మీకు పేటీఎం నుంచి ఆ మెసేజ్ వచ్చిందా? క్షమాపణలు చెప్పిన ఇ-వ్యాలెట్

ఇంతకీ ఏం జరిగింది? పేటీఎం నుంచి ఆ మెసేజ్ ఎందుకు వచ్చింది? తమకే అలా వచ్చిందా? లేక మిగతావాళ్లూ ఇలాంటి మెసేజ్‌లు పొందారా? అని నెటిజన్లు ఒకటే చర్చించుకున్నారు. ట్విట్టర్‌లో అయితే ఈ మెసేజ్ గురించే పెద్ద చర్చే జరిగింది. వరుసగా ట్వీట్స్, ట్రోల్స్ మొదలయ్యాయి.

news18-telugu
Updated: January 8, 2019, 5:50 PM IST
మీకు పేటీఎం నుంచి ఆ మెసేజ్ వచ్చిందా? క్షమాపణలు చెప్పిన ఇ-వ్యాలెట్
మీకు పేటీఎం నుంచి ఆ మెసేజ్ వచ్చిందా? క్షమాపణలు చెప్పిన ఇ-వ్యాలెట్
  • Share this:
పేటీఎం... ఇండియాలో పరిచయం అక్కర్లేని ఇ-వ్యాలెట్ సంస్థ. తమ ఖాతాదారులందరికీ పేటీఎం క్షమాపణలు చెప్పింది. కారణం... పొరపాటున అందరికీ ఓ మెసేజ్ పంపడమే. ఇంతకీ ఆ మెసేజ్ ఏంటో తెలుసా? “hey, ghvkjfjg”. అవును... ఇదే ఆ మెసేజ్. పేటీఎం యూజర్లందరికీ ఈ మెసేజ్ వెళ్లింది. అందరూ షాకయ్యారు కూడా. మామూలుగా పేటీఎం నుంచి ఆఫర్లు, వ్యాలెట్ లావాదేవీలకు సంబంధించిన మెసేజ్‌లు వస్తుంటాయి. కానీ... “hey, ghvkjfjg” అని మెసేజ్ రావడంతో యూజర్లు కంగారుపడ్డారు. పొరపాటున వచ్చిన మెసేజ్ కావచ్చని కొందరు అనుకున్నా... ఇంకొందరు మాత్రం ఇదేదో హ్యాకర్లు పంపిన మెసేజ్‌లా ఉందని భయపడ్డారు.

ఇంతకీ ఏం జరిగింది? పేటీఎం నుంచి ఆ మెసేజ్ ఎందుకు వచ్చింది? తమకే అలా వచ్చిందా? లేక మిగతావాళ్లూ ఇలాంటి మెసేజ్‌లు పొందారా? అని నెటిజన్లు ఒకటే చర్చించుకున్నారు. ట్విట్టర్‌లో అయితే ఈ మెసేజ్ గురించే పెద్ద చర్చే జరిగింది. వరుసగా ట్వీట్స్, ట్రోల్స్ మొదలయ్యాయి.అంతేకాదు... అసలు “hey, ghvkjfjg” అర్థమేంటో తెలుసుకుందామని గూగుల్‌లో సెర్చ్ చేశారు నెటిజన్లు. గూగుల్‌లో ghvkjfjg అని సెర్చ్ ట్రెండ్ ఎలా ఉందో ఈ చార్ట్ చూడండి.

మీకు పేటీఎం నుంచి ఆ మెసేజ్ వచ్చిందా? క్షమాపణలు చెప్పిన ఇ-వ్యాలెట్ | Paytm users received error message, e-wallet issued an apology
గూగుల్ ట్రెండ్స్‌లో "ghvkjfjg " అర్థం వెతికిన నెటిజన్లు


ఇంత రచ్చరచ్చ కావడంతో చివరకు పేటీఎం స్పందించాల్సి వచ్చింది. ఆ మెసేజ్ పొరపాటున వచ్చిందని, ఇకపై అలాంటివి రాకుండా చూసుకుంటామని యూజర్లకు ట్విట్టర్‌లో క్షమాపణలు చెప్పింది పేటీఎం.అసలు జరిగినదేంటో పేటీఎం చెప్పిన తర్వాత యూజర్లు హమ్మయ్య అనుకున్నారు. మొత్తానికి పొరపాటున వచ్చిన ఓ మెసేజ్ పేటీఎం యూజర్లలో కాస్త కలకలం రేపినట్టైంది.

ఇవి కూడా చదవండి:

Good News: మళ్లీ మొదలైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు

పేటీఎంకు పోటీగా 'ఎంఐ పే' తీసుకొచ్చిన షావోమీ

పేటీఎం వాడుతున్నారా? యాప్‌లో ఇక ఆ ఫీచర్ ఉండదు

పేటీఎం కొత్త స్కీమ్... బ్యాంకు ఎఫ్‌డీ కన్నా ఎక్కువ లాభం
First published: January 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు