంట్స్ మైనర్ పిల్లల కోసం ప్రారంభించింది.
బాలల దినోత్సవం నాడు మీ పిల్లలకు ఇప్పటి నుంచే డబ్బు విలువ చెప్పాలనుకుంటున్నారా? ఆర్థిక క్రమశిక్షణ నేర్పించాలని అనుకుంటున్నారా? దేశీయ అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ సేవల విభాగంలో భాగంగా SBI పెహ్లా కదమ్, పెహిలి ఉడాన్ పేరిట రెండు సేవింగ్ అకౌంట్స్ మైనర్ పిల్లల కోసం ప్రారంభించింది. దీని ద్వారా మీ చిన్న పిల్లలను ఆర్థిక భవిష్యత్తు కోసం సిద్ధం చేయడంలో ఈ అకౌంట్స్ సహాయపడతాయి. ఇదేకాకుండా డబ్బును ఆదా చేసే అలవాటును చిన్న వయసు నుంచే పెంచుతాయి. పెహ్లా కదమ్, పెహిలి ఉదాన్ పొదుపు ఖాతాకు సంబంధించిన కొన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం. మీరు మీ పిల్లలకు ఈ రెండింటిలో ఏదైనా ఓ అకౌంట్ తీసుకుంటే చాలా లాభాలున్నాయి. పిల్లలకు డబ్బు విలువ, పొదుపు వల్ల లాభాల గురించి తెలియజేసే అకౌంట్లు ఇవి. అంతేకాదు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ మీ పిల్లలకు ఆర్థిక పాఠాలు నేర్పించేవే. మరి ఈ రెండు అకౌంట్ల పూర్తి వివరాలేంటీ? ఏ అకౌంట్ తీసుకుంటే ఏం లాభం? తెలుసుకోండి.
పెహ్లా కదమ్, పేహ్లీ ఉడాన్ అకౌంట్లతో లాభాలేంటీ ?
పెహ్లా కదమ్ అకౌంట్‌ను ఏ వయస్సు మైనర్ అయినా తీసుకోవచ్చు. అయితే పేరెంట్ లేదా గార్డియన్ జాయింట్‌గా అకౌంట్ ఆపరేట్ చేస్తారు. పేహ్లీ ఉడాన్ 10 ఏళ్లు దాటిన మైనర్లు తీసుకోవచ్చు. ఒకరే అకౌంట్ ఆపరేట్ చేయాలి. ఈ రెండు అకౌంట్లకు మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ ఉండదు. గరిష్టంగా రూ.10 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. మైనర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, పేరెంట్ ఆధార్, పాన్ లేదా ఫామ్ 60 కావాలి. ఒకవేళ దరఖాస్తుదారులకు ఆధార్ లేకపోతే ఎన్రోల్మెంట్ అప్లికేషన్‌ను ఆధారంగా చూపించొచ్చు. లేదా ఫామ్ 60తో పాటు అఫిషియల్లీ వేలిడ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. ఈ రెండు అకౌంట్లకు చెక్‌బుక్స్ ఇస్తుంది బ్యాంకు. పెహ్లా కదమ్ అకౌంట్ అయితే పేరెంట్ లేదా గార్డియన్, పేహ్లీ ఉడాన్ అకౌంట్ అయితే అకౌంట్ హోల్డర్ చెక్కుపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఏటీఎం కార్డు విషయంలోనూ ఇవే నిబంధనలు వర్తిస్తాయి.
సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌కు ఉన్న వడ్డీ రేట్లే పెహ్లా కదమ్, పేహ్లీ ఉడాన్ అకౌంట్లకు ఉంటాయి. అకౌంట్ నెంబర్ మార్చాల్సిన అవసరం లేకుండా ఇతర ఎస్బీఐ బ్రాంచ్‌కు అకౌంట్ మార్చుకోవచ్చు. నామినేషన్ సదుపాయం కూడా ఉంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన పాస్‌బుక్ ఉచితంగా ఇస్తుంది బ్యాంకు. పెహ్లా కదమ్ అకౌంట్ అయితే పేరెంట్కు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ కవర్ లభిస్తుంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.