PayU to buy out BillDesk : ‘పే యూ’గా మారిన బిల్ డెస్క్.. రూ.34,376 కోట్ల ఒప్పందం

(ప్రతీకాత్మక చిత్రం)

దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ పేమెంట్‌లు నిర్వ‌హించే సంస్థ‌ బిల్‌డెస్క్‌. ఈ సంస్థను నెద‌ర్లాండ్స్(Netherlands) కంపెనీ ప్రోస‌స్ రూ.34,376 కోట్లు చెల్లించి టేకోవర్ చేయనుంది. ఇక‌పై ఈ రెండు సంస్థ‌ల భాగ‌స్వామ్యంతో ఈ పేమెంట్ మ‌ర్చంట్ పేరు "పే యూ"(PayU)గా మారుతుంది. డిజిట‌ల్ పేమెంట్స్(Digital Payment) రంగంలోని ఇది పెద్ద డీల్.

  • Share this:
    మ‌నం రోజూ ఎన్నో ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్‌లు నిర్వ‌హిస్తాం. అందులో మ‌న‌కు క‌నిపించే మ‌ర్చంట్ పేయ‌ర్ అధికంగా బిల్ డెస్క్ (Bill Desk) మ‌నం అంతా ఎన్నోసార్లు ఈ పేరును చూశాం. ఇక మీద ఆ పేరు క‌న‌బ‌డ‌దు. దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ పేమెంట్‌లు నిర్వ‌హించే సంస్థ‌ను డిజిట‌ల్ పేమెంట్స్ రంగంలోని బిల్‌డెస్క్‌ను నెద‌ర్లాండ్స్(Netherlands) కంపెనీ ప్రోస‌స్ చేతిలోకి వెళ్తుంది. ఇక‌పై ఈ రెండు సంస్థ‌ల భాగ‌స్వామ్యంతో ఈ పేమెంట్ మ‌ర్చంట్ పేరు "పే యూ"(PayU)గా మారుతుంది.
    ఈ విలువ రూ.34,376 కోట్లు ఉన్న‌ట్లు కంపెనీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనిపై సంస్థ ప్ర‌తినిధులు మాట్లాడుతూ తాజా ఒప్పందంతో డిజిట‌ల్ ఇండియాలోని పేమెంట్(Payment)  రంగంలో ప్రోసస్ పెట్టుబ‌డుల విలువ మొత్తం రూ.73 వేల కోట్లు (10 బిలియ‌న్ డాల‌ర్ల‌)కు చేరుతుంద‌ని తెలిపారు. ఇక మీద బిల్ డెస్క్ కార్య‌క‌లాపాలు ఇండియాలో పేయూ పేరుమీదుగా నిర్వ‌హించుంది. అయితే ఈ ఒప్పందానికి కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదముద్ర వేయాల్సి ఉంది.
    బిల్ డెస్క్‌కు 20 ఏళ్లు..
    ఆర్థర్‌ ఆండర్సన్‌ సంస్థలో పనిచేసిన అజయ్ కుషాల్, ఎంఎన్‌ శ్రీనివాసు, కార్తీక్‌ గణపతి 2000 సంవత్సరంలో బిల్‌డెస్క్ ను ప్రారంభించారు. అతి తక్కువ కాలంలోనే ఇండియాలో లాభదాయకమైన ఫిన్‌ టెక్‌ కంపెనీలలో బిల్‌ డెస్క్ ఒకటిగాonline నిలిచింది. దేశంలోని అతిపెద్ద బ్యాంకుల‌తో స‌హా పెద్ద సంఖ్య‌లో మ‌ర్చంట్, టెలికం(Telecom), ఇన్సూరెన్స్ ఇత‌ర యుటిలిటీలు బిల్‌డెస్క్ సేవ‌లు వినియోగించుకొంటున్నాయి.

    Two PF accounts: రెండో ఈపీఎఫ్ అకౌంట్ తప్పనిసరి... వారికి మాత్రమే


    ప్రస్తుతం దేశంలో ఉన్న అతి పెద్ద ఆన్‌లైన్‌ పేమెంట్‌ కంపెనీలలో బిల్ డెస్క్ ఒకటి. ఈ కంపెనీ చేసుకొన్న ఒప్పందం మార్కెట్‌పై క‌చ్చితంగా ప్ర‌భావం చూపుతుంది. ఈ ఆర్ధిక సంవత్సరం అంటే 2021లో బిల్ డెస్క్ రూ.270 కోట్ల నికర ఆదాయం సాధించింది. ఒప్పంద మొత్తం చూస్తే తెలుస్తుంది ఇండియాలో ఆన్‌లైన్ పేమెంట్‌(Online Payment)కు మంచి భ‌విష్య‌త్ ఉంద‌ని.
    లీడింగ్ కంపెనీగా పేయూ
    పేయూ-బిల్‌డెస్క్ క‌ల‌యితో లీడింగ్ డిజిట‌ల్ కంపెనీ అవ‌త‌రిస్తుందని, ఇండియా ఫ‌న్ టెక్ రంగంలో ఎద‌గ‌డానికి మ‌రిన్ని అవ‌కాశాలు క‌లుగుతాయ‌ని పేయూ ఇండియా సీఈఓ అనిర్వాన్ ముఖ‌ర్జి పేర్కొన్నారు. 2005 నుంచి ఇప్ప‌టి దాకా ఇండియా(India)లోని టెక్ కంపెనీల‌లో 6 బిలియ‌న్ డాల‌ర్ల దాకా ప్రోస‌స్ గ్రూప్ పెట్టుబ‌డులు పెట్టింద‌ని వెల్ల‌డించారు. గ్లోబ‌ల్‌గా 20 మార్కెట్ల‌లో ఆన్‌లైన్ పేమెంట్ ప్రొవైడ‌ర్‌గా ఉన్న ప్రొస‌స్ గ్రూప్ 147 బిలియ‌న్ డాల‌ర్ల పేమెంట్ వాల్యూను(Value) నిర్వ‌హిస్తుంద‌ని చెప్పారు. రెండు కంపెనీలు క‌లిసిన త‌ర్వాత ఏటా 4 బిలియ్ ట్రాన్సాక్ష‌న్‌లు నిర్వ‌హించ‌గ‌ల‌గుతామ‌ని పేయూ ఇండియా ఆశాభావం వ్య‌క్తం చేస్తోంది.
    భారత్‌లో ఇప్పటి వరకు 600 కోట్ల డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టామని, బిల్‌డెస్క్‌ డీల్‌ ద్వారా భారత్‌లో తమ పెట్టుబడుల మొత్తం 1,000 కోట్ల డాలర్ల మార్కును దాటిపోయామని ప్రొసస్‌ కంపెనీ యాజ‌మాన్యం వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు బిల్‌డెస్క్‌లో జ‌న‌ర‌ల్ అట్లాంటిక్‌, వీసా, టీఏ అసోసియేట్ల పెట్టుడులు పెట్టాయి. కానీ ప్రోస‌స్ పెట్టుబ‌డి అతి పెద్ద‌ది ఇక‌పై బిల్ డెస్క్‌నిర్వ‌హ‌ణ అంతా ప్రొసెస్ చూసుకొంటుంది.
    Published by:Sharath Chandra
    First published: