news18-telugu
Updated: October 16, 2020, 6:23 PM IST
Paytm: పేటీఎం వ్యాలెట్‌కు డబ్బు యాడ్ చేస్తున్నారా? మీకు షాకే
(ప్రతీకాత్మక చిత్రం)
పేటీఎం వినియోగదారులకు ఒక షాకింగ్ న్యూస్. ఇప్పటి నుంచి క్రెడిట్ కార్డు ద్వారా Paytm వాలెట్‌కు యాడ్ చేసే డబ్బుపై రెండు శాతం ఫీజు వసూలు చేయనున్నట్టు మార్కెట్ వర్గాల సమాచారం. ఇప్పటి వరకు ఈ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫాంలో రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తేనే ఫీజు వసూలు చేస్తున్నారు. ఈ అంశంపై పేటీఎం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. కొత్త మార్పుల గురించి వివరాలను ఒక ఆన్లైన్ మీడియా సంస్థ వెల్లడించింది. క్రెడిట్ కార్డు లావాదేవీలపై బ్యాంకులకు తాము అధిక ఛార్జీలను చెల్లిస్తున్నామని పేటీఎం చెబుతోంది. ఈ లోటును భర్తీ చేయడానికి నామమాత్రపు రుసుమును ప్రవేశపెట్టినట్లు ఆ సంస్థ సంబంధిత వార్తాసంస్థ కథనాన్ని ఉద్దేశించి వెల్లడించింది.
Best Smart TVs: రూ.30,000 లోపు డిస్కౌంట్లో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవేFlash Sale: ఒక్క రూపాయికే స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ... ఫ్లాష్ సేల్ ఎప్పుడంటే
లొసుగులతో లబ్ధి పొందుతున్నారు
పేటీఎం అందిస్తున్న సేవల్లో లొసుగులను కొంతమంది వినియోగదారులు సొమ్ము చేసుకుంటున్నారు. క్రెడిట్ కార్డులు అందించే 40 డేస్ ఇంట్రస్ట్ ఫ్రీ పీరియడ్ స్కీమ్ ద్వారా పేటీఎం వాలెట్‌కు డబ్బు యాడ్ చేసుకొని (ఇండైరెక్ట్ అండ్ లాంగర్ మెథడ్ ద్వారా) లబ్ది పొందుతున్నారు. దీన్ని నివారించడానికే కొత్త నియమాలు తీసుకొస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి డెబిట్ కార్డులు, యూపీఐ ద్వారా పేటీఎం వాలెట్‌కు డబ్బు యాడ్ చేస్తే ఎటువంటి ఫీజులు వసూలు చేయట్లేదు.
పోటీ సంస్థల్లో ఫీజు లేదు
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. Paytm కూడా క్రెడిట్ కార్డు ద్వారా రూ.50, అంతకన్నా ఎక్కువ డబ్బును పేటీఎం వాలెట్‌కు బదిలీ చేస్తే రూ.200 వరకు క్యాష్‌బ్యాక్ పొందే ఆఫర్‌ను అందిస్తోంది. Paytmకు పోటీదారులైన ఫోన్‌పే, మోబిక్విక్ వాలెట్ సంస్థలు ఎలాంటి ఛార్జీలనూ వసూలు చేయడంలేదు. ఈ విభాగంలో అగ్ర స్థానం కోసం ఈ సంస్థలు పోటీపడుతున్నాయి.
Amazon Great India Festival: అమెజాన్ సేల్‌లో ఈ 18 స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్
Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 20 స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్
యాప్ స్టోర్ ద్వారా సేవల విస్తరణ
ఈ నెల మొదటి వారంలోనే Paytm సొంతంగా మినీ యాప్ స్టోర్‌ను ప్రారంభించింది. దీన్ని Paytm యాప్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇండియన్ డెవలపర్లకు సహాయం చేయడానికి ఈ సేవలను ప్రారంభిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. తమ యాప్ స్టోర్ ద్వారా టెక్ దిగ్గజం గూగుల్‌తో పోటీ పడటమే లక్ష్యంగా పేటీఎం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే మినీ యాప్ స్టోర్‌లో పది లక్షల యాప్‌లకు సపోర్ట్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు డెకాథ్లాన్, ఓలా, రాపిడో, నెట్‌మెడ్స్, 1ఎంజి, డొమినోస్ పిజ్జా, ఫ్రెష్‌మెనూ, నోబ్రోకర్ వంటి 300కి పైగా యాప్‌లు మినీ యాప్ స్టోర్‌లో చేరాయి.
Published by:
Santhosh Kumar S
First published:
October 16, 2020, 6:22 PM IST